sanction
-
చిరు వ్యాపారులకు రుణాల్లో భారీగా ఏపీ ‘ముద్ర’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత నాలుగేళ్లలో ప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) కింద చిన్న వ్యాపారులకు రుణాల మంజూరులో భారీగా వృద్ధి నమోదైంది. స్వయం ఉపాధి కోసం ముద్ర యోజన కింద ఎటువంటి పూచీ కత్తు లేకుండా రాష్ట్రంలో గత నాలుగేళ్లలోనే 44.63 లక్షల మందికి రూ. 49,313 కోట్ల మేర రుణాలను బ్యాంకులు మంజూరు చేశాయి. ఇందులో అత్యధికంగా మహిళలకే మంజూరయ్యాయి. ఇప్పటికే చేస్తున్న వ్యాపారాలను మరింత విస్తరించడానికి లేదా కొత్తగా వ్యాపారం చేసేందుకు ముద్ర రుణాలను మంజూరు చేశారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి కోవిడ్ సమయంలో తిరిగి రాష్ట్రానికి వచ్చిన వారికి జీవనోపాధి కల్పించడానికి ముద్ర రుణాలను రాష్ట్ర ప్రభుత్వం విరివిగా ఇప్పించింది. గత మూడేళ్లుగా లక్ష్యానికి మించి చిన్న వ్యాపారాలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యానికి మించి 135 శాతం మేర ముద్ర రుణాలను మంజూరు చేశారు. ఆ ఆర్థిక సంవత్సరంలో రూ.12,000 కోట్లు రుణంగా ఇవ్వాలని లక్ష్యం కాగా రూ.16,212 కోట్లను మంజూరు చేశారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ. 10,838 కోట్లు రుణాలు ఇవ్వాలనేది లక్ష్యమైతే రూ. 11,445 కోట్లు మంజూరు చేశారు. ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని మించడం పట్ల ఇటీవల విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరద్ అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో మహిళల రుణాల రికవరీ బాగుందని, మహిళల రుణాల్లో నిరర్థక ఆస్తులు కూడా చాలా తక్కువగా ఉన్నాయని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో పాటు ముద్ర యోజన ద్వారా మహిళలు స్వయం ఉపాధి రంగంలో ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. ముద్ర కింద మూడు రకాల రుణాలను మంజూరు చేస్తున్నారు. శిశు పథకం కింద రూ. 50 వేల వరకు, కిశోర్ పథకం కింద రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షల వరకు, తరుణ్ పథకం కింద రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు బ్యాంకులు రుణాలను మంజూరు చేస్తున్నాయి. టైర్ల ఫిట్ షాపుతో స్వయం ఉపాధి రాజమహేంద్రవరానికి చెందిన యోగిత సింహాచలం పీఎంఎంవై కింద పది లక్షల రూపాయల రుణం తీసుకుని పరమేశ్వర బెస్ట్ ఫిట్ టైర్ షాపు ఏర్పాటు చేశారు. తొలుత ఒక్కరితో ప్రారంభమైన ఆ షాపులో తరువాత మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం కార్లకు టైర్లు ఫిట్ చేస్తున్నామని, త్వరలోనే మరింత విస్తరించడం ద్వారా మరో పది మందికి కూడా ఉపాధి కల్పిస్తామని సింహాచలం పేర్కొన్నారు. కర్టెన్ డిజైనర్ యూనిట్ తిరుపతికి చెందిన సులోచన డిజైనింగ్‌పై ఆసక్తిని వ్యాపారంగా మార్చుకోవాలనే ఆలోచనతో కెనరా బ్యాంక్‌లో తరుణ్ పథకం కింద రుణం కోసం ధరఖాస్తు చేసుకుంది. కెనరా బ్యాంకు రూ. 7.5 లక్షల రుణం మంజూరు చేసింది. దీంతో ఆమె కర్టెన్ డిజైనర్ పేరుతో యూనిట్‌ను ప్రారంభించింది. మైక్రో మాన్యుఫాక్చరింగ్ యూనిట్లో కర్టెన్ల రూపకల్పనతో పాటు గృహోపకరణాలను తయారు చేయడం ప్రారంభించింది. మరో ఐదుగురికి ఉపాధి కూడా కల్పించారు. -
రాష్ట్రంలో కొత్తగా 20 కేజీబీవీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 20 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఈ దిశగా మంగళవారం విద్యాశాఖ జీవో జారీ చేసింది. వీటి ఏర్పాటుకు రికరింగ్ బడ్జెట్‌గా రూ.60 లక్షలను మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. జిల్లాల విభజన అనంతరం కొత్తగా ఏర్పడిన మండలాల్లో 20 కేజీబీవీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించగా, ఆయా ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. రాష్ట్ర ఆవిర్భావం సమయంలో 2014లో రాష్ట్రంలో 391 కేజీబీవీలుండేవి. 2017–18లో కొత్తగా 84 కేజీబీవీలను మంజూరు చేశా రు. దీంతో రాష్ట్రంలో కేజీబీవీల సంఖ్య 475కు చేరింది. తాజాగా మంజూరైన వాటి తో వీటి సంఖ్య 495కు చేరింది. వీటిల్లో 245 కేజీబీవీల్లో ఇంటర్ విద్య, మరో 230 కేజీబీవీలను పదోతరగతి వరకు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కొత్తగా ఏర్పాటు చేసినవి ఇవే.. మావల (ఆదిలాబాద్), బీర్పూర్, బుగ్గారం (జగిత్యాల), కొత్తపల్లి, గన్నేరువరం (కరీంనగర్), దంతాలపల్లి (మహబూబాబాద్), మహ్మదాబాద్ (మహబూబ్‌నగర్), నార్సింగి, నిజాంపేట, హవేలి, ఘన్పూర్ (మెదక్), నిజామాబాద్ (సౌత్), నిజామాబాద్ (నార్త్), నాగలిగిద్ద, మెగ్గుంపల్లి, వట్పల్లి, గుమ్మడిదల, చౌటకూరు (సంగారెడ్డి), దూల్మిట్ట (సిద్దిపేట), చౌడాపూర్ (వికారాబాద్). -
నిమ్స్‌కు రూ.1,800 కోట్ల రుణం మంజూరు
లక్డీకాపూల్ (హైదరాబాద్): నిజాం వైద్య విజ్ఞా న సంస్థ (నిమ్స్) విస్తరణ పనులకు రూ. 1,800 కోట్లు రుణాన్ని మహారాష్ట్ర బ్యాంక్ మంజూరు చేసింది. నిమ్స్ ఆస్పత్రి విస్తరణలో భాగంగా నిర్మించతలపెట్టిన 2 వేల పడకల దశాబ్ది బ్లాక్‌కు సీఎం కేసీఆర్ జూన్ 14న భూమి పూజ చేశారు. నిమ్స్‌కు కేటాయించిన 33 ఎకరాల్లో విస్తరణ పనుల్లో భాగంగా కొత్తగా మూడు భవనాలను నిర్మించనున్నారు. ఇందుకు ఆర్అండ్బీ అధికారులు టెండర్ల ప్రక్రియను చేపట్టారు. ఈనెల 31న టెండర్లను ఖరారు చేయనున్నారు. అందులో భాగంగా మహారాష్ట్ర బ్యాంక్ రుణ సదుపాయాన్ని కల్పించింది. ఈ రుణ మొత్తాన్ని నిమ్స్ నిరీ్ణత కాల వ్యవధిలో బ్యాంక్‌కు చెల్లించాల్సి ఉంది. పేదలకు మరింత మెరుగైన సేవలు అందించేందు కు చేస్తున్న కృషిలో భాగంగా విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇందుకు నిమ్స్ ప్రత్యేకంగా ఓ రిటైర్డ్ ఆర్అండ్బీ చీఫ్ ఇంజనీర్ లక్ష్మారెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. -
గుడ్ న్యూస్: వీఆర్ఏల కోసం సూపర్ న్యూమరరీ పోస్టులు, ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ)ను ఇతర ప్రభుత్వ శాఖల్లో విలీనం చేసే ప్రక్రియలో మరో ముందడుగు పడింది. వీఆర్ఏలను పలు శాఖల్లో విలీనం చేసుకునేందుకు వీలుగా ఆయా శాఖల్లో సూపర్ న్యూమరరీ పోస్టులను కల్పించేందుకు ఆర్థిక శాఖ అంగీకారం తెలిపింది. ఈ మేరకు 14,954 సూపర్ న్యూమరరీ పోస్టులను కల్పిస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ శాఖలో 2,451 జూనియర్ అసిస్టెంట్, మున్సిపల్ శాఖలో 1,266 వార్డు ఆఫీసర్లు (జూనియర్ అసిస్టెంట్ కేటగిరీ), రెవెన్యూ శాఖలోనే 2,113 రికార్డు అసిస్టెంట్లు, 679 సబార్డినేట్/చైన్‌మెన్ పోస్టులు, సాగునీటి శాఖ పరిధిలో 5,073 లస్కర్లు, హెల్పర్ పోస్టులు, మిషన్ భగీరథలో 3,372 హెల్పర్ పోస్టులను కల్పించేందుకు అనుమతిస్తున్నట్టు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయా శాఖల వారీగా ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు కల్పిస్తున్నారన్న దానిపై స్పష్టతనిస్తూ ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ఇదీ చదవండి: కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆర్డీవో వ్యవస్థ రద్దు! -
ఈయూ ఆంక్షల మోత...టెన్షన్లో రష్యా!
EU said it will look into sanction regime on gold: ఉక్రెయిన్ పై దురాక్రమణ యుద్ధంకు దిగడంతో ఈయూ దేశాలు ఇప్పటికే రష్యా పై ఆంక్షలు మోత మోగించింది. అయినా రష్యా దూకుడు మాత్రం ఆగలేదు. పైగా ఉక్రెయిన్ పై మరిన్ని యుద్ధ నేరాలకు పాల్పడింది రష్యా. అంతేకాదు ఉక్రెయిన్ స్వాధీన దిశగా దాడులు వేగవంతం చేసింది కూడా. దీంతో రష్యాను నియంత్రించేలా మరిన్ని ఆంక్షలను విధించే దిశగా ఈయూ రెడీ అవుతోంది. అందులో భాగంగానే ఈయూ రష్యా ఎగుమతులకు సంబంధించిన ముఖ్యమైన వాటిపై దృష్టి కేంద్రీకరించింది. ఈ మేరకు రష్యా బంగారం ఎగుమతులను లక్ష్యంగా చేసుకుని ఆంక్షలు విధించనున్నట్లు ఈయూ కమిషన్ అధికారి తెలిపారు. ఇప్పటి వరకు ఈయూ రష్యా పై ఆరు ఆంక్షల ప్యాకేజిని విధించింది. ఈ మేరకు ఈయూ రష్యాకి సంబంధించి ఎగుమతులలో ముఖ్యమైనది అయిన బంగారం పై ఆంక్షలు విధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు యూరోపియన్ కమిషన్ హెడ్ మారోస్ సెఫ్కోవిక్ తెలిపారు. తాము సభ్యదేశాల స్థాయిలో ఒప్పందానికి వచ్చిన వెంటనే ఈ విషయాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు. అదీగాక ఉక్రెయిన్ ఉప ప్రధాని ఓల్గా స్టెఫనిషినా కూడా రష్యా పై కొత్త ఆంక్షల ప్యాకేజిని ఆమోదించాలని కోరారు. అయినా ఇప్పటివరకు ఇన్ని ఆంక్షలు విధించినా రష్యాలో ఏ మాత్రం మార్పు రాలేదని, పైగా తాను చేసి దురాగతాలకు జవాబుదారీగా భావించేలా కూడా ఏం చేయలేదన్నారు. ఇప్పుడు విధించనున్న ఆంక్షలు రష్యాని గట్టిగా నియంత్రించగలదని ఆశిస్తున్నానని, సాధ్యమైనంత త్వరితగతిన ఈ ఆంక్షలు ఆమోదించాలని కోరుకుంటున్నానని అన్నారు. (చదవండి: రాజపక్స కుటుంబానికి బిగ్ షాక్.. దేశం విడిచి వెళ్లకుండా నిషేధాజ్ఞలు) -
సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కుల్లో రాష్ట్రానికి మొండిచేయి
సాక్షి, హైదరాబాద్: చిన్న పట్టణాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతోపాటు ఐటీ ఆధారిత సేవల పరిశ్రమను ప్రోత్సహించేందుకు కేంద్రప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయనున్న సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా(ఎస్టీపీఐ)లో రాష్ట్రానికి ఒక్కటి కూడా దక్కలేదు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కొత్తగా ఏర్పాటు చేయనున్న 22 ఎస్టీపీఐ పార్కులను మధ్యప్రదేశ్, పంజాబ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, బిహార్, హరియాణా, గుజరాత్, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయించింది. కొత్త ఎస్టీపీఐలు ఏర్పాటయ్యే రాష్ట్రాల జాబితాలో ఒడిశా మినహా మిగతావన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలే కావడం గమనార్హం. చిన్న పట్టణాలకు ఐటీ పరిశ్రమను విస్తరించడం ద్వారా కొత్త ఉద్యోగాలను కల్పించడం ఎస్టీపీఐల లక్ష్యం. అయితే కొన్ని రాష్ట్రాలకే ఎస్టీపీఐలను కేటాయించడంపై విమర్శలు వస్తున్నాయి. దేశంలోని 62 ఎస్టీపీఐలను పది రీజియన్లుగా విభజించగా, హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఎస్టీపీఐ పరిధిలో కాకినాడ, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ సబ్‌సెంటర్లు ఉన్నా యి. తెలంగాణ పరంగా చూస్తే హైదరాబాద్‌లో ప్రధాన ఎస్టీపీఐతోపాటు వరంగల్‌లో ఎస్టీపీఐ సబ్‌సెంటర్ పనిచేస్తోంది. దేశంలోని ఇతర ఎస్టీపీఐలతో పోలిస్తే హైదరాబాద్ ఎస్టీపీఐ, దాని పరిధి లోని సబ్ సెంటర్ల ద్వారా ఐటీ, ఐటీ ఆధారిత సేవ లు, ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్, మాన్యుఫాక్చరింగ్(ఈఎస్డీఎం) ఎగుమతుల విలువ ఏటా గణనీ యంగా పెరుగుతోంది. 1992–93లో హైదరాబాద్ ఎస్టీపీఐ ద్వారా రూ.4.76 కోట్ల ఐటీ, ఐటీ ఆధారిత సేవల ఉత్పత్తులు ఎగుమతి కాగా, 2020–21 నాటికి రూ.72,457 కోట్లకు చేరడం గమనార్హం. రాష్ట్రంలో చిన్న నగరాలకు చోటేదీ? ఐటీ రంగంలో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానానికి చేరేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో రాష్ట్ర ప్రభు త్వం హైదరాబాద్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్ మెంట్ రీజియన్(ఐటీఐఆర్)ను ఏర్పాటు చేయా లని చాలాకాలంగా కోరుతోంది. మరోవైపు జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చుతో ఐటీ హబ్‌లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే వరంగల్, కరీంనగర్, ఖమ్మంలలో ఐటీ హబ్‌లలో ఐటీ కంపెనీల కార్యకలాపాలు ప్రారంభం కాగా, నిజామాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేటలో ఐటీ హబ్‌ల నిర్మాణం కొనసాగుతోంది. వీటితోపాటు రామగుండం, నల్లగొండ, వనపర్తిలోనూ ఐటీ హబ్‌లు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీచేసింది. డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా ఎస్టీపీఐల కోసం కేంద్రం ఇండియా బీపీవో ప్రమోషన్ స్కీమ్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా బీపీవో లేదా ఐటీ ఆధారిత కార్యకలాపాలు ప్రారంభించే సంస్థలకు కేంద్రం నుంచి ఒక్కో సీటుకు లక్ష రూపాయల చొప్పున ఆర్థికసాయం అందుతుంది. ‘ఎస్టీపీఐల ఏర్పాటు ద్వారా మరిన్ని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు ఐటీ రంగాన్ని విస్తరించే అవకాశమున్నా రాష్ట్రంలో ఏ ఒక్క పట్టణాన్ని కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు. చిన్న నగరాలు, పట్టణాలకు ఐటీ రంగాన్ని విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం నుంచి సహకారం అందించాల్సిన అవసరం ఉంది’అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ‘సాక్షి’కి వెల్లడించారు. -
అదే యుద్ధంలో అన్నింటికన్నా పెద్ద ఆయుధం - ఆనంద్ మహీంద్రా
ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. ప్రతిగా ఇటు అమెరికా కానీ నాటో దళాలు కానీ యుద్ధ రంగంలోకి దిగకుండా ఆర్థిక ఆంక్షలు విధిస్తూ పోతున్నాయి. యుద్ధం చేయకుండా ఇలా ఆంక్షలతో అమెరికా, నాటో దేశాలు సాధించేది ఏంటీ అనే సందేహం చాలామందిలో కలుగుతోంది. అయితే ఆర్థిక ఆంక్షలు అనేవి ఎంత ప్రభావవంతమైనవనే అంశాన్ని ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రా గుర్తించారు. ఆమెరికా, యూరప్ దేశాలు వరుసగా విధిస్తున్న ఆంక్షలతో రష్యా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే అతలాకుతలం అవుతోంది. తాజాగా ఆంక్షల ఎఫెక్ట్ అక్కడి పారిశ్రామిక రంగంపై కూడా పడుతోంది. రష్యాలో ఉన్న కార్ల తయారీ సంస్థల్లో లాడా ప్రముఖమైనది. అయితే తాజాగా కార్ల తయారీ నిలిపివేస్తున్నట్టు లాడా ప్రకటించింది. లాడా కార్ల తయారీలో ఉపయోగించే అనేక కాంపోనెంట్స్ యూరప్‌తో పాటు వివిధ దేశాల నుంచి రష్యా దిగుమతి చేసుకుంటుంది. ప్రస్తుతం విధించిన ఆంక్షల కారణంగా కార్ల తయారీలో ఉపయోగించే అనేక స్పేర్ పార్ట్స్ రష్యాలో లభించని పరిస్థితి నెలకొంది. దీంతో కార్ల తయారు చేయలని పరిస్థితి ఎదురవడంతో లాడా ఉత్పత్తిని నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. ఇదే పరిస్థితి మరికొంత కాలం కొనసాగితే ఆ ఫ్యాక్టరీలో పని చేసే కార్మికులు, ఉద్యోగులు వారి కుటుంబాలు చిక్కుల్లో పడతాయి. ఆర్థిక ఆంక్షల కారణంగా లాడా కార్ల తయారీ ఆపేసినట్టు ది కీవ్ ఇండిపెండెంట్ సంస్థ పెట్టిన ట్వీట్‌కు ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ... ‘సప్లై చెయిన్.. మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఆఫ్ వార్.. అంటూ కామెంట్ చేశారు. సప్లై చెయిన్లను దెబ్బ తీయడం ద్వారా అమెరికా మరో మార్గంలో రష్యాపై యుద్ధం ప్రకటించినట్టయ్యింది. Supply chains. The most potent weapons of war… https://t.co/kaqNbbxKYZ — anand mahindra (@anandmahindra) March 10, 2022 చదవండి: Anand Mahindra Tweet: చైనాకు చురకలు అంటించిన ఆనంద్ మహీంద్రా -
Harish Rao: బీఆర్జీఎఫ్ నిధులివ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రానికి బీఆర్జీఎఫ్ నిధులు విడుదల చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. జీఎస్టీ సమావేశంలో పాల్గొనడానికి లక్నో వెళ్లిన హరీశ్.. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావులు సమావేశం విరామ సమయంలో కేంద్రమంత్రిని కలిసి విజ్ఞప్తిచేశారు. మంత్రి సాధ్యమైనంత త్వరగా నిధులు విడుదల చేస్తామని హామీఇచ్చారు. కాగా, సమావేశంలో కేంద్ర రెవెన్యూశాఖ సంయుక్త కార్యదర్శి ఇచ్చిన సవివర ప్రజెంటేషన్‌లో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గ్యాప్ స్వల్పమేనని పేర్కొన్నారు. పత్తిపైనున్న రివర్స్ చార్జి మెకానిజాన్ని రద్దు చేయాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో హరీశ్ డిమాండ్ చేశారు. చదవండి: AP: ఏపీ హైకోర్టు కొత్త సీజేగా ప్రశాంత్‌కుమార్ మిశ్రా? -
రుణాల మంజూరులో తెలంగాణపై వివక్ష
సాక్షి, హైదరాబాద్: చిరు వ్యాపారులకు ఆర్థిక ఆసరాగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) కింద ప్రవేశపెట్టిన రుణాల మంజూరు ప్రక్రియ రాష్ట్రంలో మందకొడిగా సాగుతోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన ఈ రుణాలివ్వాలని నిర్ణయించగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రానికి ముద్ర రుణ యూనిట్ల మంజూరు తక్కువగానే కనిపిస్తోంది. బీజేపీపాలిత రాష్ట్రాలకు మంజూరు చేసిన యూనిట్లతో పోలిస్తే రాష్ట్రానికి ముద్ర రుణాల విషయంలో కేంద్రం వివక్ష కనపరుస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటివరకు తెలంగాణలో కేవలం 40 లక్షల మందికే ఈ రుణాలు అందాయి. తెలంగాణకు చాలా తక్కువ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణకు చాలా తక్కువ ముద్ర రుణాలు మంజూరు అయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్ర జనాభా 3.85 కోట్లకుపైగా ఉండగా ఇప్పటివరకు కేవలం 40.90 లక్షల యూనిట్లే మంజూరు చేశారు. మనకంటే కేవలం 80 లక్షల జనాభా ఎక్కువగా ఉన్న ఒడిశాలో ఏకంగా 1.60 కోట్లకుపైగా ముద్ర రుణాలు వచ్చాయి. కర్ణాటకలో 2.45 కోట్లు, ఉత్తరప్రదేశ్‌లో 2.19 కోట్లు, మహారాష్ట్రలో 1.93 కోట్లు, మధ్యప్రదేశ్‌లో 1.49 కోట్లు, రాజస్తాన్‌లో 98 లక్షలు, మన జనాభాతో సమానంగా ఉన్న జార్ఖండ్‌లో 62 లక్షల యూనిట్లు మంజూరు చేశారు. దేశవ్యాప్త గణాంకాలను పరిశీలిస్తే మొత్తం 24 కోట్లకుపైగా యూనిట్ల ముద్ర రుణాలను డిసెంబర్ 31 వరకు మంజూరు చేసినట్టు తెలుస్తోంది. ఇందులో రాష్ట్రానికి కేవలం 40లక్షల యూనిట్లే మంజూరవగా మరో 28 లక్షల మంది చిరువ్యాపారులు ఈ రుణాల కోసం ఎదురుచూస్తున్నారు. జనాభా ప్రాతిపదికన చూస్తే దేశ సగటు 17.86 ఉండగా, తెలంగాణలో మాత్రం ప్రతి 100 మందిలో కేవలం 10.62 శాతం మందికి మాత్రమే ఈ రుణాలందాయి. కాగా, మన రాష్ట్రంలో ముద్ర రుణాల కోసం బ్యాంకులకు వెళుతున్న చిరు వ్యాపారులు నిరాశతో వెనుదిరిగాల్సి వస్తోందని ప్రతిపక్షాలు, కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. తమకు ఇచ్చిన లక్ష్యం అయిపోయిందని, అంతకు మించి తాము మంజూరు చేయలేమని బ్యాంకర్లు చెపుతున్నారని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని చిరువ్యాపారులను ఆదుకునేందుకు వీలున్నన్ని ముద్ర రుణాలు మంజూరు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ముద్ర రుణాలు ఎక్కువగా మంజూరయిన రాష్ట్రాలివే రాష్ట్రం జనాభా మంజూరైన రుణ యూనిట్లు అస్సాం 3,56,07,039 74,87,345 కర్ణాటక 6,75,62,686 2,45,02,287 కేరళ 3,56,99,443 84,01,668 ఒడిశా 4,63,56,334 1,63,01,350 పుదుచ్చేరి 14,13,542 6,80,997 తమిళనాడు 7,78,41,267 3,05,13,243 త్రిపుర 41,69,794 15,59,460 పశ్చిమ బెంగాల్ 9,96,09,303 2,41,95,057 (నోట్: ఈ వార్తకు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ కేంద్రానికి రాసిన లేఖ బిట్‌ను యాడ్ చేసుకోగలరు.) ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో.. త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ముద్ర రుణాలు ఎక్కువగా మంజూరైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్ జనాభా దాదాపు 10 కోట్లు కాగా అందులో 2.41 కోట్ల యూనిట్ల ముద్ర రుణాలిచ్చారు. అలాగే లెఫ్ట్ ఫ్రంట్ పాలనలోని కేరళలో కూడా 3.5 కోట్ల జనాభాకు 84 లక్షలకుపైగా యూనిట్లు మంజూరయ్యాయి. తమిళనాడులో 7.78 కోట్ల జనాభాకు 3.05 కోట్ల యూనిట్ల రుణాలిచ్చారు. పుదుచ్చేరి జనాభా 14.13 లక్షలు కాగా అక్కడ 6.80 లక్షలు, 3.5కోట్ల జనాభా ఉన్న అసోంలో 74 లక్షల ముద్ర యూనిట్లు మంజూరవ్వడం గమనార్హం. -
ఎయిమ్స్‌కు నిధులివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: బీబీనగర్‌లో నిర్మితమవుతున్న ఎయిమ్స్ ఆస్పత్రి, వైద్య కళాశాలల శాశ్వత భవనాలకు కేంద్ర బడ్జెట్లో రూ.1,028 కోట్ల నిధులను కేటాయించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. సోమవారం ఆయన ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యి పలు వినతి పత్రాలు అందించారు. కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్‌లో మంజూరైన ఐటీఐఆర్ హబ్‌కు నిధులు కేటాయించాలని కోరారు. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా భువనగిరి పార్లమెంట్ పరిధిలో బ్లాక్ లెవల్ క్లస్టర్ల ఏర్పాటుకు వీలుగా రూ.1,013 కోట్ల నిధులు విడుదల చేయాలని కోరారు. హైదరాబాద్–వరంగల్ వరకు జాతీయ రహదారి అభివృద్ధి పనులకు ఆర్థికపరమైన అనుమతులు ఇవ్వాలన్నారు. చేనేత కార్మికుల కోసం ప్రత్యేక ఆరోగ్య బీమా పథకం అమలు చేయాలని కోరారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, జీవన్ జ్యోతి బీమా యోజన పథకాల కింద చేనేత కార్మికులకు, 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వారికి ఆరోగ్య బీమా పథకం వర్తించేలా చర్యలు చేపట్టాల న్నారు. మూసీ నది ప్రక్షాళనకు ‘నమామి గంగా‘తరహాలో మిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. -
ఉద్యాన రైతులకు ‘ఇన్పుట్’ మంజూరు
అనంతపురం అగ్రికల్చర్: జూన్ 2016లో అకాల వర్షాలకు దెబ్బతిన్న పండ్లతోటలకు సంబంధించి పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ) కింద పరిహారం మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి డి.మన్మోహన్సింగ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ కడప, తూర్పు, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా జిల్లాల పరిధిలో 2,138 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతినగా 5,247 మంది రైతులకు రూ.5.19 కోట్లు పరిహారం మంజూరు చేశారు. అందులో జిల్లా వాటా రూ.90 లక్షల వరకు ఉన్నట్లు సమాచారం. -
‘ ఫిజిక్స్’కు కేంద్రం దన్ను
డీఎస్టీ నుంచి రూ.1.08 కోట్లు మంజూరు అధునాతన పరిశోధనలకు ఊతం ఎస్కేయూ (అనంతపురం): శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని ఫిజిక్స్ విభాగానికి కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వశాఖ దన్నుగా నిలిచింది. ఈ విభాగంలో జరిగే పరిశోధనలకు రూ.1.08 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో జరిగే పరిశోధనలకు కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫండింగ్ ఏజెన్సీగా ఉన్న డీఎస్టీ (డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) ద్వారా ఈ నిధులు అందనున్నాయి. మెటీరియల్ సైన్సెస్‌కు సంబంధించిన పరిశోధనలు, ఆవిష్కరణలకు అయ్యే ఖర్చును ఈ నిధుల ద్వారా వినియోగించుకోవచ్చు. ఫిజిక్స్‌లో నాణ్యమైన పరిశోధనలు ఎస్కేయూ ఫిజిక్స్ విభాగంలో నాణ్యమైన పరిశోధనలు కొనసాగుతున్నాయి. భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో)కు సంబంధించి ప్రాంతీయ వాతావరణ అధ్యయన కేంద్రాన్ని ఫిజిక్స్ విభాగంలో నిర్వహిస్తున్నారు. ఇస్రోలో పనిచేసే శాస్త్రవేత్తలు ఇక్కడ రీసెర్చ్ స్కాలర్లుగానూ ఉన్నారు. నిరంతర వాతావరణ, శీతోష్ణస్థితి పరిస్ధితులను ఎప్పటికప్పుడు ఇస్రోకు సమాచారం అందజేస్తుంటారు. ఇక్కడి పరిశోధన శాలల్లో నిరంతరమూ ఏదో ఒక పరిశోధన జరుగుతూ ఉంటుంది. ఐదేళ్లకు మరింత పెరగనున్న సాయం నాణ్యమైన పరిశోధనలే విశ్వవిద్యాలయం గుర్తింపునకు గీటురాయిగా మారింది. ఈ నేపథ్యంలో ప్రామాణికమైన ఆవిష్కరణలపై దృష్టిసారించారు. డీఎస్టీ నుంచి ఫిస్ట్ (ఫండ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) అనే పథకం ద్వారా రూ.1.08 కోట్లు ఈ విద్యా సంవత్సరం నుంచి అందించనున్నారు. ఎమ్మెస్సీ ఫిజిక్స్ చదివే విద్యార్థుల ల్యాబ్ సౌకర్యాలకు రూ. 20 లక్షలు, పుస్తకాలకు రూ.5లక్షలు, కంప్యూటర్ ల్యాబ్ నిర్వహణకు రూ.13 లక్షలు, మెటీరియల్ సైన్సెస్‌కు సంబంధించిన పరికరాలకు రూ.50 లక్షలు ఖర్చు చేయనున్నారు. గతంలో జరిగిన పరిశోధనల ప్రామాణికంగానే ఈ నిధులు మంజూరు చేసినట్లు డీఎస్టీ తన అనుమతి పత్రంలో పేర్కొంది. పరిశోధనలకు ఊతం అధునాతనమైన ప్రయోగ పరికరాలతో నాణ్యమైన పరిశోధనలకు ఆస్కారం ఏర్పడనుంది. ఇవి పరిశోధన విద్యార్థులకు ఎంతో దోహదపడనున్నాయి. తొలి దశలో ఎలక్ట్రానిక్ పరికరాలకు నిధులు మంజూరు చేశారు. తాజాగా మెటీరియల్ సైన్సెస్‌కు సంబంధించిన పరికరాల కొనుగోలుకు నిధులు మంజూరు చేశారు. – ప్రొఫెసర్ టి. సుబ్బారావు, ఫిజిక్స్ విభాగం బీఓఎస్ ఛైర్మెన్, పాలిమర్ సైన్సెస్ విభాగాధిపతి, బీఎం బిర్లా సైన్స్ సెంటర్ ప్రొఫెసర్ ఇన్ఛార్జ్ ఉన్నతాధికారుల సహకారం మరువలేం ఫిజిక్స్ విభాగం పురోగతికి వీసీ, రిజిస్ట్రార్ల సహకారం మరువలేం. డీఎస్టీ –ఫిస్ట్ ద్వారా నిధులు రావడం గర్వకారణం. అధునాతన ల్యాబ్‌ల ఏర్పాటుకు ఆస్కారం కానుంది. ప్రామాణికమైన పరిశోధనలు చేయడానికి విద్యార్థులకు సహకారం అందిస్తున్నాం. – డాక్టర్ ఎం.వి.లక్ష్మయ్య, అసోసియేట్ ప్రొఫెసర్, ఎస్కేయూ -
ఇన్పుట్ సబ్సిడీ మంజూరు
- ఏడు జిల్లాలకు రూ.1,680.05 కోట్లు -ఒకట్రెండు రోజుల్లో తేలనున్న ‘అనంత’ వాటా - వాతావరణ బీమాతో ఇన్పుట్కు లింకు అనంతపురం అగ్రికల్చర్ : ఖరీఫ్ -2016లో దెబ్బతిన్న పంటలకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీని మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం, వైఎస్సార్, కర్నూలు, చిత్తూరు, శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు... ఈ ఏడు జిల్లాలకు సంబంధించి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్డీఆర్ఎఫ్) కింద రూ.1,680.05 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ (ప్రకృతి విపత్తుల విభాగం) కమిషనర్ ఎంవీ శేషగిరిబాబు జీవో 67 విడుదల చేశారు. ఏడు జిల్లాల పరిధిలో 12.21 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతినడంతో 13.21 లక్షల మంది రైతులకు రూ.1,680.05 కోట్లు మంజూరు చేశారు. ఆధార్‌తో అనుసంధానం చేసిన రైతుల బ్యాంకు ఖాతాలకు పరిహారం జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో జిల్లాల వారీగా వాటా ఎంతనేది ప్రకటించలేదు. కాగా.. జిల్లాలో 7.17 లక్షల హెక్టార్లలో వేరుశనగతో పాటు ఇతర పంటలు దెబ్బతిన్నాయని, 6,25,050 మంది రైతులకు రూ.1,032.69 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ ప్రతిపాదనల ప్రకారం మొత్తం విడుదల చేశారా, లేదా అనేది ఒకట్రెండు రోజుల్లో తెలిసే అవకాశముంది. ఇన్పుట్కు, ఇన్సూరెన్స్‌కు లింకు మంజూరు చేసిన ఇన్‌పుట్‌సబ్సిడీ ఎప్పుడు విడుదల చేస్తారు, ఏ విధంగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తారనేది అధికారులు చెప్పడం లేదు. వాతావరణ బీమా, ఫసల్‌బీమా పథకాల కింద విడుదలైన పరిహారానికి, ఇన్‌పుట్‌సబ్సిడీకి లింకు పెట్టడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఒక్కో రైతుకు హెక్టారుకు రూ.15 వేల చొప్పున గరిష్టంగా రెండు హెక్టార్లకు రూ.30 వేలు మాత్రమే వర్తింపజేయాలని ఆదేశాలు ఉన్నాయి. ఇన్పుట్, ఇన్సూరెన్స్‌కు లింకు పెట్టిన నేపథ్యంలో మొదట బజాజ్ అలయంజ్ కంపెనీ నుంచి వాతావరణ బీమా మొత్తాన్ని విడుదల చేసి రైతుల ఖాతాల్లోకి జమ చేస్తే, ఆ తర్వాత ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి వీలవుతుందని జిల్లా అధికారులు చెబుతున్నారు. మండలాలు, గ్రామాల వారీగా వాతావరణ బీమా పరిహారం ఏ రైతు ఖాతాలో ఎంత జమ అయ్యిందనే వివరాలు తెలిస్తే కానీ ఇన్పుట్ సబ్సిడీ ఎంతివ్వాలనేది అర్థం కాదని అంటున్నారు. మరోవైపు పంట కాలం ముగిసి 2017 ఖరీఫ్‌లో అడుగుపెట్టినా బజాజ్ అలయంజ్ సంస్థ వాతావరణ బీమా పరిహారం ఎంత, ఎంత మందికి, ఎన్ని హెక్టార్లకు వర్తించిందనేది ప్రకటించకుండా జాప్యం చేస్తోంది. గతంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లాకు రూ.367 కోట్ల వాతావరణ బీమా మంజూరైనట్లు ప్రకటించారు. ఇటీవల అది రూ.434 కోట్లకు పెరిగిందని చెబుతున్నా.. అధికారికంగా విడుదలకు నోచుకోలేదు. మొత్తమ్మీద పరిహారాన్ని ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా రైతులకు ఎలా పంపిణీ చేయాలనే దానిపై జిల్లా వ్యవసాయశాఖ అధికారుల్లో గుబులు రేగుతోంది. ఈ అంశంపై ఒకట్రెండు రోజుల్లో రాయలసీమ జిల్లాల వ్యవసాయ సంయుక్త సంచాలకులు (జేడీఏలు) సమావేశమై పంపిణీ మార్గాలను అన్వేషించే అవకాశముంది. మరోవైపు ఇన్పుట్, ఇన్సూరెన్స్‌కు లింకు పెట్టి రైతులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వంపై ఉద్యమించడానికి విపక్షాలు, రైతు సంఘాలు సిద్ధమవుతున్నాయి. -
వచ్చే జన్మభూమిలో అర్హులందరికీ పెన్షన్లు
ఇరిగేష¯ŒS మంత్రి దేవినేని పాశర్లపూడిలంక (మామిడికుదురు) : అర్హులందరికీ వచ్చే జన్మభూమిలో పెన్షన్లు అందజేస్తామని రాష్ట్ర ఇరిగేష¯ŒS శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. తెలుగుదేశం జనచైతన్యయాత్రలో భాగంగా పాశర్లపూడిలంలో శనివారం పార్టీ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం రైతులకు పవర్ టిల్లర్లు అందజేశారు. పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ పేదవారు ఆత్మ విశ్వాçÜంతో బతకాలన్నదే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అర్హులందరికీ పెన్షన్లు, గృహాలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, రేష¯ŒSకార్డులు మంజూరు చేస్తామన్నారు. రూ.16,500 కోట్ల లోటు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని అప్పగించినా అభివృద్ధిలో ఎక్కడా రాజీ పడకుండా ముందుకు సాగుతున్నామన్నారు. రూ.24 వేలు కోట్ల రాణాల్ని వడ్డీతో సహా మాఫీ చేశామని, రూ.మూడు వేల కోట్లతో డ్వాక్రా మహిళలకు పెట్టుబడి నిధిని ఏర్పాటు చేశామని చెప్పారు. రూ.5,500 కోట్లు పెన్షన్లకు, రూ.20 వేల కోట్లు సాగునీటి రంగానికి కేటాయించామన్నారు. నియోజకవర్గానికి 1250 ఇళ్లు మంజూరు చేశామని, త్వరలోనే అదనంగా మరో 350 ఇళ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నాలుగు జిల్లాలను సస్యశ్యామలం చేశామన్నారు. చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకే జనచైతన్యయాత్రలు చేపట్టామని చెప్పారు. సమావేశంలో జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు, జెడ్పీటీసీ సభ్యుడు విత్తనాల మాణిక్యాలరావు, ఎంపీపీ మద్దాల సావిత్రీదేవి, సర్పంచ్ బొరుసు నర్సింహమూర్తి, ఎంపీటీసీ సభ్యురాలు పొలమూరి వెంకటలక్ష్మి, పార్టీ నాయకులు ఉండ్రు రామారావు, మద్దాల కృష్ణమూర్తి, డొక్కా నాథ్‌బాబు, సూదా బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీకాళహస్తి-నడికుడి లైన్‌కు రూ.276 కోట్లు
హైదరాబాద్ : శ్రీకాళహస్తి-నడికుడి రైలు మార్గం నిర్మాణం కోసం భూసేకరణకు గాను రూ.276.01 కోట్లను మంగళవారం ప్రభుత్వం మంజూరు చేసింది. విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో పెట్టుబడులను రాబట్టేందుకు మౌలిక సదుపాయాలను కల్పించాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. శ్రీకాళహస్తి-నడికుడి రైలు మార్గం పనుల వ్యయంలో 50 శాతం నిధులు, భూమిని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చితే ఆ ప్రాజెక్టును చేపట్టడానికి సిద్ధమని ఏడేళ్ల క్రితమే రైల్వే శాఖ ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదనకు అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం.. నెల్లూరు,గుంటూరు జిల్లాల్లో భూసేకరణకు అధికారులను ఆదేశించింది. నెల్లూరు జిల్లాలో 2,901.54 ఎకరాల భూమిని సేకరించడానికి రూ.271.06 కోట్లను మంజూరు చేయాలని కలెక్టర్ పంపిన ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసిన ప్రభుత్వం మంగళవారం నిధులను మంజూరు చేసింది. -
పైలట్ శిక్షణకు 25 లక్షల ప్రభుత్వ సాయం
సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గంటా స్వాతి పైలట్ శిక్షణకు అవసరమయ్యే రూ.25 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం సంతకం చేశారు. -
సీఎం క్యాంపు కార్యాలయానికి రూ.95లక్షలు మంజూరు
హైదరాబాద్ : విజయవాడలోని లింగమనేని ఎస్టేట్స్ భవనంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి రూ.95.28 లక్షలు మంజూరు చేస్తూ హోం శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ బి. ప్రసాదరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ భవనానికి మరమ్మతులు చేయడం, ఆధునికరించడానికి రూ.63.58 లక్షలు, యాక్సెస్ కంట్రోల్ ఉపకరణాలు ఏర్పాటుకు రూ.31.7 లక్షలు మంజూరు చేశారు. వీటికి అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా నిఘా విభాగం అదనపు డీజీని హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశించారు. -
ట్రిపుల్ ఐటీలకు స్వయం ప్రతిపత్తి
వేంపల్లె: వైఎస్ఆర్ జిల్లాలోని ఇడుపులపాయ, కృష్ణా జిల్లాలోని నూజివీడు, అదిలాబాద్ జిల్లాలో ఉన్న బాసరలో ఉన్న మూడు ట్రిపుల్ ఐటీలకు స్వయం ప్రతిపత్తి(అటానమీ) కల్పించారు. ఈనెల 14వ తేదీన హైదరాబాద్‌లోని ఆర్జీయూకేటీ ప్రధాన కార్యాలయంలో జరిగిన గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ట్రిపుల్ ఐటీలో పనిచేసే సిబ్బంది జీతాలు, నిర్వహణ ఖర్చులు, పరిపాలన వారే స్వయంగా చూసుకోవాల్సి ఉంటుంది. పర్యవేక్షణ మాత్రం వర్సిటీ పరిధిలో ఉంటుంది. విద్యార్థుల పరీక్ష విధానానికి వస్తే... ఆన్లైన్లో మూడు ట్రిపుల్ ఐటీల విద్యార్థులకు ఒకేసారి జరిగి ఫలితాలూ అలాగే విడుదలయ్యేవి. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. ఆ ట్రిపుల్ఐటీ పరిధిలో పరీక్ష విధానం, ఫలితాల విడుదల ఉండే అవకాశాలు ఉన్నాయి. -
పోర్టు మనకేనా?
రాజ్యసభలో రామాయపట్నం పోర్టు ప్రస్తావన పోర్టు అవసరాన్ని వివరించిన వెంక య్యనాయుడు అంగీకరించే యోచనలో కేంద్ర ప్రభుత్వం పోర్టు వస్తే జిల్లాకు మహర్దశే సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లా వాసుల చిరకాల కోరిక తీరేందుకు అవకాశాలు మెరుగుపడుతున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో రామాయపట్నం పోర్టు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ అంశం రాజ్యసభలో గురువారం చర్చకు వచ్చింది. బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడు మాట్లాడుతూ సీమాంధ్రకు ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా రామాయపట్నం పోర్టును నిర్మించాలని డిమాండ్ చేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే జిల్లాకు మహర్దశ పట్టినట్లే. రామాయపట్నం పోర్టు ఏర్పడితే జిల్లాలో నేషనల్ మ్యాన్‌ప్యాక్చరింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ జోన్ (ఎన్‌ఎంఐజెడ్)కు కూడా మోక్షం కలిగే అవకాశం ఉంది. పోర్టు నిర్మాణానికి గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలతో పోర్టు నిర్మించాలని భావించారు. దీనికిగాను రాష్ట్ర ప్రభుత్వం 11 శాతం నిధులు ఇచ్చేందుకు కూడా అంగీకరించింది. జిల్లాలో నిర్మించే పోర్టు తమిళనాడులోని ఎన్నూరు పోర్టు తరహాలో ఉండేలా చ ర్యలు తీసుకోవాలని భావించారు. ఈ ప్రాజెక్టు భాగస్వామ్యానికి నేషనల్ మినరల్ డెవెలప్మెంట్ కార్పొరేషన్, విశాఖపట్నం పోర్టు, ఇఫ్కో ఫెర్టిలైజర్స్ సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. పోర్టుతో పాటు షిప్ యార్డును కూడా నిర్మించేందుకు ప్రతిపాదనలు చేపట్టారు. నెలకు 30 మిలియన్ టన్నుల కార్గొ రవాణా చే సేందుకు అనువుగా ఆరు బెర్త్‌లతో పోర్టు నిర్మించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. షిప్ బిల్డింగ్ కారిడార్, పిషింగ్ హార్బర్లను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పోర్టు నిర్మాణానికి ఐదు వేల ఎకరాల స్థలాన్ని మార్కు చేశారు. వీటిలో 1200 ఎకరాలు ప్రైవేటు భూములు, 2200 ఎకరాల్లో ఉన్న ఎనిమిది గ్రామాలను సేకరించేందుకు 420 కోట్ల రూపాయలు కూడా కేటాయించారు. ఇన్ని జరిగాక పర్యావరణ విభాగం నుంచి అనుమతి లభించలేదు. దీంతో రామయపట్నానికి బదులు నెల్లూరు జిల్లా దుగ్గరాజు పట్నంకు పోర్టు వెళ్లింది. ఈ వ్యవహారంలో కొన్ని రాజకీయ కారణాలు కూడా ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో రామాయపట్నం పోర్టుపై జిల్లా వాసుల్లో ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. -
అప్పుతిప్పలు
-
అప్పుతిప్పలు
బడుగులపై బ్యాంకుల శీతకన్ను.. రుణాల జారీలో తీవ్ర అలక్ష్యం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మొండిచేయి పంట రుణాలూ లక్ష్యానికి ఆమడదూరమే రైతులకిచ్చిన రుణాలు కేవలం 57 శాతమే కౌలు రైతులకు 15 శాతమైనా ఇవ్వని దైన్యం పాడికి, మత్స్యకారులకు ఒక్క శాతమైనా ఇవ్వలేదు బీసీ సొసైటీలకూ పైసా కూడా విదల్చని వైనం సాక్షి, హైదరాబాద్: బడా బాబులకు అడిగీ అడక్కముందే వేలాది కోట్ల రూపాయలను అప్పుల రూపంలో గుమ్మరించే బ్యాంకులు బడుగు, బలహీన, రైతు వర్గాలను మాత్రం చిన్నచూపు చూస్తున్నాయి. వారికి రుణాలివ్వడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. కొన్ని వర్గాలకు అరకొర రుణాలతో సరిపెడుతుండగా, మరికొన్నింటికైతే అక్షరాలా మొండిచేయి చూపుతున్నాయి. అన్ని వర్గాలనూ కలిపి చూసినా లక్ష్యంలో సగం మందికి మాత్రమే రుణాలిచ్చి అక్కడితో చేతులు దులుపుకున్నాయనేందుకు ఈ ఏడాది రుణ ప్రణాళిక అమలు తీరే నిదర్శనం. వర్గాలవారీగా చూస్తే పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి ఉద్దేశించిన పథకాలు కాగితాలకే పరిమితమయ్యాయి. పేదల కోసం ఎంతో పాటుపడుతున్నామని ఊరూవాడా ఊదరగొడుతున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకోవడం లేదు. సర్కారు ప్రచారంలో డొల్లతనాన్ని రుణ ప్రణాళిక అమలు తీరే ఎత్తిచూపుతోంది. ఈ ఏడాది రూ.1.33 లక్షల కోట్ల రుణాలివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికి ఇచ్చిన రుణాలు రూ.91 వేల కోట్లు మాత్రమే. అందులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పట్ల బ్యాంకర్లు మరీ చిన్నచూపు చూశారు. రైతుల పట్ల కూడా నిర్లక్ష్యమే ప్రదర్శించారు. లక్ష్యంలో 57 శాతం రుణాలు మాత్రమే ఇవ్వగలిగారు. పాడి పరిశ్రమాభివృద్ధికి ఉద్దేశించిన నాబార్డ్ పథకాన్నయితే పూర్తిగా ఎత్తేశారు! ఇవన్నీ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) గణాంకాలు చెబుతున్న చేదు నిజాలే. చెప్పింది కొండంత...: రైతులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఈ ఏడాది భారీ ఎత్తున రుణాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రైతులకు రూ.లక్ష లోపు వడ్డీ లేని రుణంతో పాటు మహిళలకు వడ్డీ రాయితీ రుణాలను ఘనంగా ప్రకటించారు. అంతేగాక స్వయం ఉపాధి కింద ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల యువకులను ప్రోత్సహించడానికి వీలుగా ప్రత్యేక పథకాన్ని ప్రారంభించారు. దీనికి వడ్డీ రాయితీ రుణాలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ పథకాల్లో వేటికీ బ్యాంకర్ల నుంచి సరైన ప్రొత్సహాం అందలేదు. ముఖ్యంగా గిరిగిజన ప్రాంతాల్లోనైతే రుణ మంజూరీ మరీ దారుణంగా ఉంది. రుణాలివ్వాలంటే మైదాన ప్రాంతాలకు సంబంధించిన షూరిటీ సమర్పించాలన్న నిబంధన వల్ల గిరిగిజనులు అసలు రుణాలే పొందలేకపోతున్నారు. బడుగులకు బహు స్వల్పం! బడుగు, బలహీన వర్గాలకు అవసరమైన మేర రుణాలందడం లేదని మరోసారి తేలింది. ఆయా వర్గాలకు రుణాలిచ్చి, వారి స్వయం ఉపాధికి ప్రోత్సాహమివ్వడంలో రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ పాటిదో ఎస్ఎల్బీసీ నివేదికే చెప్పింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా కార్పొరేషన్ల ద్వారా 2012-13 ఆర్థిక సంవత్సరంలో ఆశించిన మేర రుణాలివ్వలేదని అది స్పష్టం చేసింది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న దాంట్లో కేవలం 47 శాతమే ఇవ్వగలిగినట్టు నివేదిక పేర్కొంది. కానీ వాస్తవాలు మాత్రం ఇంకా నిరాశాజనకంగా ఉన్నాయి. ఎస్టీ కార్పొరేషన్ పరిస్థితైతే మరీ దారుణం. లక్ష్యంలో కేవలం 13 శాతం మందికే రుణాలిచ్చారు. మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 52 శాతం మందికి, బీసీ కార్పొరేషన్ ద్వారా 67 శాతం మందికి రుణాలిచ్చినట్టు మాత్రం నివేదికలో పేర్కొన్నారు. బీసీ సమాఖ్యలకు సంబంధించి 37 వేల సోసైటీలకు రుణాలను అందివ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికీ ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఎస్సీలకు కార్పొరేషన్ ద్వారా 1,27,792 మందికి రూ.535.39 కోట్ల రుణాలివ్వాల్సి ఉండగా ఇప్పటికి 154 మందికి మాత్రమే అందించారు. గిరిజన కార్పొరేషన్ ద్వారా 60 వేల మంది లబ్ధిదారులకు రూ.235 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఒక్కరికి కూడా ఇవ్వలేదు. రాజీవ్ యువశక్తి పథకం కింద 11,250 మందికి లబ్ధి చేకూర్చాలని ఘనంగా లక్ష్యం విధించుకున్నా కేవలం 212 మందికి మాత్రమే రుణాలిచ్చారు. ఈ వెనుకంజకు కారణాలనేకం. ప్రభుత్వం సకాలంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించకపోవడం, నిధులివ్వకపోవడం, బ్యాంకర్లతో సమన్వయం చేసుకోకలేకపోవడం, అన్నీ జరిగినా లబ్ధిదారుల ఎంపికను ఆలస్యం చేయడం వంటివి కారణాలు బడుగుల రుణ ఆశలపై నీల్లుజల్లాయి. పంట రుణాల పరిస్థితీ అంతే పంట రుణాల జారీ కూడా ఈ ఏడాది ఆశించిన స్థాయిలో లేదు. ఖరీఫ్ సీజన్లో రూ.31,996 కోట్లు, రబీలో రూ.17,993 కోట్ల చొప్పున మొత్తం రూ.49,989 కోట్ల రుణాలివ్వాల్సి ఉంది. కానీ రూ.28,820 కోట్లు మాత్రమే అందించారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వీరికి ఈ ఏడాది రూ. 2వేల కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇచ్చింది మాత్రం రూ.315 కోట్లే. డెయిరీ, గొర్రెల పెంపకానికి, మత్స్యకారులకు రూ.5,670 కోట్లను రుణాలుగా ఇవ్వాలని లక్ష్యం పెట్టుకున్నారు. కానీ ఇప్పటిదాకా ఇచ్చిన రుణాలు రూ.13 కోట్లే. రాష్ట్రంలో పాడి పరిశ్రమను అభివృద్ధి పరిచేందుకు ఉద్దేశించిన డీఈడీఎస్ పథకానికి మంగళం పాడారు. నాబార్డ్ సబ్సిడీ అందించే ఈ పథకానికి రుణాలివ్వడం లేదు. ఈ పథకం కింద గేదెల కొనుగోలుతో పాటు, మిల్కింగ్ మిషన్, పాలను నిల్వ చేసే కూలింగ్ సెంటర్ వంటి మౌలిక సదుపాయాల ఏర్పాటుకు రుణాలిచ్చేవారు. దాంతోపాటు నాబార్డ్ సబ్సిడీ కూడా అందించేది. కానీ మార్పుల మాటున పలు ఆంక్షలతో పథకాన్ని కుదించడంతో ఈ ఏడాది డెయిరీలకు రుణాల మంజూరీ గణనీయంగా పడిపోయింది. -
రుణ ఘోష!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: దారిద్య్రరేఖకు దిగువన ఉన్న నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు గాను వివిధ సహకార సంస్థలు (కార్పొరేషన్లు) ఇచ్చే రాయితీ రుణాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.సర్కారు నుంచి స్పష్టత లేకపోవడం.. అధికార యంత్రాంగం అలసత్వంతో రుణాల తీరు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకే పరిమితమవుతోంది. 2013-14 సంవత్సరానికి గాను జిల్లాలోని వివిధ సహకార సంస్థలు రాయితీ రుణాల కోసం 10,731 మందిని ఎంపిక చేశాయి. అయితే ఆర్థిక సంవత్సరం ప్రారంభమై తొమ్మిది నెలలు కావొస్తున్నా ఇప్పటివరకు కేవలం 522 మందికి మాత్రమే రుణాలు మంజూరు చేయడం గమనార్హం. ఎంపిక సరే.. మంజూరేదీ! రాయితీ రుణాలకు సంబంధించి మండలాలవారీగా అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. రుణాలపై మండలాల్లో హడావుడి చేసిన అధికారులు చివరకు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. రుణాల మంజూరు మాత్రం నత్తనడకన సాగుతోంది. వాస్తవానికి రుణాల మంజూరు ప్రక్రియ ఈ పాటికే పూర్తికావాల్సి ఉంది. అయితే రాయితీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో ఎస్సీ కార్పొరేషన్లో రుణాల మంజూరు నిలిచిపోయింది. మిగిలిన కేటగిరీల్లో రాయితీపై స్పష్టత ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం ఉదాసీనతతో ఈ తంతు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది. లబ్ధిదారుల్లో కలవరం.. కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే రాయితీ రుణాలతో లబ్ధిదారులు స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలి. యూనిట్ ఏర్పాటుకు రుణ మొత్తం పూర్తిస్థాయిలో సరిపోనప్పటికీ.. ఇతోధిక సాయం లభిస్తుంది. ఈ మేరకు ఎంపికైన లబ్ధిదారులు రుణం వస్తుందనే ఆశతో ఇప్పటికే పలుచోట్ల యూనిట్లు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికీ రుణా ల ఊసు లేకపోవడంతో లబ్ధిదారుల్లో కలవరం మొదలైంది. ఆర్థిక సంవత్సరం దగ్గర పడుతుండడంతో రుణం వస్తుందా.. లేదా? అనే సందేహం నెలకొంది. రాయితీపై స్పష్టత లేకే.. కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే రుణాలపై లబ్ధిదారుడికి ఇవ్వాల్సిన రాయితీని ప్రభుత్వం నిర్దేశించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ కార్పొరేషన్ కింద ఇచ్చే రాయితీని ప్రభుత్వం ఇంకా ఖరారు చేయలేదు. గతంలో ఒక్కో లబ్ధిదారుడికి గరిష్టంగా రూ.30వేలు రాయితీ ఇచ్చేది. అయితే ఈ మొత్తాన్ని పెంచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రాయితీపై సందిగ్ధం నెలకొంది. అతి త్వరలో రాయితీపై స్పష్టత వస్తుందని, ఆ వెంటనే రుణాలు మంజూరు చేస్తామని షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంస్థ కార్యనిర్వాహక సంచాలకులు పీవీఎస్ లక్ష్మి ‘సాక్షి’తో పేర్కొన్నారు.