న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు తమ డిమాండ్ల సాధనకోసం బుధవారం సమ్మె చేయనున్నారు. దీనితో ఈ బ్యాంకుల్లో చెక్కు క్లియరెన్స్ వంటి సాధారణ బ్యాంకింగ్ కార్యకలాపాలకు అంతరాయం కలగనుంది. వేతన సవరణసహా పలు డిమాండ్ల సాధనలో భాగంగా సమ్మె చేయాలని ఉద్యోగ సంఘాలు తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది.
ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఉద్యోగులకు సమ్మె చేయడం మినహా గత్యంతరం లేకుండా పోయిందని యునెటైడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ (యూఎఫ్‌బీయూ) కన్వీనర్ ఎంవీ మురళి తెలిపారు. వేతన పెంపును 25 శాతం నుంచి 23 శాతానికి తగ్గించినా ఐబీఏ స్పందించలేదని అన్నారు.
11 శాతం పెంపుదల ప్రతిపాదన తమకు సమ్మతం కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దేశంలో మొత్తం 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. వీటి మొత్తానికి సంబంధించి దేశ వ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న 50,000 బ్రాంచీలలో ఉద్యోగుల సంఖ దాదాపు 8 లక్షలు.
నేడు ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగుల సమ్మె
Published Wed, Nov 12 2014 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 PM
Advertisement