చెక్కుతో నూతన వధూవరులు
జగదేవ్‌పూర్(గజ్వేల్): అసెంబ్లీ సమావేశాల్లో కళ్యాణ లక్ష్మి పథకం కానుక రూ75 వేల నుంచి రూ.1,00,116 పెంచుతున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. పెళ్లి రోజే చెక్కును అందిస్తామని చెప్పారు. పెంచింది ఆలస్యమే లేదు అమలు చేశారు.
ముందుగా సీఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో బుధవారం జరిగినా పెళ్లిలో కళ్యాణలక్ష్మి చెక్కును ఆర్డీసీ చైర్మన్ నర్సారెడ్డి, గఢా అధికారి హన్మంతరావులు వ« దువు కుటుంబానికి అందించి లాంఛనం గా ప్రారంభించారు.
ఎర్రవల్లి గ్రామానికి చెందిన చెవేళ్ల చంద్రయ్య, పోచమ్మ దంపతుల కూతురు అశ్వినికి ఇటీవల యాదాద్రి జిల్లా రాజాపేట మండలం పారుపల్లి గ్రామానికి చెందిన శేఖర్‌తో నిశ్చితార్థం జరిగింది. ఈ సందర్భంగా వారు కల్యాణలక్ష్మి కి దరఖాస్తు చేసుకున్నారు.
బుధవారం స్వయంగా ఎర్రవల్లి ఫంక్షన్‌హాల్‌లో పెళ్లి జరుగుతున్న క్రమంలోనే గఢా అధికారి హన్మంతరావు, ఆర్డీసీ చైర్మన్ తూంకుంట నర్సారెడ్డిలు పెళ్లి హాజరై కళ్యాణ లక్ష్మి ప థకం మంజూరైన రూ.1,00,116 చెక్కు ను వధువు తల్లి పోచమ్మ పేరు మీద అం దించి లాంఛనంగా పథకాన్ని ప్రారంభిం చారు.
దేశంలోనే నంబర్‌వన్..
పేదోళ్లను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి పథకానికి శ్రీకారం చు ట్టారని, ఇటివల్లనే రూ.75 వేల నుంచి రూ.1,00,116 పెంచారని, ఇది పేదోళ్లకు వరమని ఆర్డీసీ చైర్మన్ నర్సారెడ్డి, గఢా అ ధికారి హన్మంతరావులు అన్నారు. ఎర్రవల్లిలో కళ్యాణలక్ష్మి చెక్కును అందించారు.
అశ్విని ఆనందం...
ఇన్నాళ్లు కళ్యాణలక్ష్మి పథకం చెక్కు అందలాంటే పెళ్లి అయి నెలలు గడిచిన రాలేని పరిస్థితి ఉండేవి. ప్రస్తుతం అలాంటి కష్టాలకు అశ్విని లగ్గంతోనే చెక్ పడింది. పెళ్లి రోజు కళ్యాణలక్ష్మి చెక్కును అందించడంతో అశ్విని ఆనందంతో మురిసిపోయింది. కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భాగ్యబాల్‌రాజ్, జెడ్పీటీసీ రాంచంద్రం, ఎంపీటీసీ భాగ్యమ్మ, వీడీసీ అధ్యక్షులు కిష్టారెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా పరిశీలకుడు పన్యాల భూపతిరెడ్డి, టీఆర్‌ఎస్వీ జిల్లా మాజీ అధ్యక్షుడు మదాసు శ్రీనివాస్, జగదేవ్‌పూర్ మండలాధ్యక్షుడు గుండా రంగారెడ్డి, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment