సమావేశంలో మాట్లాడుతున్న యూబీఐ సీజీఎం బ్రహ్మానందరెడ్డి
సాక్షి, అమరావతి: డాక్యుమెంట్లన్నీ సక్రమంగా ఉంటే ఏ రుణమైన 48 గంటల్లోనే ఇస్తామని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) కన్వీనర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని యూబీఐ బ్రాంచ్ మేనేజర్లతో విజయవాడలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని యూబీఐ వివిధ రకాల రుణ సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చిందని చెప్పారు.
గృహ, వాహన, విద్యా, వ్యక్తిగత, తనఖాపై రుణాలను అందిస్తున్నామని చెప్పారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు ఎంఎస్‌ఎంఈ రుణాలు అందిస్తామన్నారు. బ్యాంక్ రీజినల్ మేనేజర్ వేగే రమేష్, డిప్యూటీ జోనల్ హెడ్ శ్రీనివాసులురెడ్డి, డిప్యూటీ రీజనల్ హెడ్ సుందర్, ఏజీఎం సుబ్రహ్మణ్యం, లోన్ పాయింట్ హెడ్ జేఎస్‌ఆర్ మూర్తి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment