MLA Sandra Venkata Veeraiah
-
పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే సండ్ర హల్చల్
సత్తుపల్లి: ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, స్థానిక పోలీస్ స్టేషన్లో శుక్రవారం హల్చల్ చేశారు. ఓ కేసుకు సంబంధించి కొందరిని ఎస్సై నరేష్‌బాబు అదుపులోకి తీసుకున్నారు. వారిలో అధికార పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారు. అధికార పార్టీ వారిని వదిలిపెట్టారు. ఎమ్మెల్యే అనుచరులను మాత్రం స్టేషన్లోనే ఉంచారు. వారు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఫోన్ చేసి చెప్పారు. ‘‘ఎస్సైకి ఫోన్ ఇవ్వండి’’ అని ఎమ్మెల్యే అన్నారు. ఎమ్మెల్యే సండ్ర, లైన్లో ఉన్నారంటూ ఫోన్‌ను ఎస్సైకి ఆ అనుచరులు ఇవ్వబోయారు. ఎస్సై తీసుకోలేదు. ఇదే విషయాన్ని సండ్రకు అనుచరులు చెప్పారు. దీంతో ఆగ్రహోదగ్రుడైన సండ్ర వెంకటవీరయ్య, వెంటనే సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. లారీ యూనియన్ కార్యాలయం వద్ద ఆందోళన జరుగుతున్నదన్న సమాచారంతో అప్పటికే అక్కడకు ఎస్సై వెళ్లిపోయారు. పోలీస్ స్టేషన్లో ఎస్సై లేకపోవడంతో ఆయన సెల్‌కు సండ్ర ఫోన్ చేశారు. ఎత్తకపోవడంతో తీవ్ర స్థాయిలో ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. ‘‘ఈ స్టేషన్ వ్యవహారాలు చూసేది ఎస్సైనా? అధికార పార్టీ కార్యకర్తలా? ఎమ్మెల్యే ఫోన్‌కు ఎస్సై స్పందించకపోతే ఎలా..? దళిత ఎమ్మెల్యే అంటే అంత చులకనా..?’’ అంటూ, అక్కడున్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘పూచీకత్తుపై అధికార పార్టీ వారిని పంపిస్తారు. మా వాళ్లను మాత్రం పంపించకుండా నిర్బంధిస్తారా..?’’ అంటూ మండిపడ్డారు. దీనిపై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. పోలీస్ స్టేషన్ నుంచే కల్లూరు ఏసీపీ బల్లా రాజేష్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. అసలు విషయం ఏమిటంటే... సత్తుపల్లి మండలం సదాశివునిపాలెంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరిలో నలుగురిని అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు పోలీస్ స్టేషన్ నుంచి విడిపించుకుని వెళ్లారు. టీడీపీ సానుభూతిపరులైన ఇద్దరిని పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. ఇది, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు కోపం తెప్పించింది. ఆయన తన అనుచరులతో స్టేషన్‌కు వచ్చారు. ఫోన్ సిగ్నల్స్ లేవు.. దీనిపై ఎస్సై నరేష్‌బాబును ‘సాక్షి’ వివరణ కోరింది. ‘‘లారీ యూనియన్ కార్యాలయం వద్ద రాస్తారోకో జరుగుతున్నదని తెలియడంతో నేను అక్కడకు వెళ్లాను. అక్కడ సెల్ సిగ్నల్స్ లేకపోవటంతో నాకు ఎటువంటి ఫోన్ రాలేదు’’ అని చెప్పారు. -
ధాన్యం రవాణా వేగవంతం చేయాలి
సత్తుపల్లిటౌన్ : జిల్లాలో మార్కెఫెడ్, సివిల్ సప్లయ్ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, మక్కల రవాణాను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రభుత్వాన్ని కోరారు. సత్తుపల్లి మార్కెట్ యార్డులోని మార్క్‌ఫెడ్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించిన సందర్భంగా మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో 20 రోజుల నుంచి రైతులు పడిగాపులు పడుతున్నారని.. ఈ విషయాన్ని కలెక్టర్‌తోపాటు మార్క్‌ఫెడ్, సివిల్ సప్లైయ్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. వాతావరణం బాగాలేనందున అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. జిల్లాలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లేకపోవటం, ఇన్చార్జ్ కలెక్టర్‌కు అవగాహన లేనందున అధికార యంత్రాంగం ఉదాసీన వైఖరి అవలంభిస్తున్నారన్నారు. మిర్చి, మామిడి పంటలు కూడా అకాల వర్షానికి దెబ్బతిన్నాయని, వీరిని ప్రభుత్వ ఆదుకోవాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో రైతాంగానికి తాగునీరు, టెంట్, విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో రామ్మోహన్, కూసంపూడి మహేష్, దూదిపాల రాంబాబు, వెలిశాల లక్ష్మాచారి, అద్దంకి అనిల్, చక్రవర్తి, పుచ్చా వెంకటేశ్వరరావు, వెంకటరెడ్డి, శ్రీనివాసరెడ్డి, కురిటి రాఘవులు, వినోద్, చంటి, మోటపోతుల నాగేశ్వరరావు, షట్రక్, నాని పాల్గొన్నారు. -
పలు కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ
తల్లాడ: మండలంలోని కలకొడిమ, కుర్నవల్లి గ్రామాల్లో పలు కుటుంబాలను బుధవారం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బుధవారం పరామర్శించారు. కలకొడిమ గ్రామానికి చెందిన నరుకుల్ల వెంకటేశ్వరరావు కుటుంబానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా రూ.2 లక్షల చెక్కును వెంకటేశ్వరరావు భార్య బేబికు ఎమ్మెల్యే అందజేశారు. కుర్నవల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఎక్కిరాల పుల్లయ్య దశదిన కర్మ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అయిలూరి సత్యనారాయణరెడ్డి, రామక్రిష్ణారెడ్డి శస్త్ర చిక్సిత చేయించుకోగా వారిని పరామర్శించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు దూపాటి భద్రరాజు, కేతినేని చలపతి, అన్నెం కోటిరెడ్డి, గుండ్ల నాగయ్య, యల్లంకి వెంకటేశ్వర్లు, రావూరి రవిప్రసాద్, దగ్గుల శ్రీనివాసరెడ్డి, దిరిశాల నరసింహారావు, ఉప్పెర్ల రామారావు, వడ్డే నాగేశ్వరరావు, పగడాల నాగార్జునరెడ్డి, ఆదూరి శ్రీను పాల్గొన్నారు. -
సండ్రకు షరతులతో బెయిల్
పాస్‌పోర్టు అప్పగించాలని, నియోజకవర్గం వదిలి వెళ్లకూడదని ఆదేశం హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ ప్రత్యేక కోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. రూ.2 లక్షల చొప్పున రెండు పూచీకత్తులను సమర్పించాలని ఆదేశించింది. పాస్‌పోర్టును కోర్టుకు అప్పగించాలని, నియోజకవర్గం వదిలి వెళ్లకూడదని షరతులు విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి లక్ష్మీపతి ఉత్తర్వులు జారీచేశారు. ఏసీబీ దర్యాప్తులో జోక్యం చేసుకోరాదని, ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు. ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటా: సండ్ర టీఆర్ఎస్ ప్రభుత్వం తనపై పన్నిన కుట్ర రాజకీయాలపై న్యాయపరంగా పోరాడి ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటానని సండ్ర వెంకట వీరయ్య వ్యాఖ్యానించారు. బెయిల్ మంజూరు కావడంతో మంగళవారం చర్లపల్లి జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్లో చేరాలని ఆ పార్టీ నాయకులు తనపై ఒత్తిడి తెచ్చారని, అందుకు నిరాకరించడం వల్లే కేసులో ఇరికించారని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్లనున్నట్లు చెప్పారు