న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగుల యూనియన్ ఒక రోజు నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయా బ్యాంక్, దేనా బ్యాంకులను విలీనం చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మంగళవారంనాడు (అక్టోబరు 9న) దేశంలోని పలు ప్రధాన పట్టణాలు, రాష్ట్ర రాజధానులలో నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్లు అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రెటరీ వెంకటాచలం వెల్లడించారు. గత నెల 29న జరిగిన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అక్టోబరు 12న మళ్లీ ముంబైలో సమావేశంకానున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment