Labor issues
-
తేలనున్న భవితవ్యం
ఎన్డీఎస్ఎల్ సమస్యకు పరిష్కారం! * నేడు మంత్రి కేటీఆర్‌తో కీలక సమావేశం * మంత్రి పోచారం, ఎంపీ కవిత హాజరు * ఫ్యాక్టరీల పునరుద్ధరణకే అవకాశం * రైతులు, కార్మికుల సమస్యలపైనా చర్చ * లేఆఫ్ ప్రకటించి సుమారు ఐదు నెలలు * మూడు జిల్లాల్లో నిలిచిపోయిన ఫ్యాక్టరీలు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎస్ఎ ల్) భవిష్యత్తు, కార్మికుల సమస్యలకు బుధవారం పరిష్కారం దొరికే అవకాశం ఉంది. హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి కేటీఆర్ జిల్లా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కవిత, ఎమ్మెల్యే షకీల్ సమక్షంలో కార్మికులతో సమావేశం నిర్వహించనున్నారు. ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం 2015-16 క్రషింగ్ సీజన్ నడుపకుండా చేతులెత్తేసిన విషయం తెలిసిం దే. చెరుకు, నీటి కొరత కారణంగా ఫ్యాక్టరీని నడుపలేమని 2015 డిసెంబర్ 23న లేఆఫ్ నోటీసు జారీ చేసి బోధన్‌తో పాటు ముత్యంపేట (కరీంనగర్) ముంబోజిపల్లి(మెదక్) ఫ్యాక్టరీలను మూసివేసింది. సరిగ్గా అంతకు నెల రోజుల ముందు 2015 నవంబర్ 23న హైదరాబాద్‌లో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఈ మూడు ఫ్యాక్టరీల పరిధిలోని రైతులతో సమావేశం ని ర్వహించారు. చెరుకును ప్రైవేట్ ఫ్యాక్టరీలకు తరలిం చాలని నిర్ణయం తీసుకున్నారు. చెరుకును ప్రైవేట్ ఫ్యాక్టరీలకు రైతులు తరలించారు. బోధన్ ప్రాంతంలోని కొందరు రైతులు మహారాష్ట్ర ప్రాంత చక్కెర ఫ్యాక్టరీలకు తరలించారు. కలకలం రేపిన లేఆఫ్ ప్రకటన.. 2015 డిసెంబర్ 23న ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం లేఆఫ్ ప్రకటించింది. నిజామాబాద్, కరీంనగర్, మెద క్ జిల్లాల్లోని బోధన్, ముత్యంపేట, ముంబోజిపల్లి ఫ్యాక్టరీలో 302 మంది కార్మికులు పని చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఫ్యాక్టరీ మూసివేతతో ఉపాధి కో ల్పోయారు. ఎంపీ కవితో పాటు మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, నాయినీ నర్సింహా రెడ్డి, హరీశ్‌రావు, స్థానిక ఎమ్మెల్యే షకీల్‌లను తిరిగి ఫ్యాక్టరీని తెరిపించాలని పలుమార్లు రైతులు, కార్మికు లు కలిశారు. ఎంపీ కవిత చొరవతో 2016 జనవరి 11న ఫ్యాక్టరీ అధికారులు, కార్మిక సంఘాల నాయకులతో హైదరాబాద్‌లో లేఆఫ్ ఎత్తివేత, బకాయి వేతనాలు, ఉద్యోగ భద్రత సమస్యలపై చర్చలు జరిగా యి. చర్చలు అప్పుడు కొలిక్కి రాకపోగా... అదే నెల 18న రెండవ దఫా చర్చలు వాయిదా పడ్డాయి. 2016 మార్చి 16న మూడవ దఫా చర్చలు ఫలించలేదు. 2016 ఏప్రిల్ 2,11,26 తేదీల్లో చర్చలకు ఫ్యాక్టరీ అధికారులు హాజరుకాలేదు. దీంతో కార్మిక సంక్షేమ శాఖ అధికారులు చర్చల ప్రక్రియను ముగిస్తున్నట్టు స్పష్టం చేశారు. లేబర్ కోర్టులో కేసువేయాలని నిర్ణయానికి వచ్చారు. లేఆఫ్ ఎత్తివేత, కార్మికుల బకాయి వేతనాల పై లేబర్ కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. లేఆఫ్ ఎత్తివేసి తిరిగి ఫ్యాక్టరీ తెరిపించాలని, బకాయి వేతనాలు చె ల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మికులు వివిధ రూపాల్లో ఆందోళనల నేపథ్యంలో నేడు జరిగే కీలక చర్చలపైన అందరూ దృష్టి సారించారు. మంత్రి కేటీఆర్‌తో జరిగే చర్చలు కీలకం కానున్నాయని, సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంపీ కల్వకుంట్ల కవిత మంగళవారం నిజామాబాద్‌లో మీడియాతో వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎన్డీఎస్ఎల్ సమస్యకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. కార్మికుల ప్రధాన సమస్యలు, డిమాండ్లు * ఫ్యాక్టరీ లేఆఫ్ ఎత్తివేయాలి. తిరిగి ఫ్యాక్టరీ పునరుద్ధరించాలి. * బకాయి వేతనాలు చెల్లించాలి. 2015 డిసెంబర్ 23 నుంచి ఇప్పటి వరకు సుమారు ఐదు నెలల నెలసరి వేతనాల చెల్లింపులు ఆగిపోయాయి. మూడు ఫ్యాక్టరీల పరిధిలో 302 మంది కార్మికు లు పని చేస్తున్నారు. వీరికి నెలకు రూ. 56 లక్షల వేతనాలు రావాల్సి ఉంది. ఐదు నెలల వేతనాలు మొత్తం రూ. 2 కోట్ల 80 లక్షలు చెల్లించాల్సి ఉం ది. బోధన్ ఫ్యాక్టరీలో 155 మంది, ముంబోజి పల్లి ఫ్యాక్టరీలో 140 మంది,ముత్యంపేటలో ఏ డుగురు పర్మినెంట్ కార్మికులు పని చేస్తున్నారు. * లేఆఫ్తో ఫ్యాక్టరీ మూసివేతతో ఉపాధి కోల్పోయామని, ప్రత్యామ్నాయ మార్గాలు లేవని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఐదు నెలులగా వేతనాలు లేక కుటుంబ పోషణ భారంగా మా రిందని, అర్ధాకలితో కాలం వెళ్లదీస్తున్నామంటున్నారు. * ఫ్యాక్టరీ భవిష్యత్తు తేల్చాలని, వచ్చే ఏడాదైనా ఫ్యాక్టరీని నడిపిస్తామని ప్రభుత్వం కచ్చితమైన భరోసా ఇవ్వాలని కోరుతున్నారు. ఫ్యాక్టరీ నడిపించే పరిస్థితి లేకపోతే ప్రత్యామ్నాయ మార్గం గా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దశాబ్దాలు గా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలి. * మరో వైపు రైతులు చెరుకు పంట సాగు, ఫ్యాక్టరీ భవిష్యత్తుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరు తున్నారు. గతంలో చెరుకు పంటకు ఫ్యాక్టరీ యా జమాన్యం అగ్రిమెంట్ చేసుకునేది. గడిచిన సీజ న్లో ఫ్యాక్టరీ యాజమాన్యం అగ్రిమెంట్ చేసుకోలేదు. కాబట్టి ప్రభుత్వమే చొరవ చూపాలి. సమస్య పరిష్కరించాలి. -
కార్మికుల సమస్యలపై పోరాడుతా
ఓడీ చెరువు: అంగన్వాడీలు, అసంఘటిత రంగ కార్మికుల సమస్యలను చట్టసభలో వినిపిస్తానని, అందరికీ న్యాయం జరిగేలా పోరాడుతానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ఆయన బుధవారం కడప జిల్లా ఇడుపులపాయ నుంచి బెంగళూరు వెళుతూ అనంతపురం జిల్లా ఓడీచెరువులో ఆగారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఆందోళన నిర్వహిస్తున్న అసంఘటిత రంగ కార్మికులు, అంగన్వాడీలు, వామపక్ష నేతలకు సంఘీభావం తెలిపారు. కార్మికులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను జగన్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం అంగన్వాడీలతో వెట్టిచాకిరీ చేయిస్తోందని, 60 ఏళ్ల వయసున్న వారిని విధుల నుంచి తొలగిస్తోందని అంగన్వాడీ వర్కర్ల సంఘం నేత ఆశీర్వాదమ్మ, కార్యకర్తలు నరసమ్మ, లక్ష్మీదేవి,పాపమ్మ, వెంకటమ్మ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి నామమాత్రపు వేతనంతో పని చేస్తున్న తమకు పెన్షన్ ఇవ్వకుండా తొలగిస్తుండడంతో కుటుంబ పోషణ భారమవుతోందన్నారు. ప్రభుత్వం వేతనాలు పెంచింది కదా! అని జగన్ ప్రస్తావించగా.. జీవో ఇచ్చారు కానీ వేతనాలు పెరగలేదని వారు బదులిచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. మీ సమస్యలపై చట్టసభలో మాట్లాడతానని హామీ ఇచ్చారు. జగన్ వెంట కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ఉన్నారు. -
గల్ఫ్ కార్మికుల సమస్యలపై పోరు
బె హరాన్లో ప్రొఫెసర్ కోదండరాం రాయికల్/సిరిసిల్ల : గల్ఫ్ దేశా ల్లో తెలంగాణ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి ఒత్తిడి తీసుకొస్తామని టీజేఏసీ చైర్మన్ కోదండరాం, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీ అన్నారు. బహ్రెరుున్లోని నవ తెలంగాణ సమాజం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో వీరు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో గల్ఫ్ కార్మికులను ఆదుకుంటామని ప్రకటించిన అధికార పార్టీ నేతలు ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నా రు. గల్ఫ్ బాధితులకు సబ్సిడీ రుణాలు, ఉపాధి కల్పించేలా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. గల్ఫ్ బాధితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీరితోపాటు మల్లేపల్లి లక్ష్మయ్య ఉన్నా రు. వీరిని నవ తెలంగాణ సమాజం అధ్యక్షుడు దేవేం దర్తోపాటు సభ్యులు సన్మానించారు. వేడుకల్లో తెలంగాణ ఉద్యమ గీతాలు హోరెత్తించాయి. -
కార్మికుల సమస్యలు పరిష్కారానికి కృషి
సైదాపురం: మైకా కార్మికుల సమస్యలు పరిష్కారానికి కృషిచేస్తానని తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌రావు చెప్పారు. మండలంలోని కలిచేడు గ్రామంలో ఆదివారం నిర్వహించిన మైకా కార్మిక సంక్షేమ సంస్థల పునరుద్ధరణ సభకు ఆయన విచ్చేశారు. సమావేశానికి రెండు గంటల ముందుగానే ఆయన ప్రజలు, అధికారులతో మాట్లాడారు. వరప్రసాదరావు మాట్లాడుతూ రాయల్టీ రూపేణా ఒక్క పైసా కూడా రాకపోవడంతో పదేళ్ల కిందటే స్కూల్స్ మూసివేసేందుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర కార్మిక శాఖ కమిషనర్ తన దృష్టికి తెచ్చారని చెప్పారు. ప్రస్తుతం కోర్టు ఆదేశాలతో పాఠశాలలు నడుపుతున్నామని చెప్పినట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడా ఇలాంటి పాఠశాలలు నడపటం లేదనే విషయాన్ని కూడా ఆయన వెల్లడించారని పేర్కొన్నారు. ఎలాగైనా పాఠశాల మూత పడకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయకపోవడంతో పాఠశాలల్లో కూడా విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఉపాధ్యాయులు ఎంపీకి తెలిపారు. కేంద్రీయ విద్యాలయం, ఆస్పత్రి ఏర్పాటుకు చర్యలు.. మూతపడి ఉన్న 30 పడకల ఆస్పత్రిని కూడా ఎంపీ పరిశీలించారు. పది పంచాయతీలు ఉన్న ఈ గ్రామంలో త్వరలోనే ఆస్పత్రి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రప్రభుత్వంతో చర్చించి కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటానని తెలిపారు. సమస్యలపై ఎంపీకి వినతులు... కలిచేడు గ్రామానికి చేరుకున్న తిరుపతి ఎంపీకి మండల ప్రజలు పలు సమస్యలతో వినతిపత్రాలను అందజేశారు. జెడ్పీ వైఎస్చైర్పర్సన్ పోట్టేళ్ళ శిరీషా, జిల్లా ట్రేడింగ్ యూనియన్ కార్యదర్శి నోటిరమణారెడ్డి ఎంపీకీ స్వాగతం పలికారు. కార్యక్రమంలో నాయకులు బండిసుబ్బారెడ్డి, బాబు, మునిరత్నం, శాఖారపు వెంకయ్య, వీరాస్వామి, ప్రసన్నకుమార్‌రెడ్డి, కెఎస్చౌదరి, వెంకటరెడ్డి, శివారెడ్డి, వెంకటప్పనాయుడు, తలుపూరు , కలిచేడు ఎంపీటీసీ నక్కా ప్రమీలా, వెంకటసుబ్బరత్నమ్మ తదితరులు పాల్గొన్నారు. -
నేడు ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగుల సమ్మె
-
నేడు ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగుల సమ్మె
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు తమ డిమాండ్ల సాధనకోసం బుధవారం సమ్మె చేయనున్నారు. దీనితో ఈ బ్యాంకుల్లో చెక్కు క్లియరెన్స్ వంటి సాధారణ బ్యాంకింగ్ కార్యకలాపాలకు అంతరాయం కలగనుంది. వేతన సవరణసహా పలు డిమాండ్ల సాధనలో భాగంగా సమ్మె చేయాలని ఉద్యోగ సంఘాలు తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఉద్యోగులకు సమ్మె చేయడం మినహా గత్యంతరం లేకుండా పోయిందని యునెటైడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ (యూఎఫ్‌బీయూ) కన్వీనర్ ఎంవీ మురళి తెలిపారు. వేతన పెంపును 25 శాతం నుంచి 23 శాతానికి తగ్గించినా ఐబీఏ స్పందించలేదని అన్నారు. 11 శాతం పెంపుదల ప్రతిపాదన తమకు సమ్మతం కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దేశంలో మొత్తం 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. వీటి మొత్తానికి సంబంధించి దేశ వ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న 50,000 బ్రాంచీలలో ఉద్యోగుల సంఖ దాదాపు 8 లక్షలు. -
న్యూట్రిన్ ఫ్యాక్టరీ కార్మికులకు అండగా ఉంటా
చిత్తూరు(ఎడ్యుకేషన్): న్యూట్రిన్ ఫ్యాక్ట రీ కార్మికులకు తాను ఎల్లప్పుడూ అం డగా ఉంటానని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం చిత్తూరులో న్యూట్రిన్ కన్వెక్షనరీ వర్కర్స్ యూనియన్ (అఫ్లికేటెడ్ టూ వైఎస్సార్టీయూసీ) సర్వసభ్య స మావేశం జరిగింది. దీనికి విచ్చేసిన మి థున్‌రెడ్డి మాట్లాడుతూ కార్మికులు ఐ క్యంగా ఉంటనే కార్మికుల సమస్యలు ప రిష్కారం అవుతాయన్నారు. కార్మికుల విషయంలో రాజకీయాలు ఉండకూడదని, మేనేజ్మెంట్తో లాలూచీ పడకుం డా ఉండాలన్నారు. కార్మికుల సమస్య లు పరిష్కరించే విషయంలో మేనేజ్మెంట్ ఏమైనా తిరకాసు పెడితే నోటీ సు ఇచ్చేందుకు వెనకాడమన్నారు. కార్మికుల కోసం అసవరమైతే వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను తీసుకువచ్చి ధర్నా చేస్తామన్నారు. త్వరలో మేనేజ్మెంట్తో కొత్త అగ్రిమెంట్ చేస్తామని, ఈ విషయంలో కార్మికులంతా ఒకతాటిపై ఉం డాలన్నారు. వైఎస్సార్ సీపీ వాణిజ్య వి భాగం జిల్లా అధ్యక్షుడు బీరేంద్ర మాట్లాడుతూ యూనియన్‌కు ఇక నుంచి గౌరవాధ్యక్షుడిగా మిథున్‌రెడ్డి, అధ్యక్షుడిగా చిత్తూరు నియోజకవర్గ ఇన్చార్జి జే.శ్రీ నివాసులు వ్యవహరిస్తారన్నారు. వారి సారధ్యంలో కార్మికుల సమస్యలు పరి ష్కరించేందుకు ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. జే.శ్రీనివాసులు మా ట్లాడుతూ న్యూట్రిన్ ఫ్యాక్టరీ కార్మికులను అడ్డం పెట్టుకుని కొందరు కార్మిక నేతలు, రాజకీయ నేతలు లబ్ధిపొందారన్నారు. సుమారు రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఫ్యాక్టరీ ఎన్నికల్లో 30 సం వత్సరాల నుంచి ఆధిపత్యం చేస్తున్న వారికి డిపాజిట్లు కూడా దక్కలేదని, దీనికి మిథున్‌రెడ్డి చేసిన కృషే కారణమన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పీవీ గాయత్రీదేవి మాట్లాడుతూ మిథున్‌రెడ్డిది పక్క నియోజకవర్గమైనా ఎక్కడైనా తిరిగే స్వే చ్ఛ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చారన్నారు. న్యూట్రిన్ ఫ్యాక్టరీ కార్మికులు ఎదుర్కొనే సమస్యల్ని పరిష్కరించేందుకు ఆయన ఎ ప్పుడూ ముందున్నారన్నారు. ఈ సమావేశంలో వర్కర్స్ యూనియన్ నేతలు, న్యూట్రిన్ ఫ్యాక్టరీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వాలను సాగనంపుదాం
సాక్షి, హైదరాబాద్: కార్మికుల సమస్యలపై కనీస స్పందన లేని ఈ ప్రభుత్వాల్ని సాగనంపేందుకు సిద్ధం కావాలని కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని మండిపడ్డాయి. పది డిమాండ్ల పరిష్కారానికి దేశవ్యాప్తంగా తలపెట్టిన నిరసన ప్రదర్శనల్లో భాగంగా హైదరాబాద్‌లో వేలాది మంది కార్మికులు బుధవారం ప్రదర్శన నిర్వహించారు. ఏఐటీయూసీ, సీఐటీయూసీ, హెచ్ఎంఎస్, ఐఎన్టీయూసీ, టీఎన్టీయూసీ, బీఎంఎస్, ఏఐయూటీయూసీ, టీఆర్ఎస్కేవీ, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తదితర సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన కార్మికులు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్కు వరకు ప్రదర్శన నిర్వహించారు. ఎర్రజెండాలు, డప్పునృత్యాలు, కళాకారుల పాటలతో సాగిన ఈ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అనంతరం జరిగిన సభలో కార్మిక నేతలు జి.ఓబులేసు, సుధాభాస్కర్, నాయిని నరసింహారెడ్డి, ప్రకాశ్‌గౌడ్, రాంబాబు, సుధీర్, మారుతీరావ్ తదితరులు ప్రసంగించారు. కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలను సాగనంపి కార్మిక పక్షపాతుల్ని ఎన్నుకున్నప్పుడే తమ సమస్యలకు పరిష్కారమని వక్తలు చెప్పారు. దేశంలో తొలిసారి 48 గంటల పాటు పారిశ్రామిక సమ్మె జరిగినా కేంద్రం స్పందించలేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రయితే అసలు ఇంట్లో నుంచే రావడం లేదని, కార్మిక శాఖ మంత్రినంటున్న దానం నాగేందర్ లండన్‌లో షికారు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. విభజన, సమైక్యత పేరుతో కార్మిక సంఘాలు చీలిపోయి రాజకీయ అంశాలను నెత్తినపెట్టుకున్నాయని, అసలు, సిసలైన సంఘాలైతే కార్మికుల సంక్షేమంపై పోరాడాలని విజ్ఞప్తి చేశాయి. ఈ మూగ, చెవిటి ప్రభుత్వాల దుమ్ము దులిపేందుకు డిసెంబర్ 12న చలో పార్లమెంట్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. కనీస వేతనం రూ. 12,500కు పెంచాలని, రూ. 3 వేల పింఛన్ ఇవ్వాలని, కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థను రద్దు చేయాలని, కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్ నిబంధనలను సడలించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేశారు.