ఎన్‌డీఎస్‌ఎల్ సమస్యకు పరిష్కారం!
* నేడు మంత్రి కేటీఆర్‌తో కీలక సమావేశం
* మంత్రి పోచారం, ఎంపీ కవిత హాజరు
* ఫ్యాక్టరీల పునరుద్ధరణకే అవకాశం
* రైతులు, కార్మికుల సమస్యలపైనా చర్చ
* లేఆఫ్ ప్రకటించి సుమారు ఐదు నెలలు
* మూడు జిల్లాల్లో నిలిచిపోయిన ఫ్యాక్టరీలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్‌డీఎస్‌ఎ ల్) భవిష్యత్తు, కార్మికుల సమస్యలకు బుధవారం పరిష్కారం దొరికే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి కేటీఆర్ జిల్లా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కవిత, ఎమ్మెల్యే షకీల్ సమక్షంలో కార్మికులతో సమావేశం నిర్వహించనున్నారు. ఎన్‌డీఎస్‌ఎల్ యాజమాన్యం 2015-16 క్రషింగ్ సీజన్ నడుపకుండా చేతులెత్తేసిన విషయం తెలిసిం దే. చెరుకు, నీటి కొరత కారణంగా ఫ్యాక్టరీని నడుపలేమని 2015 డిసెంబర్ 23న లేఆఫ్ నోటీసు జారీ చేసి బోధన్‌తో పాటు ముత్యంపేట (కరీంనగర్) ముంబోజిపల్లి(మెదక్) ఫ్యాక్టరీలను మూసివేసింది.
సరిగ్గా అంతకు నెల రోజుల ముందు 2015 నవంబర్ 23న హైదరాబాద్‌లో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఈ మూడు ఫ్యాక్టరీల పరిధిలోని రైతులతో సమావేశం ని ర్వహించారు. చెరుకును ప్రైవేట్ ఫ్యాక్టరీలకు తరలిం చాలని నిర్ణయం తీసుకున్నారు. చెరుకును ప్రైవేట్ ఫ్యాక్టరీలకు రైతులు తరలించారు. బోధన్ ప్రాంతంలోని కొందరు రైతులు మహారాష్ట్ర ప్రాంత చక్కెర ఫ్యాక్టరీలకు తరలించారు.
కలకలం రేపిన లేఆఫ్ ప్రకటన..
2015 డిసెంబర్ 23న ఎన్‌డీఎస్‌ఎల్ యాజమాన్యం లేఆఫ్ ప్రకటించింది. నిజామాబాద్, కరీంనగర్, మెద క్ జిల్లాల్లోని బోధన్, ముత్యంపేట, ముంబోజిపల్లి ఫ్యాక్టరీలో 302 మంది కార్మికులు పని చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఫ్యాక్టరీ మూసివేతతో ఉపాధి కో ల్పోయారు.
ఎంపీ కవితో పాటు మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, నాయినీ నర్సింహా రెడ్డి, హరీశ్‌రావు, స్థానిక ఎమ్మెల్యే షకీల్‌లను తిరిగి ఫ్యాక్టరీని తెరిపించాలని పలుమార్లు రైతులు, కార్మికు లు కలిశారు. ఎంపీ కవిత చొరవతో 2016 జనవరి 11న ఫ్యాక్టరీ అధికారులు, కార్మిక సంఘాల నాయకులతో హైదరాబాద్‌లో లేఆఫ్ ఎత్తివేత, బకాయి వేతనాలు, ఉద్యోగ భద్రత సమస్యలపై చర్చలు జరిగా యి. చర్చలు అప్పుడు కొలిక్కి రాకపోగా... అదే నెల 18న రెండవ దఫా చర్చలు వాయిదా పడ్డాయి.
2016 మార్చి 16న మూడవ దఫా చర్చలు ఫలించలేదు. 2016 ఏప్రిల్ 2,11,26 తేదీల్లో చర్చలకు ఫ్యాక్టరీ అధికారులు హాజరుకాలేదు. దీంతో కార్మిక సంక్షేమ శాఖ అధికారులు చర్చల ప్రక్రియను ముగిస్తున్నట్టు స్పష్టం చేశారు. లేబర్ కోర్టులో కేసువేయాలని నిర్ణయానికి వచ్చారు.
లేఆఫ్ ఎత్తివేత, కార్మికుల బకాయి వేతనాల పై లేబర్ కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. లేఆఫ్ ఎత్తివేసి తిరిగి ఫ్యాక్టరీ తెరిపించాలని, బకాయి వేతనాలు చె ల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మికులు వివిధ రూపాల్లో ఆందోళనల నేపథ్యంలో నేడు జరిగే కీలక చర్చలపైన అందరూ దృష్టి సారించారు.
మంత్రి కేటీఆర్‌తో జరిగే చర్చలు కీలకం కానున్నాయని, సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంపీ కల్వకుంట్ల కవిత మంగళవారం నిజామాబాద్‌లో మీడియాతో వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎన్‌డీఎస్‌ఎల్ సమస్యకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.
కార్మికుల ప్రధాన సమస్యలు, డిమాండ్లు
* ఫ్యాక్టరీ లేఆఫ్ ఎత్తివేయాలి. తిరిగి ఫ్యాక్టరీ పునరుద్ధరించాలి.
* బకాయి వేతనాలు చెల్లించాలి. 2015 డిసెంబర్ 23 నుంచి ఇప్పటి వరకు సుమారు ఐదు నెలల నెలసరి వేతనాల చెల్లింపులు ఆగిపోయాయి. మూడు ఫ్యాక్టరీల పరిధిలో 302 మంది కార్మికు లు పని చేస్తున్నారు. వీరికి నెలకు రూ. 56 లక్షల వేతనాలు రావాల్సి ఉంది. ఐదు నెలల వేతనాలు మొత్తం రూ. 2 కోట్ల 80 లక్షలు చెల్లించాల్సి ఉం ది. బోధన్ ఫ్యాక్టరీలో 155 మంది, ముంబోజి పల్లి ఫ్యాక్టరీలో 140 మంది,ముత్యంపేటలో ఏ డుగురు పర్మినెంట్ కార్మికులు పని చేస్తున్నారు.
* లేఆఫ్‌తో ఫ్యాక్టరీ మూసివేతతో ఉపాధి కోల్పోయామని, ప్రత్యామ్నాయ మార్గాలు లేవని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఐదు నెలులగా వేతనాలు లేక కుటుంబ పోషణ భారంగా మా రిందని, అర్ధాకలితో కాలం వెళ్లదీస్తున్నామంటున్నారు.
* ఫ్యాక్టరీ భవిష్యత్తు తేల్చాలని, వచ్చే ఏడాదైనా ఫ్యాక్టరీని నడిపిస్తామని ప్రభుత్వం కచ్చితమైన భరోసా ఇవ్వాలని కోరుతున్నారు. ఫ్యాక్టరీ నడిపించే పరిస్థితి లేకపోతే ప్రత్యామ్నాయ మార్గం గా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దశాబ్దాలు గా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలి.
* మరో వైపు రైతులు చెరుకు పంట సాగు, ఫ్యాక్టరీ భవిష్యత్తుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరు తున్నారు. గతంలో చెరుకు పంటకు ఫ్యాక్టరీ యా జమాన్యం అగ్రిమెంట్ చేసుకునేది. గడిచిన సీజ న్‌లో ఫ్యాక్టరీ యాజమాన్యం అగ్రిమెంట్ చేసుకోలేదు. కాబట్టి ప్రభుత్వమే చొరవ చూపాలి. సమస్య పరిష్కరించాలి.
తేలనున్న భవితవ్యం
Published Wed, May 18 2016 2:35 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM
Advertisement