
న్యూఢిల్లీ: వ్యవసాయం, లఘు చిన్న మధ్య తరహా పరిశ్రమల పురోగతికి తీసుకోవాల్సిన చర్యలపై ఆర్థికమంత్రి పియుష్ గోయెల్ దృష్టి సారించారు. ఈ అంశంపై ఆయన ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లతో సమావేశమయ్యారు. ఆయా రంగాలకు రుణాల లభ్యత మెరుగుపడేందుకు చర్యలు అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన మద్దతుసహా అవసరమైన సహకారాన్ని అందిం చడానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు.
మున్ముందు రోజుల్లో ప్రభుత్వ బ్యాంకులు మరింత క్రియాశీలంగా, లాభదాయకంగా రూపొందుతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వ్యవసాయం, లఘు చిన్న మధ్య తరహా పరిశ్రమలతో పాటు గృహ రుణాలపై కూడా చర్చ జరిగినట్లు సమావేశం అనంతరం మంత్రి విలేకరులకు తెలిపారు.