
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో కుదేలైన ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపేందుకు బ్యాంకులు భారీగా రుణాలను మంజూరు చేశాయి. ఈ ఏడాది మార్చి-మేలో ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) రూ 6.45 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మార్చి 1 నుంచి మే 15 వరకూ పీఎస్‌బీలు రూ 6.45 లక్షల కోట్ల రుణాలను ఎంఎస్‌ఎంఈ, రిటైల్, వ్యవసాయ, కార్పొరేట్ రంగాలకు చెందిన 54.96 లక్షల ఖాతాలకు మంజూరు చేశాయని తెలిపింది.
ఇకమార్చి 20 నుంచి మే 15 వరకూ పీఎస్‌బీలు రూ 1.03 లక్షల కోట్ల మేర తక్షణ రుణాలు, వర్కింగ్ కేపిటల్ రుణాలను పీఎస్‌బీలు సమకూర్చాయని పేర్కొంది. కరోనా కట్టడికి మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోఉన్న లాక్‌డౌన్ ఇటీవల ప్రకటించిన భారీ సడలింపులతో ఈనెల 31 వరకూ కొనసాగనున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment