బాధిత కుటుంబానికి చెక్కు అందిస్తున్న ఎమ్మెల్యే సండ్ర
తల్లాడ: మండలంలోని కలకొడిమ, కుర్నవల్లి గ్రామాల్లో పలు కుటుంబాలను బుధవారం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బుధవారం పరామర్శించారు. కలకొడిమ గ్రామానికి చెందిన నరుకుల్ల వెంకటేశ్వరరావు కుటుంబానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా రూ.2 లక్షల చెక్కును వెంకటేశ్వరరావు భార్య బేబికు ఎమ్మెల్యే అందజేశారు.
కుర్నవల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఎక్కిరాల పుల్లయ్య దశదిన కర్మ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అయిలూరి సత్యనారాయణరెడ్డి, రామక్రిష్ణారెడ్డి శస్త్ర చిక్సిత చేయించుకోగా వారిని పరామర్శించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు దూపాటి భద్రరాజు, కేతినేని చలపతి, అన్నెం కోటిరెడ్డి, గుండ్ల నాగయ్య, యల్లంకి వెంకటేశ్వర్లు, రావూరి రవిప్రసాద్, దగ్గుల శ్రీనివాసరెడ్డి, దిరిశాల నరసింహారావు, ఉప్పెర్ల రామారావు, వడ్డే నాగేశ్వరరావు, పగడాల నాగార్జునరెడ్డి, ఆదూరి శ్రీను పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment