ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న మారణ హోమం నేపథ్యంలో యూట్యూబ్ కీలక నిర్ణయం తీసుకుంది. యూట్యూబ్ పరిధిలోని రష్యన్ మీడియాకు సంబంధించిన అడ్వెర్‌టైజ్‌మెంట్లును నిషేధిస్తున్నట్టు ప్రకటించింది.
యూట్యూబ్ శనివారం రష్యా ప్రభుత్వ పరిధిలో ఉన్న మీడియా సంస్థ రష్యా టుడే-(ఆర్టీ)తో పాటు ఇతర రష్యాకు చెందిన యూట్యూబ్ అకౌంట్‌లను సస్పెండ్ చేసినట్లు యూట్యూబ్ అధికారిక ప్రతినిధి ధృవీకరించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి దాడికి అనుమతి ఇచ్చినందుకు ప్రతిస్పందనగా ఈ తొలగింపు జరిగినట్లు యూట్యూబ్ తెలిపింది.
రష్యాలో ఇప్పటికే మోసపూరిత పద్ధతులకు వ్యతిరేకంగా యూట్యూబ్ ప్రైవసీ పాలసీ విధానాల్ని ఉల్లంఘించే వీడియోలను తొలగిస్తున్నట్లు యూట్యూబ్ ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఉక్రెయిన్‌లో అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో మేము అనేక చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవలే అమలు చేసిన ఆంక్షల కారణంగా రష్యన్ ఛానల్తో సహా యూట్యూబ్‌లో డబ్బులు ఆర్జించే అనేక ఛానెల్స్ ను నిషేధిస్తున్నట్లు ఆ రిపోర్ట్‌లో పేర్కొంది.
కాగా ఫేస్‌బుక్(మెటా)తో రష్యా మీడియా ఆదాయ వనరుల్ని నిలిపిస్తున్నట్లు ఫేస్‌బుక్ సెక్యూరిటీ పాలసీ హెడ్ నథానియల్ గ్లీచెర్ ట్వీట్ చేశారు. ఇప్పుడు మెటా దారిలో యూట్యూబ్ కీలక నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ నిర్ణయం రష్యాలో శాస్వతంగా కొనసాగుతుందా? లేదంటే తాత్కాలికంగా నిషేధం విధించారా? అనే విషయం తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment