కైవ్: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక బలగాలు విరుచుకుపడుతున్నాయి. కనికరం అనేదే లేకుండా రష్యా బలగాలు దాడులు జరుపుతున్నాయి. సైనికులు, పౌరుల ఆర్తనాదాలతో ఉక్రెయిన్ తమ శక్తి మేరకు రష్యాతో పోరాడుతోంది. తమ ప్రాణాలను కూడా సైతం లెక్కచేయకుండా ఉక్రెయిన్ సైనికులు సాహసం ప్రదర్శిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్, రష్యా సరిహద్దుల్లోని నల్ల సముద్రంలో ఉక్రెయిన్‌కు చెందిన స్నేక్ ద్వీపం ఉంది. ఈ ఉద్రికత్తల నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రభుత‍్వం ద్వీపానికి రక్షణగా 13 మంది సైనికులను నియమించింది. వారు విధులు నిర్వహిస్తున్న క్రమంలో రష్యా మిలటరీ ఆ ద్వీపంపై ఫోకస్ పెంచింది. స్నేక్ ఐలాండ్ లక్ష్యంగా రష్యా సైనికులు ముందుకు సాగారు.
The 13 heroes of #UKRAINE 🇺🇦 army soldiers who were stationed on snake island in the audio, one says ‘This is it ‘ they are heard telling #Russian warship to go ‘fuck yourself’ all died defending just 25 miles away from #NATO Territory #Ukrainian #UkraineInvasion #RussianArmy pic.twitter.com/fDdCVuc0Cz
— Bahaka (@Petebahaka) February 25, 2022
ఈ క్రమంలో సముద్ర జలాల్లో గస్తీ నిర‍్వహిస్తున్న రష్యాకు చెందిన నేవీ వార్‌షిప్ ఆ ఐలాండ్ వద్దకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ సైనికులను గుర్తించిన రష్యా నేవీ.. వారిని లొంగిపోవాలని సూచించారు. లేకపోతే వారిని కాల్చివేస్తామని వార్నింగ్ అనౌన్స్ చేశారు. రష్యా నేవీ వార్నింగ్‌కు ఉక్రెయిన్ సైనికులు స్పందిస్తూ.. చావనైనా చస్తాం కానీ.. లొంగిపోయే ప్రసక్తే లేదంటూ(బూతు పదజాలంతో) వ్యాఖ్యలు చేశారు. వారి మాటలతో మరింత రెచ్చిపోయిన రష్యా నేవీ.. ఉక్రెయిన్ సైనికులపై వార్‌షిప్ నుంచి బాంబుల వర్షం కురిపించింది. దీంతో 13 మంది ఉక్రెయిన్ సైనికులు వీర మరణం పొందారు.
Ukrainian soldier deployed on Snake Island live streamed the moment a Russian warship opened fire on the Island.
— C O U P S U R E (@COUPSURE) February 24, 2022
13 soldiers died in the attack. pic.twitter.com/FDe92rYYVR
Comments
Please login to add a commentAdd a comment