కీవ్ : రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. మొత్తం 8 డ్రోన్లను రష్యాపై ప్రయోగించింది. శనివారం కజాన్ నగరంలో హైరైజ్ బిల్డింగ్స్‌పై డ్రోన్ దాడులు జరిపింది. మూడు అత్యంత ఎత్తైన బిల్డింగ్‌లను డ్రోన్‌లు ఢీకొట్టాయి. డ్రోన్‌ల దాడితో కజాన్ ఎయిర్‌పోర్టును మూసివేశారు. కజాన్‌కు ఈశాన్య నగరం ఇజెవ్‌స్క్‌లో, కజాన్‌కు దక్షిణంగా ఉన్న సరాటోవ్‌లో మరో రెండు విమానాశ్రయాలలో తాత్కాలిక ఆంక్షలను విధిస్తున్నట్లు వెల్లడించింది.
రాజధాని మాస్కోకు తూర్పున ఉన్న కజాన్‌లోని నివాస సముదాయాలపై డ్రోన్ దాడి జరిగినట్లు రష్యా ప్రభుత్వ వార్తా సంస్థలు నివేదించాయి. ఉక్రెయిన్ ప్రయోగించిన వాటిలో పలు డ్రోన్‌లను కూల్చివేశామని రష్యా ప్రకటించింది. నివాస సముదాయాలపై జరిగిన డ్రోన్ దాడుల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని స్థానిక అధికారులు వెల్లడించారు. కజాన్ మేయర్ టెలిగ్రామ్‌లో మాట్లాడుతూ నగరంలో అన్ని కార్యక్రమాలను రద్దు చేసినట్లు,ప్రాణనష్టం జరగకుండా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని చెప్పారు.
Russia witness 9/11 style attack!
Drones/UAV's attack high-rise buildings in Kazan, residents evacuated, Alert Sounded pic.twitter.com/PMHthxQBxh— Megh Updates 🚨™ (@MeghUpdates) December 21, 2024
Comments
Please login to add a commentAdd a comment