ఖమ్మం క్రైం, న్యూస్‌లైన్ :ఖమ్మంనగరంలోని బైపార్ రోడ్డులో ఉన్న బ్యాంక్ కాలనీ ఎస్‌బీహెచ్ ఏటీఎంలో సోమవారం తెల్లవారుజామున ఓ వ్యక్తి చోరీ చేసేందుకు యత్నించాడు. ఏటీఎం మెషిన్ డోర్ తెరుచుకోకపోవడంతో దానిని ధ్వంసం చేసి వెళ్లినట్లు తెలుస్తోంది. అలాగే పోలీసులు గుర్తించకుండా ఉండేందుకు ఏటీఎంలో కారం చల్లి వెళ్లాడు. పోలీసుల కథ నం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
ఖమ్మంనగరంలోని బైపాస్‌రోడ్డులో బ్యాంకు కాలనీ ఎస్‌బీహెచ్‌కు చెందిన ఏటీఎం ఉంది. ఈ ఏటీఎంకు శ్రీనివాసరావు అనే వ్యక్తి షాపు అద్దెకు ఇచ్చాడు. సోమవారం ఉదయం అతను అందులోకి వెళ్లి చూడగా ఏటీఎం మెషిన్ పగులగొట్టడంతో పాటు కారం చల్లి ఉంది. దీంతో అతను వెంటనే ఏటీఎంలో నగదు పెట్టే రైటర్ సేఫ్ గార్డు కంపెనీ జిల్లా అధికారి పుంపాని రాజశేఖరరెడ్డికి సమాచారం అందించారు.
దీంతో ఆయన ముంబైలోని టాటా కమ్యూనికేషన్ ఆఫ్ పేమెంట్ సొల్యుషన్ ఇన్‌చార్జ్‌కు సమాచారం అందించారు. స్థానికులు టూటౌన్ సీఐ సారంగపాణికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ విచారణ చేపట్టి క్లూస్ టీంను పిలిపిం చారు. అలాగే టాటా కమ్యూనికేషన్ ఆఫ్ పేమెంట్ సొల్యుషన్ సిబ్బందిని, రైటర్ సేఫ్ గార్డు సిబ్బందిని పిలిపించి వి చారణ చేపట్టారు.
ఈ ఏటీఎంలో రెండు రోజుల క్రితమే రూ. 18 లక్షల నగదు పెట్టినట్లు వారు సీఐకి తెలిపారు. ఏటీఎంలో కారంపొడి చల్లడం, సీసీ కెమేరా వైర్లు కట్ చేయడం తో నిందితుడి వివరాలు తెలియరాలేదు. దీంతో పోలీసులు సీసీ కెమేరా హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు. ధ్వంసమైన ఏటీఎం మెషిన్ ఖరీదు సుమారు రూ.1.70లక్షల ఉం టుందని పోలీసులు తెలిపారు. టాటా కమ్యూనికేషన్ ఆఫ్ పేమెంట్ సొల్యుషన్ సంస్థ జిల్లా ఇన్‌చార్జ్ హర్షవర్ధన్ ఫిర్యా దు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పని చేయని సీసీ కెమేరాలు......
ఈ ఏటీఎంలోని సీసీ కెమేరాలో గత ఏడాది డిసెంబర్ వరకు మాత్రమే వివరాలు నమోదయ్యాయని, రెండు నెలల నుంచి అవి పని చేయడం లేదని తెలుస్తోంది. సీసీ కెమేరా షార్ట్ సర్క్యూట్ అయి ఉంటే హార్డ్ డిస్క్‌లోని డేటా మొత్తం పోయే అవకాశం ఉంది. కానీ టాటా కంపెనీ సిబ్బంది మాత్రం ఒక్కనెల డేటా మాత్రమే పోయిందని చెబుతుండడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జనవరి 2014 నుంచి సీసీ కెమెరా పని చేయడం లేదని తెలుస్తోంది.
సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలని నోటీసులు ఇచ్చాం : టూటౌన్ సీఐ సారంగపాణి
బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలని గత ఏడాది డిసెంబర్ 16వ తేదీన నోటీసులు జారీ చేశారు. సీసీ కెమెరా స్టోరేజీ పెంచుకోవాలని, నిత్యం పని చేసే విధంగా చూడాలని, ప్రతీ రోజు సెక్యురిటీ గార్డులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని నోటీసులు జారీ చేశారు. కానీ ఇంత వరకు ఎవరూ స్పందించలేదు.
ఎస్‌బీహెచ్ ఏటీఎంలో చోరీయత్నం
Published Tue, Feb 11 2014 2:56 AM | Last Updated on Tue, Aug 28 2018 8:09 PM
Advertisement