వివరాలు తెలుసుకుంటున్న ఎస్‌ఐ ప్రసాద్
తల్లాడ ఖమ్మం : మండలంలోని అన్నారుగూడెంలో బుధవారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో దొంగలు మూడిళ్లలో చోరీ చేశారు. మరో మూడిళ్లలోనూ దొంగలు పడ్డారు.
- ఈ గ్రామంలోని ఇండ్ల కోటేశ్వర్‌రావు, కుటుంబీకులు కలిసి బుధవారం రాత్రి తమ ఇంటి ముందు నిద్రించారు. ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు.. ఉంగరం చోరీ చేశారు. ఇంటి ముందు ఉంచిన మోటార్ సైకిల్‌ను తీసుకెళ్లారు.
- ఇదే గ్రామంలోని పిన్ని సత్యనారాయణ ఇంటిలో కూడా ఇదే రోజు రాత్రి చోరీ జరిగింది. బీరువాలో దాచిన ఎనిమిది గ్రాములున్న రెండు ఉంగరాలను దొంగలించారు.
- పులి నాగేశ్వర్‌రావు ఇంటిలో కూడా ఇదే రాత్రి చోరీ జరిగింది. బీరువాలోగల ఒక జత చెవి దిద్దులు, మాటీలు, ఉంగరం, 16 గ్రాములున్న నగలను దొంగిలించారు.
- అంకమ్మ గుడి బజారులో రావూరి స్వరాజ్యమ్మ గాజులను దొంలించారు. అవి మట్టి గాజులవడంతో అక్కడే వదిలేశారు.
- ఇదే గ్రామంలోని గోవింద్ శ్రీనివాసరావు ఇంట్లోకి దొంగలు ప్రవేశించారు. ఆయన కూతురు మెడలోని నగలను దొంగలించేందుకు ప్రయత్నించారు. ఆమె మేల్కొని కేకలు వేయడంతో పారిపోయారు.
- ఒకేరోజు రాత్రి ఇన్ని ఇళ్లలో దొంగలు పడడంతో గ్రామస్తులు భయభ్రాంతులవుతున్నారు. ఈ ఇళ్లను తల్లాడ ఎస్‌ఐ మేడా ప్రసాద్ పరిశీలించారు. ఆధారాలను క్లూస్ టీం సేకరించింది. కేసులను ఎస్‌ఐ దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment