బస్తాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
సత్తుపల్లిటౌన్ : జిల్లాలో మార్కెఫెడ్, సివిల్ సప్లయ్ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, మక్కల రవాణాను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రభుత్వాన్ని కోరారు. సత్తుపల్లి మార్కెట్ యార్డులోని మార్క్‌ఫెడ్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించిన సందర్భంగా మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో 20 రోజుల నుంచి రైతులు పడిగాపులు పడుతున్నారని.. ఈ విషయాన్ని కలెక్టర్‌తోపాటు మార్క్‌ఫెడ్, సివిల్ సప్‌లైయ్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు.
వాతావరణం బాగాలేనందున అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. జిల్లాలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లేకపోవటం, ఇన్‌చార్జ్ కలెక్టర్‌కు అవగాహన లేనందున అధికార యంత్రాంగం ఉదాసీన వైఖరి అవలంభిస్తున్నారన్నారు. మిర్చి, మామిడి పంటలు కూడా అకాల వర్షానికి దెబ్బతిన్నాయని, వీరిని ప్రభుత్వ ఆదుకోవాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో రైతాంగానికి తాగునీరు, టెంట్, విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
కార్యక్రమంలో రామ్మోహన్, కూసంపూడి మహేష్, దూదిపాల రాంబాబు, వెలిశాల లక్ష్మాచారి, అద్దంకి అనిల్, చక్రవర్తి, పుచ్చా వెంకటేశ్వరరావు, వెంకటరెడ్డి, శ్రీనివాసరెడ్డి, కురిటి రాఘవులు, వినోద్, చంటి, మోటపోతుల నాగేశ్వరరావు, షట్రక్, నాని పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment