ఆర్‌బీఐ అస్త్రాలు ఇవీ...
బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్య లభ్యతను (లిక్విడిటీ) నియంత్రించడానికి ఆర్‌బీఐ అనుసరించే విధానాల్లో కీలకమైన నాలుగు అంశాలను పరిశీలిస్తే...
రెపో రేటు: ఆర్‌బీఐ నుంచి తాము తీసుకున్న రుణాలపై బ్యాంకులు చెల్లించే వడ్డీ రేటు. మనీ నిర్వహణలో భాగంగా నగదు అత్యవసరమైనప్పుడు బ్యాంకులు స్వల్పకాలికంగా రెపో విండో ద్వారా ఆర్‌బీఐ నుంచి రుణం తీసుకుంటాయి. దీనికి చెల్లించే వడ్డీ రేటునే రెపో రేటు అంటారు.
రివర్స్ రెపో రేటు : పైన చెప్పుకున్న దానికి ఇది భిన్నం. బ్యాంకులు తన దగ్గర ఉంచే నిధులపై ఆర్‌బీఐ ఇచ్చే వడ్డీ రేటు ఇది. సాధారణంగా బ్యాంకులు వాటి దగ్గర అధిక నగదు ఉన్నప్పుడు ఆర్‌బీఐ వద్ద డిపాజిట్ చేస్తాయి. దానిపై ఆర్‌బీఐ బ్యాంకులకు వడ్డీ చెల్లిస్తుంది. దీనినే రివర్స్ రెపో రేటు అంటారు.
ఎంఎస్‌ఎఫ్: స్వల్పకాలిక రుణాల వడ్డీరేట్లలో హెచ్చుతగ్గులను నివారించేందుకు ఆర్‌బీఐ 2011 మే 3 పాలసీ సమీక్ష సందర్భంగా ఈ ఎంఎస్‌ఎఫ్‌ను ప్రవేశపెట్టింది.
సీఆర్‌ఆర్: బ్యాంకులు తమ మొత్తం డిపాజిట్లలో ఆర్‌బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాల్సిన నగదు నిల్వల నిష్పత్తి.