గల్ఫ్ కార్మికుల సమస్యలపై పోరు | Fighting on the problems of workers in the Gulf | Sakshi
Sakshi News home page

గల్ఫ్ కార్మికుల సమస్యలపై పోరు

Published Sun, Jun 14 2015 12:59 AM | Last Updated on Tue, Aug 21 2018 3:08 PM

గల్ఫ్ కార్మికుల సమస్యలపై పోరు - Sakshi

గల్ఫ్ కార్మికుల సమస్యలపై పోరు

బె హరాన్‌లో ప్రొఫెసర్ కోదండరాం

రాయికల్/సిరిసిల్ల : గల్ఫ్ దేశా ల్లో తెలంగాణ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి ఒత్తిడి తీసుకొస్తామని టీజేఏసీ చైర్మన్ కోదండరాం, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీ అన్నారు. బహ్రెరుున్‌లోని నవ తెలంగాణ సమాజం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో వీరు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో గల్ఫ్ కార్మికులను ఆదుకుంటామని ప్రకటించిన అధికార పార్టీ నేతలు ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నా రు.

గల్ఫ్ బాధితులకు సబ్సిడీ రుణాలు, ఉపాధి కల్పించేలా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. గల్ఫ్ బాధితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీరితోపాటు మల్లేపల్లి లక్ష్మయ్య ఉన్నా రు. వీరిని నవ తెలంగాణ సమాజం అధ్యక్షుడు దేవేం దర్‌తోపాటు సభ్యులు సన్మానించారు. వేడుకల్లో తెలంగాణ ఉద్యమ గీతాలు హోరెత్తించాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement