న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ(పీఎస్‌యూ) బ్యాంకుల అధిపతులతో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ నెల 12న సమావేశం కానున్నారు. ప్రధానంగా బ్యాంకుల వార్షిక పనితీరు, మొండిబకాయిల పరిస్థితిపై ఈ భేటీలో చర్చించనున్నారు. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) తాజా పాలసీ సమీక్షలో రెపో రేటును పావు శాతం తగ్గించిన నేపథ్యంలో బ్యాంకులు కూడా వృద్ధికి ఊతమిచ్చేవిధంగా రుణ రేట్ల కోతపై దృష్టిపెట్టాలని కూడా ఆయన దిశానిర్దేశం చేసే అవకాశాలున్నాయి.
ఇప్పటికే పలు బ్యాంకులు బేస్ రేటును తగ్గించగా, మరికొన్ని ఈ బాటలోనే ఉన్నాయి. పీఎస్‌యూ బ్యాంకులతో పాటు నాబార్డ్, ఎన్‌హెచ్‌బీ తదితర ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల చీఫ్‌లు కూడా ఈ భేటీలో పాల్గొననున్నారు. కాగా, జన ధన యోజన, ప్రధాన మంత్రి సామాజిక భద్రత పథకాల పురోగతి, రుణ వృద్ధి వంటి అంశాలను కూడా సమావేశంలో సమీక్షించనున్నారు.
పీఎస్‌యూ బ్యాంక్ చీఫ్‌లతో 12న జైట్లీ భేటీ
Published Mon, Jun 8 2015 12:38 AM | Last Updated on Mon, Aug 20 2018 4:55 PM
Advertisement