grain purchase center
-
ధాన్యం అమ్మడానికి వెళ్లి..
దామెర/నడికూడ: ఇటు ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వా హకుల నిర్లక్ష్యం.. అటు మిల్లర్ అన్లోడ్ చేయడంలో జా ప్యం.. వెరసి రోడ్డు ప్రమాదంలో ఓ రైతు నిండుప్రాణం పో యింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలో చోటుచేసుకుంది. ఎస్ఐ ముత్యం రాజేందర్ కథనం ప్రకారం.. నడికూడ మండలం కంఠాత్మకూర్ గ్రామా నికి చెందిన పేరబోయిన చంద్రు (48) తన ఎకరన్నర భూమిలో వరి పండించాడు. శనివారం గ్రామంలోని ఐకేపీ కేంద్రంలో ధాన్యం అమ్మాడు. ఆ ధాన్యాన్ని దుర్గంపేట్ సమీపంలోని మణికంఠ రైస్‌మిల్‌కు కేటాయించగా చంద్రు సొంతంగా ట్రాక్టర్ మాట్లాడుకుని ధాన్యం లోడ్‌తో మిల్లు వద్దకు వచ్చాడు. అప్పటికే ఎక్కువ ట్రాక్టర్లు ఉండటం.. అన్లోడింగ్ చేయడం ఇప్పుడు సాధ్యం కాదని మిల్లు నిర్వాహకులు తెలపడంతో పక్క గ్రామమైన రామకృష్ణాపూర్‌కు చెందిన ట్రాక్టర్ ఎక్కి స్వగ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలో ఊరుగొండ సమీపంలో జాతీయరహదారిపై వేగంగా వస్తు న్న లారీ.. చంద్రు ప్రయాణిస్తున్న ట్రా క్టర్‌ను ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ పైన ఉన్న చంద్రు ఎగిరి కిందపడటంతో తలకు, కాళ్లకు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు 108లో ఆయనను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం ఆయనను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా ఆదివారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రైతుల ధర్నా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన రైతు చంద్రు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ పలువురు రైతులు ఆదివారం కంఠాత్మకూర్ బస్టాండ్ వద్ద ధర్నాకు దిగారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం తరలింపు బాధ్యత కొనుగోలు కేంద్రాల నిర్వాహకులదే అయినా, రైతులు సొంతంగా వాహనాలు పెట్టుకుని మిల్లులకు తరలించాల్సిన పరిస్థితి ఉందని వాపోయారు. ప్రభుత్వం చంద్రు కుటుంబానికి రైతుబీమా, రూ.20 లక్షల పరిహారం అందించాలని కోరారు. ఇప్పటికైనా అధికారులు రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. -
ధాన్యం కొనుగోలుకు వేళాయె..!
ఖరీఫ్ (సార్వా) పంట రైతుల చేతికొచ్చింది. అనుకూల వర్షాలతో జిల్లాలో ఈసారి ధాన్యం దిగుబడి ఆశాజనంగానే ఉంది. చాలాచోట్ల ఇప్పటికే వరికోతలు పూర్తయ్యాయి. మిగతాచోట్ల ముమ్మరంగా కోత పనులు సాగుతున్నాయి. ప్రభుత్వం కూడా ధాన్యం మద్దతుధరలనూ ప్రకటించింది. ఈ ప్రకారం కొనుగోళ్లకు రంగం సిద్ధమైంది. అధికారులు అందుకతగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో వరి సాగుకు అనుకూలమైన భూమి విస్తీర్ణం 1,07,428 హెక్టార్లు. దీనిలో సాధారణంగా సాగు అయ్యే విస్తీర్ణం 1,02,312 హెక్టార్లు. ఈ ఏడాది ఖరీఫ్‌లో దాదాపు 97,251 హెక్టార్లలో వరి సాగు అయ్యింది. వర్షాలు అనుకూలించడంతో దిగుబడి పెరిగిందని రైతులు ఆనందంలో ఉన్నారు. దాదాపు 3,68,752 మెట్రిక్ టన్నుల వరకూ ఉంటుందని అంచనా. దీనిలో రైతులు సొంత వినియోగానికి 1,08,657 మెట్రిక్ టన్నుల వరకూ మినహాయించుకున్నా, మిగతా 2,60,095 మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్లోకి రావాల్సి ఉంది. జిల్లాలో 34 రైస్‌మిల్లులు ఉన్నాయి. ఈ దృష్ట్యా జిల్లావ్యాప్తంగా 55 ధాన్యం కొనుగోలు కేంద్రాల (పీపీసీ)ను పౌర సరఫరాల సంస్థ ఏర్పాటు చేసింది. వీటిలో ఐదు వెలుగు (డీఆర్డీఏ) ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. చోడవరం వ్యవసాయ మార్కె ట్ యార్డు, యలమంచిలి మండల సమాఖ్య (లైన్ కొత్తూరు), నాతవరం మండల సమాఖ్య, నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ యార్డు, పద్మనాభం మండల సమాఖ్య ఆవరణల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మిగతా 50 పీపీసీలను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్)ల్లో నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం 8.30 గంటలకు వీటిని తెరుస్తారు. ఇవన్నీ మార్చి నెల వరకూ పనిచేస్తాయి. దళారీలకు అడ్డుకట్ట... రైతుల వద్ద తక్కువ ధరకు ముందుగానే ధాన్యాన్ని కొనేసి లబ్ధి పొందుతున్న దళారీలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులు తాము సాగు చేసిన పంటను ధాన్యం రకాలతో సహా ఈ–క్రాప్‌లో విధిగా నమోదు చేయించుకోవాలి. ఇందుకోసం సంబంధిత మండల వ్యవసాయాధికారిని లేదా వ్యవసాయ విస్తరణాధికారిని సంప్రదించాలి. గ్రామ సచివాలయంలోని గ్రామ వ్యవసాయ సహాకుల సలహా, సహకారాలు తీసుకోవచ్చు. కౌలురైతులు రుణ అర్హతపత్రం లేదా సాగు ధ్రువీకరణ పత్రం సంబంధిత కార్యాలయం నుంచి పొందాలి. ధాన్యం కొనుగోలు సమయంలో వెబ్‌ల్యాండ్/ఈ–క్రాప్‌లో నమోదైన వివరాలను పరిగణనలోకి తీసుకుంటారు. దళారీలకు అడ్డుకట్ట వేసి నిజమైన రైతులకు న్యాయం చేయడానికి ఈ నిబంధనలను అమలు చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. అలాగే నాలుగైదేళ్లుగా తమ మండల పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పేరు నమోదుచేసుకోని రైతులు ఎవ్వరైనా ఉంటే తక్షణమే ఆ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. ఇందుకోసం ఆధార్‌కార్డు, పాసుపోర్టు సైజ్ ఫొటోతో పాటు బ్యాంకు ఖాతా, పట్టాదారు పాసుపుస్తకం కాపీలను తీసుకెళ్లాలి. అంతకన్నా ముందు అసలు బ్యాంకు ఖాతా మనుగడలో ఉన్నదీ లేనిదీ సరిచూసుకోవాలి. పనిచేయని ఖాతా నంబరు ఇస్తే ధాన్యం ధర చెల్లింపు విషయంలో ఇబ్బంది ఏర్పడుతుంది. అలాగే రైతులు తాము ఏ రోజు పీపీసీకి తీసుకొచ్చేదీ ముందుగానే అక్కడి సిబ్బందికి తెలియజేయాలి. అందుకోసం టోకెన్ తీసుకోవాలి. నాణ్యత ప్రమాణాల ప్రకారమే ధర... ధాన్యానికి కనీస మద్ధతు ధరలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకారం సాధారణ రకం క్వింటాల్‌కు రూ.1,815 చొప్పున, ఏ గ్రేడు రకం ధాన్యానికి రూ.1,835 చొప్పున ధర రైతులకు చెల్లించాల్సి ఉంది. అలాగే ఈ ధాన్యం సేకరణలో పాటించాలి్సన నాణ్యత ప్రమాణాల వివరాలను కొనుగోలు కేంద్రాల వద్ద ప్రదర్శిస్తున్నారు. ధాన్యంలో మట్టిరాళ్లు, ఇసుక తదితర వ్యర్థాలు, గడ్డి, చెత్తతాలు, పొట్టు 1 శాతం వరకూ ఉండవచ్చు. చెడిపోయిన, రంగుమారిన, మొలకెత్తిన, పురుగు తొలచిన ధాన్యపు గింజలు 4 శాతానికి మించకూడదు. పరిపక్వంకాని, ముడుచుకుపోయిన, వంకర తిరిగిన గింజలు 3 శాతం వరకూ ఉండవచ్చు. ఏ గ్రేడు ధాన్యంలో కేళీలు 6 శాతం మించి ఉండకూడదు. ఏ గ్రేడు, సాధారణ రకాలైన సరే తేమ 17 శాతం వరకే ఉండాలి. సమీప కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లాలి.. రైతులు తాము పండించిన ధాన్యాన్ని సమీప కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి లబ్ధి పొందాలి. తక్కువ ధరలకు దళారీల చేతుల్లో పెట్టకుండా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందండి. నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలు కలిగిన ధాన్యాన్ని సొంత ఖర్చుతోనే కేంద్రానికి తీసుకెళ్లాలి. ధాన్యం కొనుగోళ్లకు అన్ని పీపీసీల్లోనూ ఏర్పాట్లు చేశాం. ఇక్కడ నాణ్యత పరిశీలనలో ఆమోదం పొందిన ధాన్యాన్ని గోనెసంచుల్లో నింపడం, కాటా వేయడం, బస్తాలు కుట్టడం, మార్కింగ్ వేసి లారీలకు లోడు చేయడం తదితర పనులకు అయ్యే ఖర్చు అంతా రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ భరిస్తుంది. – వి.వినయ్‌చంద్, జిల్లా కలెక్టరు ధాన్యం రకాలన్నీ కలిపేయవద్దు.. నూర్పుడి సమయంలోనే ధాన్యం కలిపేయకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఏ రకానికి ఆ రకమే ప్రత్యేకంగా నూర్పిడి చేయాలి. వాటిని ప్రత్యేక సంచుల్లో నింపాలి. తేమ శాతం 17 శాతం మించకుండా కళ్లాల్లో బాగా ఆరబెట్టిన తర్వాత రైతులు ఆ ధాన్యాన్ని పీపీసీకి తీసుకెళ్లాలి. అక్కడి సిబ్బందికి అప్పగించి వారి నుంచి తగు రసీదు పొందాలి. ధాన్యం విలువను నిర్ధారించిన తర్వాత ఎఫ్‌టీవోను తప్పకుండా అడిగి మరీ తీసుకోవాలి. – పి.వెంకటరమణ, జిల్లా మేనేజరు, జిల్లా పౌరసరఫరాల సంస్థ -
గుత్తాధిపత్యానికి చెక్
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : సర్కారు ధాన్యంతో సొంత వ్యాపారాలకు మరిగిన కొందరు రైస్‌మిల్లర్లకు పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ నిర్ణయం ఝలక్ ఇచ్చినట్లయింది. ఈ సీజన్లో రైతుల వద్ద సేకరించిన ధాన్యంలో కొంత మొత్తాన్ని సీఎంఆర్ (కస్టం మిల్లింగ్ ) కోసం జగిత్యాల జిల్లా రైస్‌మిల్లర్లకు అప్పగిస్తూ కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇన్నాళ్లూ జిల్లాలో గుత్తాధిపత్యాన్ని చెలాయించిన రైస్‌మిల్లర్లకు ఈ నిర్ణయం చెక్ పెట్టినట్లయింది. ఇప్పటి వరకు ఇతర జిల్లాల నుంచే నిజామాబాద్ జిల్లాకు ధాన్యం వచ్చేది. ఈసారి ఇక్కడి ధాన్యం ఇతర జిల్లాలకు వెళ్లడం జిల్లా చరిత్రలో ఇదే మొదటి సారి. ఈ నిర్ణయంతో సర్కారు ధాన్యంతో అక్రమాలకు పాల్పడితే అవసరమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తుందనే సంకేతాలను పంపినట్లయిందనే అభిప్రాయం వ్యక్తమవుతుండగా, మరోవైపు మిల్లర్లను ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది. 15 వేల మెట్రిక్ టన్నులు.. రబీ కొనుగోలు సీజనులో జిల్లాలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు పెద్ద మొత్తంలో ధాన్యం వచ్చింది. మొత్తం 3.64 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. ఇందులో నుంచి సుమారు 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని జగిత్యాల జిల్లా పరిధిలోని 18 రైస్‌మిల్లులకు కేటాయిస్తూ కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో ఉన్న అన్ని రైస్‌మిల్లుల మిల్లింగ్ సామర్థ్యం సుమారు 3.50 లక్షల మెట్రిక్ టన్నులు. అయితే ఈ కొనుగోలు సీజనులో సామర్థ్యానికి మించి ధాన్యం రావడంతో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు సీఎంఆర్ కేటాయింపులపై స్పష్టత ఇవ్వాలని కమిషనర్‌ను కోరారు. దీంతో కమిషనర్ సమీపంలోని జగిత్యాల జిల్లాకు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సుమారు 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం జగిత్యాలకు వెళ్లింది. ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇక్కడికి.. ఏటా ఇతర జిల్లాల నుంచి నిజామాబాద్ మిల్లుల కు ధాన్యం వచ్చేది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా నుంచి ధాన్యం ఇక్కడికి పంపేవారు. ఇలా ఇతర జిల్లాల నుంచి వచ్చిన ధాన్యాన్ని మరఆడించి బియ్యం ఇవ్వాల్సి ఉండగా, ఆ ధాన్యాన్ని కొందరు మిల్లర్లు తమ సొంత వ్యాపారాలకు వాడుకున్నారు. రూ.కోట్లు విలువ చేసే సర్కారు ధాన్యాన్ని బహిరంగమార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఈ సొమ్మును ఇతర వ్యా పారాలకు వాడుకుని చేతులెత్తేశారు. దీంతో నోటీసులు, కేసులు అంటూ అధికారులు డిఫాల్టర్ల వద్ద బియ్యాన్ని రాబట్టడంలో విఫలమయ్యారు. అధికారులు, మిల్లర్లు కుమ్మక్కు కావడంతోనే ఇది సా ధ్యమైంది. ఇందుకు భిన్నంగా ఇక్కడి ధాన్యాన్ని ఇప్పుడు ఇతర జిల్లాలకు కేటాయించడంతో మిల్ల ర్లు ఆలోచనలో పడ్డారు. -
ధాన్యం రవాణా వేగవంతం చేయాలి
సత్తుపల్లిటౌన్ : జిల్లాలో మార్కెఫెడ్, సివిల్ సప్లయ్ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, మక్కల రవాణాను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రభుత్వాన్ని కోరారు. సత్తుపల్లి మార్కెట్ యార్డులోని మార్క్‌ఫెడ్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించిన సందర్భంగా మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో 20 రోజుల నుంచి రైతులు పడిగాపులు పడుతున్నారని.. ఈ విషయాన్ని కలెక్టర్‌తోపాటు మార్క్‌ఫెడ్, సివిల్ సప్లైయ్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. వాతావరణం బాగాలేనందున అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. జిల్లాలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లేకపోవటం, ఇన్చార్జ్ కలెక్టర్‌కు అవగాహన లేనందున అధికార యంత్రాంగం ఉదాసీన వైఖరి అవలంభిస్తున్నారన్నారు. మిర్చి, మామిడి పంటలు కూడా అకాల వర్షానికి దెబ్బతిన్నాయని, వీరిని ప్రభుత్వ ఆదుకోవాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో రైతాంగానికి తాగునీరు, టెంట్, విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో రామ్మోహన్, కూసంపూడి మహేష్, దూదిపాల రాంబాబు, వెలిశాల లక్ష్మాచారి, అద్దంకి అనిల్, చక్రవర్తి, పుచ్చా వెంకటేశ్వరరావు, వెంకటరెడ్డి, శ్రీనివాసరెడ్డి, కురిటి రాఘవులు, వినోద్, చంటి, మోటపోతుల నాగేశ్వరరావు, షట్రక్, నాని పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
హుస్నాబాద్: రైతులు పండించిన ధాన్యాన్ని వ్యవసాయ మార్కెట్లో విక్రయించి మద్దతు ధర పొందాలని కరీంనగర్ జడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి అన్నారు. వ్యవసాయ మార్కెట్లో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగొళు కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రభుత్వం ప్రకటించిన వరి ధాన్యం గ్రేడ్ వన్ రకం రూ.1510, సాధారణ రకం ధాన్యం రూ.1470 మద్దతు ధర పొందాలని తెలిపారు. దళారులను ఆశ్రయించి మోసపోకుండా మార్కెట్లోనే విక్రయాలు జరపాలని కోరారు. బహిరంగ కొనుగొళ్ళకు పాల్పడితే వ్యాపారుల పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. మార్కెట్ కమిటి గోదాములలో పంటలు నిల్వ నిల్వ చేసి వాటి విలువలో 75శాతం దాదాపు రూ.2లక్షల గరిష్ట పరిమితికి లోబడి భూమి తనఖా లేకుండా ఋణం పొందే సౌకర్యాన్ని కల్పించిందన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రైతులు నిల్వ ఉంచిన పంటలకు పూర్తి భద్రతతో పాటు భీమా సౌకర్యం కల్పిస్తుందన్నారు. సరైన మద్దతు ధర రాకపోతే రైతుల అభ్యర్ధన మేరకు 270 రోజుల వరకు నిల్వ ఉంచుకునే సదుపాయం కల్పించిందన్నారు. -
ఎంత ధాన్యమైనా కొంటాం
పరిగి, న్యూస్‌లైన్: ధాన్యం ఎంత మొత్తంలోనైనా కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని జేసీ ఎంవీ రెడ్డి అన్నారు. గురువారం ఆయన పరిగిలో డీసీఎమ్మెస్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం పరిగిలోని మీసేవ కేంద్రం, తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి పలు సమస్యలపై అధికారులతో చర్చించారు. పింఛన్ లబ్ధిదారులు పడిగాపుల విషయంపై డీఆర్డీఏ పీడీ వరప్రసాద్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. పరిగి మండల వ్యవసాయ అధికారిణి రేణుకా చక్రవ ర్తి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జేడీఏ విజయ్‌కుమార్‌తో ఫోన్లో మాట్లాడారు. ఆమెకు ఒకరోజు వేతనం కట్ చేయటంతో పాటు మెమో జారీ చేయాలని జేడీఏను జేసీ ఆదేశించారు. మీసేవ కేంద్రంలో రూ.300 తీసుకుని 160 రూపాయలకు మాత్రమే రసీదు ఇచ్చారని ఓ వ్యక్తి జేసీకి ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 25 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు జరుపుతున్నామని తెలిపారు. 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు లక్ష్యంగా పెట్టుకున్నామని.. దీన్ని మించి ఎంతైనా కొనుగోలు చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 4100 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. రైతులు కొందరు టార్పాలిన్ల గురించి అడగ్గా సరఫరా చేస్తామన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించేందుకు సమయానికి లారీల కాంట్రాక్టర్ లారీలు పంపించకుంటే స్థానికంగా అద్దెకు మాట్లాడుకుని పంపించాలని డీసీఎమ్మెస్ అధికారులకు జేసీ సూచించారు. కుల్కచర్ల మండలం చౌడాపూర్‌లో డీసీఎమ్మెస్ కౌంటర్ ఏర్పాటు చేయాలని రైతులు కోరగా పరిశీలిస్తామన్నారు. జేసీ వెంట తహసీల్దార్ విజయ్‌కుమార్‌రెడ్డి, సివిల్ సప్లయ్ డీటీ అశోక్, డీసీఎమ్మెస్ పరిగి శాఖ మేనేజర్ శ్యాంసుందర్‌రెడ్డి, సిబ్బంది వెంకటేష్, రాములు తదితరులున్నారు.