one lakh cash
-
పెళ్లి రోజే ‘లక్ష్మీ’ కటాక్షం
జగదేవ్‌పూర్(గజ్వేల్): అసెంబ్లీ సమావేశాల్లో కళ్యాణ లక్ష్మి పథకం కానుక రూ75 వేల నుంచి రూ.1,00,116 పెంచుతున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. పెళ్లి రోజే చెక్కును అందిస్తామని చెప్పారు. పెంచింది ఆలస్యమే లేదు అమలు చేశారు. ముందుగా సీఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో బుధవారం జరిగినా పెళ్లిలో కళ్యాణలక్ష్మి చెక్కును ఆర్డీసీ చైర్మన్ నర్సారెడ్డి, గఢా అధికారి హన్మంతరావులు వ« దువు కుటుంబానికి అందించి లాంఛనం గా ప్రారంభించారు. ఎర్రవల్లి గ్రామానికి చెందిన చెవేళ్ల చంద్రయ్య, పోచమ్మ దంపతుల కూతురు అశ్వినికి ఇటీవల యాదాద్రి జిల్లా రాజాపేట మండలం పారుపల్లి గ్రామానికి చెందిన శేఖర్‌తో నిశ్చితార్థం జరిగింది. ఈ సందర్భంగా వారు కల్యాణలక్ష్మి కి దరఖాస్తు చేసుకున్నారు. బుధవారం స్వయంగా ఎర్రవల్లి ఫంక్షన్హాల్లో పెళ్లి జరుగుతున్న క్రమంలోనే గఢా అధికారి హన్మంతరావు, ఆర్డీసీ చైర్మన్ తూంకుంట నర్సారెడ్డిలు పెళ్లి హాజరై కళ్యాణ లక్ష్మి ప థకం మంజూరైన రూ.1,00,116 చెక్కు ను వధువు తల్లి పోచమ్మ పేరు మీద అం దించి లాంఛనంగా పథకాన్ని ప్రారంభిం చారు. దేశంలోనే నంబర్‌వన్.. పేదోళ్లను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి పథకానికి శ్రీకారం చు ట్టారని, ఇటివల్లనే రూ.75 వేల నుంచి రూ.1,00,116 పెంచారని, ఇది పేదోళ్లకు వరమని ఆర్డీసీ చైర్మన్ నర్సారెడ్డి, గఢా అ ధికారి హన్మంతరావులు అన్నారు. ఎర్రవల్లిలో కళ్యాణలక్ష్మి చెక్కును అందించారు. అశ్విని ఆనందం... ఇన్నాళ్లు కళ్యాణలక్ష్మి పథకం చెక్కు అందలాంటే పెళ్లి అయి నెలలు గడిచిన రాలేని పరిస్థితి ఉండేవి. ప్రస్తుతం అలాంటి కష్టాలకు అశ్విని లగ్గంతోనే చెక్ పడింది. పెళ్లి రోజు కళ్యాణలక్ష్మి చెక్కును అందించడంతో అశ్విని ఆనందంతో మురిసిపోయింది. కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భాగ్యబాల్‌రాజ్, జెడ్పీటీసీ రాంచంద్రం, ఎంపీటీసీ భాగ్యమ్మ, వీడీసీ అధ్యక్షులు కిష్టారెడ్డి, టీఆర్ఎస్ జిల్లా పరిశీలకుడు పన్యాల భూపతిరెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా మాజీ అధ్యక్షుడు మదాసు శ్రీనివాస్, జగదేవ్‌పూర్ మండలాధ్యక్షుడు గుండా రంగారెడ్డి, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
లక్షకు అర లక్ష వడ్డీ..!
– కంతులన్నీ చెల్లించినా రికార్డులు ఇవ్వని ఫైనాన్స్ వ్యాపారి – అదనపు వడ్డీ చెల్లించకపోతే ఇచ్చేది లేదని హుకుం – బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు కదిరి : లక్ష రూపాయలకు అర లక్ష వడ్డీ బహుశా ఎక్కడా ఉండదేమే. కాని కదిరిలో ఉంది. వరుస కరువులతో ఈ ప్రాంత రైతులు అల్లాడిపోతుంటే ఆ కరువునే కొందరు ఫైనాన్స్ వ్యాపారులు 'క్యాష్' చేసుకుంటున్నారు. ఓ రైతు జీవనోపాధికోసం కదిరిలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో రూ.1 లక్ష రుణం తీసుకుంటే చివరకు అర లక్షకు పైగా వడ్డీ చెల్లిస్తే గానీ ఆ ట్రాక్టర్‌కు సంబంధించిన రికార్డులు ఇచ్చేది లేదని రెండు నెలలుగా తిప్పుకుంటున్నాడు. విసిగిపోయిన రైతు బుధవారం కదిరి పట్టణ పోలీసులను ఆశ్రయించారు. బాధితుడు పోలీసులకిచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. ఓడి చెరువు మండలం దాదిరెడ్డిపల్లికి చెందిన రైతు ఎద్దుల హనుమంతురెడ్డి 2015 ఏప్రిల్ 28న కదిరిలోని లక్ష్మి వినాయక ఆటోఫైనాన్స్ కంపెనీలో ట్రాక్టర్ కోసం రూ.1 లక్ష రుణం తీసుకున్నాడు. అయితే అగ్రిమెంట్లు, ఇతరత్రా అంటూ రూ. 6 వేలు కోత వేసి ఆ రైతుకు చేతికి కేవలం రూ.94 వేలు మాత్రం ఇచ్చారు. మొదటి కంతు రూ.11 వేలు, మిగిలిన 14 కంతులు నెలకు రూ.8,500 చొప్పున మొత్తం రూ1.30 లక్షలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈమేరకు హనుమంతరెడ్డి ప్రతి నెలా కంతులు సకాలంలో చెల్లించుకుంటూ వచ్చారు. అయితే చివరి కంతు 2016 జూలై 28న చెల్లించాల్సి ఉండగా ఆ రైతుకు డబ్బు అందుబాటు కాక అక్టోబర్ నెలాఖరులో చెల్లించి, ఇక అప్పు లేదనుకున్నారు. 'మీ అప్పు తీర్చేశాను. మీ దగ్గర పెట్టుకున్న నా ట్రాక్టర్‌కు సంబంధించిన రికార్డులు ఇవ్వండి' అని అడిగితే మీరు కంతులు ఆలస్యంగా చెల్లించినందుకు అదనపు వడ్డీ ఇంకా రూ.21,300 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆ డబ్బు ఇస్తేగానీ రికార్డులు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. తిరిగి తిరిగి విసిగి వేసారి పోయిన ఆ రైతు ఆఖరు ప్రయత్నంగా బుధవారం మళ్లీ వెళ్లి అడిగాడు. కానీ ఈసారి ఆ రైతుకు చేదు అనుభవం ఎదురైంది. 'రేయ్ నీకు ఎన్నిసార్లు చెప్పాలి. ట్రాక్టర్‌కు కట్టేసి ఊరంతా తిప్పుతా. ప్రాణాలతో ఉండాలంటే ఆ రూ.21,300 చెల్లించి తీసుకెళ్లు. లేదంటే ప్రాణాలు గాలిలో కలిసిపోతాయ్..' అని బెదిరించడంతో ఆ రైతు భయపడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పట్టణ ఎస్ఐ గోపాలుడు కేసు విచారిస్తున్నారు. దీనిపై 'సాక్షి' ఆ ఫైనాన్స్ సంస్థలో కెళ్లి వివరణ అడిగితే మిగతా ఫైనాన్స్ కంపెనీల్లో వడ్డీ ఎంతో తెలుసా మీకు అని ప్రశ్నించారు. కంతులు సకాలంలో చెల్లించకపోతే అదనవడ్డీ వసూలు చేస్తాం'అన్నారు. నూటికి వడ్డీ ఎంత తీసుకుంటున్నారని అడిగితే అవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు.