20,000 పైన లాభాల స్వీకరణ | Sensex gains 88.5 points to end at nearly 3-week high after RBI move | Sakshi
Sakshi News home page

20,000 పైన లాభాల స్వీకరణ

Published Wed, Oct 9 2013 2:35 AM | Last Updated on Fri, Sep 1 2017 11:27 PM

20,000 పైన లాభాల స్వీకరణ

20,000 పైన లాభాల స్వీకరణ

 బ్యాంకులకు అత్యవసర నిధులు అందించేందుకు ఉద్దేశించిన మార్జిన్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్) వడ్డీ రేటును రిజర్వుబ్యాంక్ తగ్గించిన నేపథ్యంలో మంగళవారం ఉదయుం ట్రేడింగ్ ప్రారంభంలో స్టాక్ సూచీలు ర్యాలీ జరిపారు. అయితే బ్యాంకింగ్, ఐటీ, మెటల్ షేర్లలో జరిగిన లాభాల స్వీకరణ ఫలితంగా సూచీలు తొలి లాభాల్ని కోల్పోయూయి. ప్రారంభ సవుయుంలో 230 పాయింట్లు ర్యాలీ జరిపి 21,150 పాయింట్లు స్థాయికి పెరిగిన సెన్సెక్స్ చివరకు 88 పాయింట్ల స్వల్పలాభంతో రెండు వారాల గరిష్టస్థారుు 19,983 పాయింట్ల వద్ద ముగిసింది.
 
 అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 5,982 పాయింట్ల గరిష్టస్థారుు నుంచి క్రమేపీ తగ్గుతూ చివరకు 22 పారుుంట్లు వూత్రమే లాభపడింది. 5,928 పాయింట్ల వద్ద ముగిసింది. తొలిదశలో పలు బ్యాంకింగ్ షేర్లు 5-7 శాతం అప్‌తో ట్రేడయ్యూరుు. దేశీయు సంస్థలు లాభాల స్వీకరణకు దిగడంతో చాలావర కూ షేర్లు తొలి లాభాల్ని కోల్పోయూరు. ఐసీఐసీఐ బ్యాంక్ 2 శాతం లాభంతో ముగియుగా, ఎస్‌బీఐ స్వల్పనష్టంతో క్లోజయ్యింది. గత రెండు రోజులుగా ర్యాలీ జరిపిన ఐటీ, మెటల్ షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో టీసీఎస్, హిందాల్కో, టాటాస్టీల్‌లు నష్టాలతో ముగిసాయి. టెలికాం, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్‌ఎంసీజీ షేర్లు ర్యాలీ జరిపారు. భారతి ఎయిర్‌టెల్, లార్సన్ అండ్ టూబ్రో, ఐటీసీలు 2-3 శాతం మధ్య పెరిగారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 226 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొనుగోలు చేసారు. దేశీయు సంస్థలు రూ. 454 కోట్ల మేర నికర విక్రయూలు జరిపారు.
 
 టెలికాం షేర్లలో లాంగ్ బిల్డప్
 కార్పొరేట్ ఫలితాల సీజన్ సమీపిస్తున్న తరుణంలో టెలికాం షేర్లలో లాంగ్ బిల్డప్ జరిగింది. క్యాష్ మార్కెట్లో 5 శాతంపైగా ర్యాలీ జరిపి ఆల్‌టైమ్ గరిష్టస్థారు రూ. 182 వద్ద ముగిసిన ఐడియూ సెల్యులర్ ఫ్యూచర్ కాంట్రాక్టులో ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ కౌంటర్లో తాజాగా 12.88 లక్షల షేర్లు (16 శాతం) యూడ్‌కావడంతో మొత్తం ఓఐ 92.24 లక్షల షేర్లకు చేరింది. అడాగ్ గ్రూప్ కంపెనీ రిలయున్స్ కమ్యూనికేషన్ ఫ్యూచర్ కాంట్రాక్టులో 6.96 లక్షల షేర్లు (2.3 శాతం) యూడ్‌కావడంతో మొత్తం ఓఐ 3.09 కోట్ల షేర్లకు పెరిగింది. అయితే ఈ షేరు ఆప్షన్ కాంట్రాక్టుల్లో రూ. 150 స్ట్రయిక్ వద్ద భారీగా కాల్ రైటింగ్ జరిగింది. ఈ కాల్ ఆప్షన్లో ఓఐ 25.64 లక్షల షేర్లకు చేరింది. సమీప  భవిష్యత్తులో ఈ షేరు రూ. 150పైన స్థిరపడితేనే పెరిగే అవకాశాలున్నాయుని ఈ రైటింగ్ వెల్లడిస్తున్నది. భారతి ఎయిర్‌టెల్ ఫ్యూచర్లో ఒక లక్ష షేర్లు (1 శాతం) యూడ్ అయ్యూరు. మొత్తం ఓఐ 1.02 కోట్ల షేర్లకు చేరింది. రానున్న రోజుల్లో షేరు వురింత పెరగవచ్చన్న అంచనాలతో కొనుగోలుచేసే ఫ్యూచర్ కాంట్రాక్టును లాంగ్ పొజిషన్ అంటారు. ఫలానాస్థారు నుంచి షేరు పెరగకపోవచ్చన్న అంచనాలతో కాల్ ఆప్షన్లను  విక్రయించే ప్రక్రియును కాల్ రైటింగ్‌గా పరిగణిస్తారు.
 
 ఎస్‌బీఐ కౌంటర్లో షార్ట్ బిల్డప్....
 మంగళవారంనాటి బ్యాంకింగ్ షేర్ల ర్యాలీలో పలు బ్యాంకు కౌంటర్లలో లాభాల స్వీకరణ జరగ్గా, ఎస్‌బీఐ ఫ్యూచర్ కాంట్రాక్టులో మాత్రం షార్ట్ బిల్డప్ జరిగినట్లు డేటా వెల్లడిస్తున్నది. ఈ ఫ్యూచర్ కాంట్రాక్టులో తాజాగా 2.73 లక్షల షేర్లు (5 శాతం) యూడ్‌కావడంతో మొత్తం ఓఐ 58.21 లక్షల షేర్లకు చేరింది. రూ. 1,600 స్ట్రయిక్ వద్ద పుట్ కవరింగ్, రూ. 1,650 వద్ద కాల్ కవరింగ్ జరిగింది. సమీప భవిష్యత్తులో ఈ షేరు రూ. 1,650 స్థాయిని అధిగమించడం కష్టసాధ్యమని, రూ. 1,600లోపున వురింత క్షీణించవచ్చని ఈ డేటా సూచిస్తున్నది. రానున్న రోజుల్లో షేరు తగ్గవచ్చన్న అంచనాలతో విక్రయించిన ఫ్యూచర్ కాంట్రాక్టును షార్ట్ పొజిషన్ అంటారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement