Cheque gift
-
కేంద్రానికి బ్యాంకుల భారీ డివిడెండ్ @ రూ. 6,481 కోట్లు
న్యూఢిల్లీ: నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులు కేంద్ర ప్రభుత్వానికి భారీ డివిడెండ్‌ను చెల్లించాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు చెక్ రూపేణా మొత్తం రూ. 6,481 కోట్లు అందించాయి. గత ఆర్థిక సంవత్సరానికి (2023–24)గాను ప్రభుత్వానికి ఉమ్మడిగా డివిడెండ్‌ను చెల్లించాయి. దీనిలో బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 2,514 కోట్లు, కెనరా బ్యాంక్ రూ. 1,838 కోట్లు, ఇండియన్ బ్యాంక్ రూ. 1,193.5 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 935.5 కోట్లు చొప్పున డివిడెండ్‌ను అందించాయి. అంతేకాకుండా వీటికి జతగా ఎగ్జిమ్ బ్యాంక్ సైతం రూ. 252 కోట్ల డివిడెండ్ చెక్‌ను ప్రభుత్వానికి అందజేసింది. -
పలు కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ
తల్లాడ: మండలంలోని కలకొడిమ, కుర్నవల్లి గ్రామాల్లో పలు కుటుంబాలను బుధవారం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బుధవారం పరామర్శించారు. కలకొడిమ గ్రామానికి చెందిన నరుకుల్ల వెంకటేశ్వరరావు కుటుంబానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా రూ.2 లక్షల చెక్కును వెంకటేశ్వరరావు భార్య బేబికు ఎమ్మెల్యే అందజేశారు. కుర్నవల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఎక్కిరాల పుల్లయ్య దశదిన కర్మ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అయిలూరి సత్యనారాయణరెడ్డి, రామక్రిష్ణారెడ్డి శస్త్ర చిక్సిత చేయించుకోగా వారిని పరామర్శించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు దూపాటి భద్రరాజు, కేతినేని చలపతి, అన్నెం కోటిరెడ్డి, గుండ్ల నాగయ్య, యల్లంకి వెంకటేశ్వర్లు, రావూరి రవిప్రసాద్, దగ్గుల శ్రీనివాసరెడ్డి, దిరిశాల నరసింహారావు, ఉప్పెర్ల రామారావు, వడ్డే నాగేశ్వరరావు, పగడాల నాగార్జునరెడ్డి, ఆదూరి శ్రీను పాల్గొన్నారు. -
పెళ్లి రోజే ‘లక్ష్మీ’ కటాక్షం
జగదేవ్‌పూర్(గజ్వేల్): అసెంబ్లీ సమావేశాల్లో కళ్యాణ లక్ష్మి పథకం కానుక రూ75 వేల నుంచి రూ.1,00,116 పెంచుతున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. పెళ్లి రోజే చెక్కును అందిస్తామని చెప్పారు. పెంచింది ఆలస్యమే లేదు అమలు చేశారు. ముందుగా సీఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో బుధవారం జరిగినా పెళ్లిలో కళ్యాణలక్ష్మి చెక్కును ఆర్డీసీ చైర్మన్ నర్సారెడ్డి, గఢా అధికారి హన్మంతరావులు వ« దువు కుటుంబానికి అందించి లాంఛనం గా ప్రారంభించారు. ఎర్రవల్లి గ్రామానికి చెందిన చెవేళ్ల చంద్రయ్య, పోచమ్మ దంపతుల కూతురు అశ్వినికి ఇటీవల యాదాద్రి జిల్లా రాజాపేట మండలం పారుపల్లి గ్రామానికి చెందిన శేఖర్‌తో నిశ్చితార్థం జరిగింది. ఈ సందర్భంగా వారు కల్యాణలక్ష్మి కి దరఖాస్తు చేసుకున్నారు. బుధవారం స్వయంగా ఎర్రవల్లి ఫంక్షన్హాల్లో పెళ్లి జరుగుతున్న క్రమంలోనే గఢా అధికారి హన్మంతరావు, ఆర్డీసీ చైర్మన్ తూంకుంట నర్సారెడ్డిలు పెళ్లి హాజరై కళ్యాణ లక్ష్మి ప థకం మంజూరైన రూ.1,00,116 చెక్కు ను వధువు తల్లి పోచమ్మ పేరు మీద అం దించి లాంఛనంగా పథకాన్ని ప్రారంభిం చారు. దేశంలోనే నంబర్‌వన్.. పేదోళ్లను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి పథకానికి శ్రీకారం చు ట్టారని, ఇటివల్లనే రూ.75 వేల నుంచి రూ.1,00,116 పెంచారని, ఇది పేదోళ్లకు వరమని ఆర్డీసీ చైర్మన్ నర్సారెడ్డి, గఢా అ ధికారి హన్మంతరావులు అన్నారు. ఎర్రవల్లిలో కళ్యాణలక్ష్మి చెక్కును అందించారు. అశ్విని ఆనందం... ఇన్నాళ్లు కళ్యాణలక్ష్మి పథకం చెక్కు అందలాంటే పెళ్లి అయి నెలలు గడిచిన రాలేని పరిస్థితి ఉండేవి. ప్రస్తుతం అలాంటి కష్టాలకు అశ్విని లగ్గంతోనే చెక్ పడింది. పెళ్లి రోజు కళ్యాణలక్ష్మి చెక్కును అందించడంతో అశ్విని ఆనందంతో మురిసిపోయింది. కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భాగ్యబాల్‌రాజ్, జెడ్పీటీసీ రాంచంద్రం, ఎంపీటీసీ భాగ్యమ్మ, వీడీసీ అధ్యక్షులు కిష్టారెడ్డి, టీఆర్ఎస్ జిల్లా పరిశీలకుడు పన్యాల భూపతిరెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా మాజీ అధ్యక్షుడు మదాసు శ్రీనివాస్, జగదేవ్‌పూర్ మండలాధ్యక్షుడు గుండా రంగారెడ్డి, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
పెళ్లికి కానుకగా చెక్కు!
పెద్దపల్లి: పెద్ద నోట్ల రద్దు ప్రభావం పెళ్లిళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. వధువరుల తల్లిదండ్రులు పెళ్లి ఖర్చులకు డబ్బుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే....పెళ్లికి విచ్చేసిన అతిథుల ఇబ్బందులు మరో రకంగా ఉన్నాయి. శుభకార్యానికి హాజరైతే తప్పనిసరిగా కానుక ఇస్తుంటాం. ప్రస్తుతం నోట్ల రద్దుకు తోడు నెల ప్రారంభసమయం కావడంతో చిన్నపాటి ఖర్చులకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తోంది. తాజాగా పెద్దపల్లిలోని బంధువుల ఇంట్లో జరిగిన పెళ్లికి హాజరైన కమాన్‌పూర్ మార్కెట్ కమిటీ సెక్రటరీ ఈర్ల సురేందర్‌కు ఇదే పరిస్థితి ఎదురైంది. పెళ్లి కూతురు సుహాసినికి కానుకగా నగదు ఇవ్వడానికి తన దగ్గర లేకపోవడంతో రూ.5వేల చెక్కును అందజేశారు. ఒకటిన జీతం తీసుకునేందుకు పెద్దపల్లి బ్యాంకుకు వెళ్లాడు. క్యూలైన్ పొడవుగా ఉండడంతో, ఆయన వెంటనే చెక్ తెప్పించి కానుక ఇచ్చారు.