
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూన్ 20న భేటీ కానున్నారు. బ్యాంకుల పనితీరు, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కోసం ప్రభుత్వం ప్రారంభించిన వివిధ పథకాలపై వారు సాధించిన పురోగతిని మంత్రి సమీక్షించనున్నారు. 2022–23 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఇదే మొదటి సమీక్ష సమావేశం. 2021–22లో ఈ 12 బ్యాంకులు తమ నికర లాభాన్ని రెండింతలు కంటే అధికంగా రూ.66,539 కోట్లకు పెంచుకున్నాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో సహా ఎదురుగాలులను ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణను వేగవంతం చేసేందుకు ఉత్పాదక రంగాలకు రుణాలు మంజూరు చేయాలని బ్యాంకులను మంత్రి కోరే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment