చిత్తూరు(ఎడ్యుకేషన్): న్యూట్రిన్ ఫ్యాక్ట రీ కార్మికులకు తాను ఎల్లప్పుడూ అం డగా ఉంటానని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం చిత్తూరులో న్యూట్రిన్ కన్వెక్షనరీ వర్కర్స్ యూనియన్ (అఫ్లికేటెడ్ టూ వైఎస్సార్‌టీయూసీ) సర్వసభ్య స మావేశం జరిగింది. దీనికి విచ్చేసిన మి థున్‌రెడ్డి మాట్లాడుతూ కార్మికులు ఐ క్యంగా ఉంటనే కార్మికుల సమస్యలు ప రిష్కారం అవుతాయన్నారు. కార్మికుల విషయంలో రాజకీయాలు ఉండకూడదని, మేనేజ్‌మెంట్‌తో లాలూచీ పడకుం డా ఉండాలన్నారు.
కార్మికుల సమస్య లు పరిష్కరించే విషయంలో మేనేజ్‌మెంట్ ఏమైనా తిరకాసు పెడితే నోటీ సు ఇచ్చేందుకు వెనకాడమన్నారు. కార్మికుల కోసం అసవరమైతే వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను తీసుకువచ్చి ధర్నా చేస్తామన్నారు. త్వరలో మేనేజ్‌మెంట్‌తో కొత్త అగ్రిమెంట్ చేస్తామని, ఈ విషయంలో కార్మికులంతా ఒకతాటిపై ఉం డాలన్నారు. వైఎస్సార్ సీపీ వాణిజ్య వి భాగం జిల్లా అధ్యక్షుడు బీరేంద్ర మాట్లాడుతూ యూనియన్‌కు ఇక నుంచి గౌరవాధ్యక్షుడిగా మిథున్‌రెడ్డి, అధ్యక్షుడిగా చిత్తూరు నియోజకవర్గ ఇన్‌చార్జి జే.శ్రీ నివాసులు వ్యవహరిస్తారన్నారు.
వారి సారధ్యంలో కార్మికుల సమస్యలు పరి ష్కరించేందుకు ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. జే.శ్రీనివాసులు మా ట్లాడుతూ న్యూట్రిన్ ఫ్యాక్టరీ కార్మికులను అడ్డం పెట్టుకుని కొందరు కార్మిక నేతలు, రాజకీయ నేతలు లబ్ధిపొందారన్నారు. సుమారు రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఫ్యాక్టరీ ఎన్నికల్లో 30 సం వత్సరాల నుంచి ఆధిపత్యం చేస్తున్న వారికి డిపాజిట్లు కూడా దక్కలేదని, దీనికి మిథున్‌రెడ్డి చేసిన కృషే కారణమన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పీవీ గాయత్రీదేవి మాట్లాడుతూ మిథున్‌రెడ్డిది పక్క నియోజకవర్గమైనా ఎక్కడైనా తిరిగే స్వే చ్ఛ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చారన్నారు. న్యూట్రిన్ ఫ్యాక్టరీ కార్మికులు ఎదుర్కొనే సమస్యల్ని పరిష్కరించేందుకు ఆయన ఎ ప్పుడూ ముందున్నారన్నారు. ఈ సమావేశంలో వర్కర్స్ యూనియన్ నేతలు, న్యూట్రిన్ ఫ్యాక్టరీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
న్యూట్రిన్ ఫ్యాక్టరీ కార్మికులకు అండగా ఉంటా
Published Mon, Sep 1 2014 4:19 AM | Last Updated on Sat, Sep 2 2017 12:41 PM
Advertisement
Advertisement