దామెర/నడికూడ: ఇటు ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వా హకుల నిర్లక్ష్యం.. అటు మిల్లర్ అన్‌లోడ్ చేయడంలో జా ప్యం.. వెరసి రోడ్డు ప్రమాదంలో ఓ రైతు నిండుప్రాణం పో యింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ ముత్యం రాజేందర్ కథనం ప్రకారం.. నడికూడ మండలం కంఠాత్మకూర్ గ్రామా నికి చెందిన పేరబోయిన చంద్రు (48) తన ఎకరన్నర భూమిలో వరి పండించాడు.
శనివారం గ్రామంలోని ఐకేపీ కేంద్రంలో ధాన్యం అమ్మాడు. ఆ ధాన్యాన్ని దుర్గంపేట్ సమీపంలోని మణికంఠ రైస్‌మిల్‌కు కేటాయించగా చంద్రు సొంతంగా ట్రాక్టర్ మాట్లాడుకుని ధాన్యం లోడ్‌తో మిల్లు వద్దకు వచ్చాడు. అప్పటికే ఎక్కువ ట్రాక్టర్లు ఉండటం.. అన్‌లోడింగ్ చేయడం ఇప్పుడు సాధ్యం కాదని మిల్లు నిర్వాహకులు తెలపడంతో పక్క గ్రామమైన రామకృష్ణాపూర్‌కు చెందిన ట్రాక్టర్ ఎక్కి స్వగ్రామానికి బయలుదేరాడు.
ఈ క్రమంలో ఊరుగొండ సమీపంలో జాతీయరహదారిపై వేగంగా వస్తు న్న లారీ.. చంద్రు ప్రయాణిస్తున్న ట్రా క్టర్‌ను ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ పైన ఉన్న చంద్రు ఎగిరి కిందపడటంతో తలకు, కాళ్లకు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు 108లో ఆయనను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం ఆయనను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా ఆదివారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
రైతుల ధర్నా
రోడ్డు ప్రమాదంలో చనిపోయిన రైతు చంద్రు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ పలువురు రైతులు ఆదివారం కంఠాత్మకూర్ బస్టాండ్ వద్ద ధర్నాకు దిగారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ధాన్యం తరలింపు బాధ్యత కొనుగోలు కేంద్రాల నిర్వాహకులదే అయినా, రైతులు సొంతంగా వాహనాలు పెట్టుకుని మిల్లులకు తరలించాల్సిన పరిస్థితి ఉందని వాపోయారు. ప్రభుత్వం చంద్రు కుటుంబానికి రైతుబీమా, రూ.20 లక్షల పరిహారం అందించాలని కోరారు. ఇప్పటికైనా అధికారులు రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment