ఏడు ప్రభుత్వ బ్యాంకులకు కొత్త సారథులు | Govt appoints MDs, CEOs of seven public sector banks | Sakshi
Sakshi News home page

ఏడు ప్రభుత్వ బ్యాంకులకు కొత్త సారథులు

Published Fri, May 5 2017 11:56 PM | Last Updated on Tue, Sep 5 2017 10:28 AM

ఏడు ప్రభుత్వ బ్యాంకులకు కొత్త సారథులు

ఏడు ప్రభుత్వ బ్యాంకులకు కొత్త సారథులు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా ఏడు ప్రభుత్వ రంగ బ్యాంకులకు కొత్తగా మేనేజింగ్‌ డైరెక్టర్లను, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లను నియమించింది. క్యాబినెట్‌ నియామకాల కమిటీ ఈ నియామకాలకు ఆమోదం తెలిపింది. వివరాలు...

►  ఓరియెంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్న రాజ్‌కిరణ్‌ రాయ్‌ తాజాగా యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు. ఈయన పదవీకాలం మూడేళ్లు.
► కార్పొరేషన్‌ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్న సునీల్‌ మెహతా తాజాగా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు.
► పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈవోగా ఉన్న ఉషా అనంత సుబ్రమణియన్‌ తాజాగా అలహాబాద్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు. ఈమె 2018, ఆగస్ట్‌ 31 వరకు పదవిలో కొనసాగనున్నారు.
►  ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్న సుబ్రమణియ కుమార్‌ అదే బ్యాంక్‌ ఎండీ, సీఈవోగా 2019 జూన్‌ 30 వరకూ పదవిలో కొనసాగనున్నారు.
► కెనరా బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్న దీనబంధు మొహపత్ర ఇకపై బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొత్త ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపడతారు.
► సిండికేట్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈవోగా ఎం.ఒ.రెగో నియమితులయ్యారు. ఈయన ఇప్పటిదాకా బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌గా ఉన్నారు.
► ప్రస్తుతం బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్న ఆర్‌.ఎ.శంకర నారాయణన్‌ తాజాగా విజయా బ్యాంక్‌ ఎండీ, సీఈవోగా వ్యవహరించనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement