న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) చీఫ్‌లతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం (జూలై 6) సమావేశం కానున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 12 బ్యాంకుల ఆర్థిక పనితీరు, ప్రభుత్వ పథకాల అమల్లో భాగస్వామ్యం ఈ సమావేశంలో సమీక్షించనున్నట్లు సమాచారం.
2022–23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో ప్రారంభమైన తర్వాత బ్యాంకింగ్‌లో ఈ తరహా సమావేశం జరగడం ఇదే తొలిసారి. గత ఆర్థిక సంవత్సరం మొత్తం ప్రభుత్వ బ్యాంకుల లాభం రూ.1,04,649 కోట్లు. దీనిలో దాదాపు సగం వాటాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సొంతం చేసుకుంది. 2017–18లో రూ.85,390 కోట్ల నికర నష్టం నుంచి బ్యాంకింగ్ గణనీయంగా మెరుగుపడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment