59 నిమిషాల్లోనే బ్యాంక్‌ రుణాలు | PSB Loans in 59 Minutes on web portal | Sakshi
Sakshi News home page

ఇక రిటైల్‌లోనూ 59 నిమిషాల్లో...

Published Fri, Sep 6 2019 8:46 AM | Last Updated on Fri, Sep 6 2019 8:46 AM

PSB Loans in 59 Minutes on web portal - Sakshi

న్యూఢిల్లీ: ‘59 నిమిషాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) రుణాలు’ పోర్టల్‌ సేవలు రిటైల్‌ రుణాలకూ విస్తరించడం జరిగింది. రిటైల్‌ రుణ లభ్యతకూ ఈ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. గృహ, వ్యక్తిగత రుణ ప్రతిపాదనలకు ఈ పోర్టల్‌ ఇకపై అందుబాటులో ఉండనుంది. త్వరలో ఆటో రుణాలకు సంబంధించి కూడా అందుబాటులోకి వస్తుందని అధికార వర్గాలు తెలపాయి.  ఇప్పటి వరకూ ఈ సేవలు లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) మాత్రమే అందుబాటులో ఉంది. 2018 నవంబర్‌లో కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది.  

ఎంఎస్‌ఎంఈలకు  కోటి రూపాయల వరకూ ఈ పోర్టల్‌ ద్వారా రుణం పొందే సౌలభ్యం ఉంది. ఆదాయపు పన్ను రిటర్న్స్‌ నుంచి బ్యాంక్‌ అకౌంట్ల వరకూ అందుబాటులోఉన్న పలు  ఎలక్ట్రానిక్‌ డాక్యుమెంట్లను పరిశీలనలోకి తీసుకుని వచ్చే డేటా పాయింట్లను అత్యుధునిక ఆల్గోరిథమ్స్‌ ద్వారా విశ్లేషించి తక్షణ రుణ లభ్యత కల్పించడం ఈ పోర్టల్‌ ముఖ్య ఉద్దేశం. 2019 మార్చి 31వ తేదీ వరకూ అందిన గణాంకాల ప్రకారం- ఈ రుణాల కోసం 50,706 ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో 27,893 ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement