ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం మెటా కీలక నిర్ణయం తీసుకుంది. మెటా పరిధిలోని ఫేస్‌బుక్‌లో రష్యన్ మీడియాకు సంబంధించిన అడ్వెర్‌టైజ్‌మెంట్లును నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాదు ఫేస్‌బుక్ వేదికగా రష్యన్ మీడియాకు ఆదాయం సంపాదించే మార్గాలన్నింటినీ మూసి వేస్తున్నట్టు కూడా తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.
మెటా ఆధ్వర్యంలో ప్రస్తుతం వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఫేస్‌బుక్ ప్లాట్‌ఫామ్‌పై నిషేధం అమల్లోకి రానుంది .మరి మిగిలిన ప్లాట్‌ఫామ్స్ విషయంలో మెటా నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. మెటా తీసుకున్న తాజా నిర్ణయంతో రష్యన్ మీడియా నుంచి వచ్చే సమాచారం ఇకపై ఫేస్‌బుక్‌లో కనిపించవు. అదే విధంగా చాలా వరకు రష్యన్ వీడియోలు, ఇతర సమాచారం కూడా ఫిల్టర్ అవనుంది.
రష్యా కమ్యూనిస్టు దేశం కావడంతో అక్కడ మీడియా స్వేచ్ఛ పరిమితం. ప్రభుత్వం కనుసన్నల్లో రష్యన్ మీడియా వెల్లడించే సమాచారామే పెద్ద దిక్కు. తాజా పరిణామాల నేపథ్యంలో రష్యన్ మీడియాపై ఫేస్‌బుక్‌లో ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. దీంతో రష్యాకు సంబంధించిన సమాచారం మరింత తక్కువగా బయటి ప్రపంచానికి వెల్లడి కానుంది.
ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ ఇటు అమెరికాతో పాటు అటూ యూరోపియన్ దేశాలు అనేక కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రకటించిన చర్యలన్నీ ప్రభుత్వ పరమైనవే ఎక్కువగా ఉన్నాయి. తాజాగా వీటికి ప్రైవేటు కంపెనీలు కూడా జత కలుస్తున్నాయి. ముందుగా ఫేస్‌బుక్ తరఫున మెటా నుంచి ప్రకటన వెలువడింది. మరి ఈ దారిలో మరిన్ని ప్రైవేటు కంపెనీలు నడుస్తాయా లేదా అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది.
చదవండి: మాట వినకపోతే కఠిన ఆంక్షలే
Comments
Please login to add a commentAdd a comment