వచ్చే జన్మభూమిలో అర్హులందరికీ పెన్షన్లు | next janmabhoomi pension sanction | Sakshi
Sakshi News home page

వచ్చే జన్మభూమిలో అర్హులందరికీ పెన్షన్లు

Nov 12 2016 8:57 PM | Updated on Sep 4 2017 7:55 PM

అర్హులందరికీ వచ్చే జన్మభూమిలో పెన్షన్లు అందజేస్తామని రాష్ట్ర ఇరిగేష¯ŒS శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. తెలుగుదేశం జనచైతన్యయాత్రలో భాగంగా పాశర్లపూడిలంలో శనివారం పార్టీ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం రైతులకు పవర్‌ టిల్లర్లు అందజేశారు. పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ పేదవారు

  • ఇరిగేష¯ŒS మంత్రి దేవినేని
  • పాశర్లపూడిలంక (మామిడికుదురు) :
    అర్హులందరికీ వచ్చే జన్మభూమిలో పెన్షన్లు అందజేస్తామని రాష్ట్ర ఇరిగేష¯ŒS శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. తెలుగుదేశం జనచైతన్యయాత్రలో భాగంగా పాశర్లపూడిలంలో శనివారం పార్టీ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం రైతులకు పవర్‌ టిల్లర్లు అందజేశారు. పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ పేదవారు ఆత్మ విశ్వాçÜంతో బతకాలన్నదే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అర్హులందరికీ పెన్షన్లు, గృహాలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, రేష¯ŒSకార్డులు మంజూరు చేస్తామన్నారు. రూ.16,500 కోట్ల లోటు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని అప్పగించినా అభివృద్ధిలో ఎక్కడా రాజీ పడకుండా ముందుకు సాగుతున్నామన్నారు. రూ.24 వేలు కోట్ల రాణాల్ని వడ్డీతో సహా మాఫీ చేశామని, రూ.మూడు వేల కోట్లతో డ్వాక్రా మహిళలకు పెట్టుబడి నిధిని ఏర్పాటు చేశామని చెప్పారు. రూ.5,500 కోట్లు పెన్షన్లకు, రూ.20 వేల కోట్లు సాగునీటి రంగానికి కేటాయించామన్నారు. నియోజకవర్గానికి 1250 ఇళ్లు మంజూరు చేశామని, త్వరలోనే అదనంగా మరో 350 ఇళ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నాలుగు జిల్లాలను సస్యశ్యామలం చేశామన్నారు. చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకే జనచైతన్యయాత్రలు చేపట్టామని చెప్పారు. సమావేశంలో జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు, జెడ్పీటీసీ సభ్యుడు విత్తనాల మాణిక్యాలరావు, ఎంపీపీ మద్దాల సావిత్రీదేవి, సర్పంచ్‌ బొరుసు నర్సింహమూర్తి, ఎంపీటీసీ సభ్యురాలు పొలమూరి వెంకటలక్ష్మి, పార్టీ నాయకులు ఉండ్రు రామారావు, మద్దాల కృష్ణమూర్తి, డొక్కా నాథ్‌బాబు, సూదా బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.   
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement