ఇటీవల కాలంలో యువత చేస్తున్న ఉద్యోగాలలో వాళ్లకిచ్చే జీతం వారి జీవన విధానానికి సరిపోవడం లేదు. అందుకు కొంత మంది రెగుల్యర్ జాబ్‌తో పాటు ఫ్రీలాన్సర్‌గా చేస్తూ ఆర్జిస్తుంటే, మరి కొంతమంది పొదుపు మంత్రం పాటిస్తున్నారు. అయితే అధిక శాతం మాత్రం వారి అవసరాల కోసం ముందుస్తుగా బ్యాంక్ నుంచి లోన్ తీసుకునేందేకు మొగ్గు చూపుతున్నారు. గతంలో లోన్ తీసుకోవాలంటే రోజుల తరబడి బ్యాంక్ చూట్లూ తిరిగి, డ్యాంకుమెంట్లు సమర్పించి, ఆపై వెరిఫికేషన్ ఇవన్నీ పూర్తి చేసి చేతికి డబ్బులు రావాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది.
కానీ ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆ రోజులు పోయాయి. మీ వద్ద కావాల్సిన డ్యాకుమెంట్లు అన్నీ ఉంటే ఒక్క రోజులోనే మీ లోన్‌లు మంజూరవుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వ రంగ బ్యాంకులు కలిసి పీఎస్‌బీ లోన్స్ ఇన్ 59 మినిట్స్ (PSB Loan in 59 Minutes) అని ఓ ప్లాట్‌ఫామ్ కూడా రూపొందించింది. మొదట్లో ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా కేవలం బిజినెస్ లోన్స్ మాత్రమే లభించేవి. కానీ ఇప్పుడు ఎంఎస్ఎంఈ లోన్, ముద్ర లోన్, పర్సనల్ లోన్, హోమ్ లోన్, ఆటో లోన్ లాంటి అనేక సేవలు అందిస్తోంది.
అసలేంటి పీఎస్‌బీ(PSB).... ఏం పని చేస్తుంది!
పీఎస్‌బీ లోన్స్ ఇన్ 59 మినిట్స్( psbloansin59minutes.com) ప్లాట్‌ఫామ్ 2018 సెప్టెంబర్ 29న ప్రారంభమైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు ఇది బిజినెస్ లోన్ కేటగిరీలో 2,01,863 రుణాలు మంజూరై, రూ.39,580 కోట్ల రుణాలు మంజూరు చేశాయి. రీటైల్ లోన్ కేటగిరీలో 17,791 రుణాలు మంజూరు కాగా, రూ.1,689 కోట్లు మంజూరు చేశాయి ప్రభుత్వ రంగ బ్యాంకులు.
పీఎస్‌బీ లోన్స్ ఇన్ 59 మినిట్స్ ప్లాట్‌ఫామ్‌లో మీరు కూడా ఎంఎస్ఎంఈ లోన్, ముద్ర లోన్, పర్సనల్ లోన్, హోమ్ లోన్, ఆటో లోన్ కోసం దరఖాస్తు చేయొచ్చు. వ్యాపారం కోసం అయితే జీఎస్‌టిఐఎన్, జీఎస్‌టీ యూజర్ నేమ్, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ డాక్యుమెంట్స్ వంటి వాటిని సిద్ధంగా ఉంచుకోవాలి.
ఇలా రిజిష్టర్ చేసుకోండి:
1: PSB అధికారిక వెబ్‌సైట్ psbloansin59minutes.comకి వెళ్లి రిజిస్టర్‌పై క్లిక్ చేయండి
2: రిజిష్టర్ ప్రక్రియలో పేరు, ఈమెయిల్ చిరునామా, మొబైల్ నంబర్ నింపి, ‘గెట్ OTP’పై క్లిక్ చేయండి
3: మీరు నమోదు చేసిన మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని ఆ ఎంటర్ చేయండి
4: టెర్మ్స్ అండ్ కండీషన్స్ చెక్‌బాక్స్‌పై క్లిక్ చేసి అంగీకరించండి
5: అక్కడ ఉన్న కాలమ్స్ నింపిన తర్వాత ‘ప్రొసీడ్’పై క్లిక్ చేయండి
6: మీరు రిజిష్టర్ అయినా అకౌంట్‌కు పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోండి
ఇలా చేస్తే లోన్ వచ్చేస్తుంది..
1: మీరు క్రియేట్ చేసిన అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి
2: వ్యాపారం లేదా ఎంఎస్‌ఎంఈ(MSME) లోన్ పొందడానికి మీ ప్రొఫైల్‌ను ‘బిజినెస్’గా ఎంచుకోండి, లేదా (పర్సనల్ లోన్ కోసం రీటైల్ ఎంచుకోండి) తర్వాత ప్రొసీడ్ పై క్లిక్ చేయండి
3: ప్రొఫైల్ క్రియేట్ చేసి ఆపై మీ వ్యాపార పాన్ వివరాలను నమోదు చేసి, 'ప్రొసీడ్'పై క్లిక్ చేయండి
4: గత 6 నెలలకు సంబంధించిన మీ GST వివరాలు, పన్ను రిటర్న్‌లు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను నింపండి
5: మీ ITRని అప్‌లోడ్ చేయండి, ఇతర ముఖ్యమైన వివరాలను ఎంటర్ చేయండి
6: మీ బ్యాంక్ వివరాలను ఎంటర్ చేయండి
7: మీ వ్యాపార వివరాలను నమోదు చేయండి. అలాగే ఇప్పటికే ఉన్న ఏదైనా లోన్ వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
8: మీకు OTP వస్తుంది దీని ద్వారా మీ ఈమెయిల్ వెరిఫై చేయబడుతుంది.
9: ఆ తర్వాత ఏ బ్యాంకు ఎంత వడ్డీకి రుణాలు అందిస్తున్నాయో కనిపిస్తుంది. అందులో మీరు అప్లై చేయాలనుకున్న బ్యాంక్‌తో పాటు ఆ బ్రాంచ్‌ని సెలెక్ట్ చేయాలి. తర్వాత మీకు బ్యాంకు నుంచి ఇన్-ప్రిన్సిపల్ అప్రూవల్ లభిస్తుంది.
చదవండి: పారిశుధ్య కార్మికులకు భారీ డిమాండ్..కిటికీ అద్దాలు తుడిస్తే చాలు ఏడాదికి కోటి రూపాయిల జీతం!
Comments
Please login to add a commentAdd a comment