brahmananda reddy
-
పోటీ చేద్దామా.. వద్దా?
సాక్షి, నంద్యాల: టికెట్ల విషయంలో టీడీపీ అధిష్టానం నానుస్తుండడంతో నంద్యాలలో ఆ పార్టీ కేడర్ అయోమయంలో పడింది. మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌కే టికెట్ అని గతంలో చంద్రబాబు చెప్పినా ప్రస్తుత నాన్చుడు ధోరణితో ఆయన ముందుకు కదలడం లేదు. పైగా ఎన్నికల్లో పోటీ చేయాలా... వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నారు. ఓడిపోయే సీటు నుంచి పోటీ చేసేందుకు నిరాసక్తి వ్యక్తం చేస్తున్నారు. ఇన్చార్జే డైలమాలో ఉండడంతో కార్యకర్తలు తలోదిక్కు చూసుకుంటున్నారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్సీపీకి కంచుకోట. 2017 ఉప ఎన్నికలో తప్ప ప్రతీసారీ వైఎస్సార్ సీపీ హవానే కొనసాగుతోంది. ఇక్కడ నుంచి ఈసారీ గెలవడం అసాధ్యమని ఫరూక్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. టీడీపీ క్షేత్రస్థాయి కేడర్ నుంచీ ఆశించినంత మద్దతు లేకపోవడంతో పోటీ చేసేందుకు విముఖత చూపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కోట్లకు కోట్లు ఖర్చు పెట్టుకునేందుకు సిద్ధంగా లేనని ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. ఫరూక్, బ్రహ్మానందరెడ్డి ఎడమొహం పెడమొహం మరోవైపు మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్ ఎడమొహం పెడమొహంగా మెలుగుతున్నారు. టీడీపీ నంద్యాల నియోజకవర్గ ఇన్చార్జిగా గతేడాది నవంబర్ 27న ఫరూక్ చార్జి తీసుకున్న నాటి నుంచి నేటి వరకు వీరిద్దరూ కలిసింది లేదు. ఎవరికి వారు విడివిడిగా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. కలిసి మాట్లాడదామని ఫరూక్ అనేకసార్లు భూమా బ్రహ్మానందరెడ్డిని కోరినా ఫలితం లేకపోయింది. ఫరూక్ ముఖం చూసేందుకు కూడా భూమా ఇష్టపడడం లేదని చెబుతున్నారు. కేడర్ తన ఆధీనంలో ఉందని, టికెట్ తనకేనని ప్రచారం చేసుకుంటున్నారు. టికెట్ రాని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవాలని బ్రహ్మం ఆలోచనగా ఉందని అంటున్నారు. ఈ మేరకు కొంతమంది నాయకుల ఇళ్లకు వెళ్లి మరీ మద్దతు కోరుతున్నారు. కేడర్‌లో గందరగోళం ఇద్దరు నాయకుల మధ్య సమన్వయం కొరవడడంతో కేడర్ గందరగోళంలో పడింది. కలిసికట్టుగా పనిచేస్తేనే విజయం దక్కడం కష్టం.. ఇక కలహాలతో గెలవడం అసాధ్యమన్న భావన కార్యకర్తల్లో నెలకొంది. ఇన్చార్జిగా ప్రకటించిన తర్వాత కూడా పోటీ చేసేందుకు ఫరూక్ తటపటాయింపు, ఇద్దరు నేతల అనైక్యతతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో అధిష్టానం ఉంది. -
టీడీపీ ఇన్చార్జి బ్రహ్మారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు
మాచర్ల రూరల్: మితిమీరిన వేగంతో వాహనాన్ని నడిపి ఆటోను ఢీకొని ముగ్గురిని గాయపర్చటమే కాకుండా వారిపై దురుసుగా కులం పేరుతో దౌర్జన్యం చేసిన ఘటనలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి జూలకంటి బ్రహ్మానందరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు శుక్రవారం తెలిపారు. వివరాలలోకి వెళితే గురువారం కంభంపాడు గ్రామ సమీపంలో బ్రహ్మారెడ్డి తన వాహనంలో అనుచరులతో వెళ్తుండగా ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న అంగడి శ్రీనివాసరావు, అంగడి కోటమ్మ, పాల్‌రాజ్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఇదేమని అడిగిన బాధితులపై బ్రహ్మారెడ్డి అనుచరులు తీవ్ర దూషణలతో దాడికి యత్నించారు. దీంతో అక్కడికి చేరుకున్న బంధువులు, బ్రహ్మారెడ్డి ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేశారు. క్షతగాత్రులను మానవతా దృష్టితో వైద్యశాలకు తరలించి వైద్యం అందించాల్సి ఉన్నా బాధితులపై దూషణకు పాల్పడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ సంఘ నాయకులతో కలిసి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జూలకంటి బ్రహ్మారెడ్డితోపాటు మరికొందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ షేక్ షమీముద్దిన్ పేర్కొన్నారు. -
శ్రీశైలం బ్యాక్‌వాటర్‌పై బ్యారేజ్ కమ్ ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను కలుపుతూ కృష్ణానదిపై నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జిని శ్రీశైలం బ్యాక్‌వాటర్‌పై బ్యారేజ్ కమ్ ఐకానిక్ బ్రిడ్జిగా నిర్మించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి కోరారు. ఆయన బుధవారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై ప్రసంగించారు. మూడు స్టేషన్ల ఆధునికీకరణకు డీపీఆర్‌లు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు రైల్వేస్టేషన్ల ఆధునికీకరణకు వివరాణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లు తయారయ్యాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. టెక్నో–ఎకనామిక్ సాధ్యాసాధ్యాలు అధ్యయనం చేసినట్లు చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, బాలశౌరి ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. ఆత్రేయపురం పూతరేకులకు జీఐకి విజ్ఞప్తి ఆత్రేయపురం పూతరేకులకు జీఐ గుర్తింపు ఇవ్వాలని సర్ ఆర్థర్ కాటన్ ఆత్రేయపురం పూతరేకుల తయారీదారుల సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ సహాయమంత్రి సోమ్‌ప్రకాశ్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ప్రశ్నకు సమాధానమిచ్చారు. నాలుగు గతిశక్తి కార్గో టెర్మినళ్ల గుర్తింపు ఆంధ్రప్రదేశ్‌లో నాలుగుచోట్ల గతిశక్తి కార్గో టెర్మినళ్ల ఏర్పాటును గుర్తించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైల్వేయేతర ఏజెన్సీలు ఈ టెర్మినళ్లను అభివృద్ధి చేస్తున్నందున నిధులు కేటాయించలేదని వైఎస్సార్సీపీ ఎంపీలు ఎన్.రెడ్డెప్ప, పి.వి.మిథున్‌రెడ్డి ప్రశ్నకు సమాధానమిచ్చారు. 1,374 హాల్‌మార్క్ ల్యాబొరేటరీలు దేశవ్యాప్తంగా 1,374 హాల్‌మార్క్ ల్యాబొరేటరీలు పనిచేస్తున్నాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ సహాయమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి తెలిపారు. వెఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ ప్రశ్నకు సమాధానమిచ్చారు. కృష్ణపట్నం నోడ్‌కు 2,139.15 ఎకరాలు చెన్నై–బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా కృష్ణపట్నం నోడ్‌కు సంబంధించి స్పెషల్ పర్పస్ వెహికల్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2,139.15 ఎకరాలు బదలాయించిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ సహాయమంత్రి సోమ్‌ప్రకాశ్ తెలిపారు. 12,798 ఎకరాల ప్రాజెక్టుకు సంబంధించి డిటైల్డ్ మాస్టర్ ప్లానింగ్, ప్రిలిమినరీ డిజైన్, ఇంజనీరింగ్ పూర్తయ్యాయని వైఎస్సార్సీపీ ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి ప్రశ్నకు జవాబిచ్చారు. -
48 గంటల్లోనే రుణాలు
సాక్షి, అమరావతి: డాక్యుమెంట్లన్నీ సక్రమంగా ఉంటే ఏ రుణమైన 48 గంటల్లోనే ఇస్తామని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) కన్వీనర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని యూబీఐ బ్రాంచ్ మేనేజర్లతో విజయవాడలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని యూబీఐ వివిధ రకాల రుణ సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చిందని చెప్పారు. గృహ, వాహన, విద్యా, వ్యక్తిగత, తనఖాపై రుణాలను అందిస్తున్నామని చెప్పారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు ఎంఎస్ఎంఈ రుణాలు అందిస్తామన్నారు. బ్యాంక్ రీజినల్ మేనేజర్ వేగే రమేష్, డిప్యూటీ జోనల్ హెడ్ శ్రీనివాసులురెడ్డి, డిప్యూటీ రీజనల్ హెడ్ సుందర్, ఏజీఎం సుబ్రహ్మణ్యం, లోన్ పాయింట్ హెడ్ జేఎస్ఆర్ మూర్తి పాల్గొన్నారు. -
‘కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి అసైన్డ్ భూములు కొనుగోలు చేశారు’
సాక్షి, గుంటూరు: కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి అమరావతిలో అసైన్డ్ భూములు కొనుగోలు చేశారని ఆయన దగ్గర పనిచేసిన ప్రసాద్ తెలిపారు. బడాబాబులకు అసైన్డ్ భూములు కొనిపెట్టారని చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ బినామీ కొల్లి శివరామకు కూడా భారీ స్థాయిలో భూములు కొని పెట్టారని తెలిపారు. దళిత రైతులు ఎదురు తిరుగుతారేమోనన్న భయంతో అసెన్డ్‌భూముల కొనుగోళ్ల వ్యవహారం మొత్తాన్ని వీడియో చేయించారన్నారు. 2015 జనవరి 1న భూ సమీకరణ మొదలు పెట్టగా, 2016 ఫిబ్రవరి వరకు అసైన్డ్ భూములను ల్యాండ్‌పూలింగ్‌కు తీసుకోలేదని వెల్లడించారు. ఈ ఏడాది కాలంలో అమరావతిలో అసెన్డ్‌భూములను పెద్దలు కొనేశారని చెప్పారు. టీడీపీ నేతలందరితోనూ కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డికి పరిచయాలున్నాయని, అలానే ఎవరెంత కొనుగోలు చేశారో చిట్టా అంతా బ్రహ్మానందరెడ్డి వద్ద ఉందన్నారు. అధికారులకు లంచాలు ఇచ్చి అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ చేయడానికి యత్నించారని, మాకు తెలియకుండానే మా పేరుతో ఆస్తుల్ని రిజిస్ట్రేషన్ చేయించారన్నారు. ఇదే విషయాన్ని సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. -
తప్పు చేయకుంటే భయమెందుకు?
సాక్షి, న్యూడిల్లీ: అమరావతిలో భూముల అక్రమాలపై ఆధారాలుంటే కేసులు పెట్టాలని సవాల్ చేసిన టీడీపీ నేతలు దర్యాప్తుపై స్టే ఎందుకు తెచ్చుకున్నారని వైఎస్సార్ సీపీ ఎంపీలు సూటిగా ప్రశ్నించారు. ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, తలారి రంగయ్య, పోచ బ్రహ్మానందరెడ్డి, గోరంట్ల మాధవ్ మంగళవారం పార్లమెంట్ ఆవరణలో మాట్లాడారు. దొంగే.. దొంగ అన్నట్లుగా ఉంది: బెల్లాన ► సుమారు 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైతే దానిపై స్టే తెచ్చారు. విపక్ష పార్టీల నేతలు గుడులు, గోపురాలపై దాడులు చేస్తూ దొంగే దొంగ అని అరిచిన మాదిరిగా వ్యవహరిస్తున్నారు. సవాల్ చేసి పరార్.. రంగయ్య..: భూ కుంభకోణాలు, ఇతర స్కాములపై ఆధారాలు చూపి కేసులు పెట్టుకోవాలని సవాళ్లు చేసిన ప్రతిపక్ష నేతలు మాటపై నిలబడకుండా పారిపోతున్నారు.తప్పులు చేయనప్పుడు భయం ఎందుకు? కోర్టులకు వెళ్లి స్టే ఉత్తర్వులు ఎందుకు తెచ్చుకుంటున్నారు? తప్పు చేయకుంటే స్వాగతించండి: బ్రహ్మానందరెడ్డి ► అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మూడు రాజధానుల నిర్ణయం తీసుకుంటే అడ్డుకుంటున్నారు. ► అమరావతిలో చంద్రబాబు భూ కుంభకోణానికి పాల్పడ్డారు. తప్పు చేయకుంటే సీబీఐ దర్యాప్తును ఎందుకు స్వాగతించడం లేదు? ఆలయాలపై పారదర్శకంగా వ్యవహరిస్తూ సీబీఐ దర్యాప్తు కోరితే స్వాగతించకుండా విమర్శలకు దిగడం సిగ్గుచేటు. -
సిబిఐ దర్యాప్తుకు ఎందుకు జంకుతున్నారు?
సాక్షి, ఢిల్లీ : తప్పు చేయకుంటే టీడీపీ నేతలు ఎందుకు కోర్టులకు వెళ్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ బ్రహ్మానందరెడ్డి ప్రశ్నించారు. సిబిఐ దర్యాప్తుకు టిడిపి నేతలు ఎందుకు జంకుతున్నారని నిలదీశారు. అమరావతి, అంతర్వేది సహా అన్ని అంశాలపై సిబిఐ దర్యాప్తుకు ప్రభుత్వం రెడీగా ఉందని స్పష్టం చేశారు. ఇక అమరావతి భూ కుంభకోణానికి సంబం ధించి మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ఇద్దరు కుమార్తెలతో పాటు మరికొందరిపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. -
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్..
సాక్షి, విజయవాడ: అంతర రాష్ట్ర బస్సు సర్వీసులపై ప్రాథమిక చర్చలు జరిగాయని ఏపీఎస్ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు రాష్ట్రాల మధ్య 4 దశల్లో ఆపరేషన్స్ ప్రారంభించాలని చూస్తున్నామని వెల్లడించారు. 256 సర్వీసులు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు నడపాలనే దిశగా ఆలోచనలు చేస్తున్నామని పేర్కొన్నారు. మరోసారి భేటీ అనంతరం స్పష్టత వస్తుందని చెప్పారు. (ఏపీ నుంచి కర్ణాటకకు బస్సు సర్వీసులు) వచ్చే వారంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అంతర్ రాష్ట్ర సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశముందని ఆయన వెల్లడించారు. కోవిడ్ నిబంధనల ప్రకారమే బస్సులు నడుపుతామని పేర్కొన్నారు. ప్రోటోకాల్ తప్పక పాటిస్తామన్నారు. విభజన జరిగినప్పుడు ఇంటర్‌స్టేట్ అగ్రిమెంట్ కాలేదని, దాని మీద కూడా చర్చ జరిగిందని బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. -
బైలంపుడి ట్రైలర్ చాలా బాగుంది
‘‘బైలంపుడి’ ట్రైలర్ చూశా.. చాలా బాగుంది. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. పక్కా కమర్షియల్ అంశాలు ఉన్నాయి. ఈ సినిమా నిర్మాత బ్రహ్మానందరెడ్డి చేసిన విలన్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని దర్శకుడు సాగర్ అన్నారు. హరీష్ వినయ్, తనిష్క తివారి జంటగా అనిల్ పి.జి.రాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బైలంపుడి’. తారా క్రియేషన్స్ పతాకంపై బ్రహ్మానందరెడ్డి నటిస్తూ, నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీరిలీజ్ ఫంక్షన్లో అలీ మాట్లాడుతూ– ‘‘బైలంపూడి’ కథగానీ, డైరెక్టర్‌గానీ, ప్రొడ్యూసర్గానీ నాకు తెలియదు. మా ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించారు. ఈ సినిమా తియ్యడానికి చాలా కష్టపడ్డాం అన్నారు. సినిమా మీద ప్యాషన్‌తో కొత్తవాళ్లు రావడం మంచిది. ఇండస్ట్రీకి కొత్తనీరు రావాలి’’ అన్నారు. ‘‘మా సినిమా విడుదలవడానికి యూనిట్‌తో పాటు, ఇక్కడకి వచ్చిన ఎంతో మంది అతిథులు చాలా సహాయం చేశారు. డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్‌రెడ్డిగారు మా సినిమాని అన్ని ఏరియాల్లో అమ్మేశారు. నేను ఇంత దూరం రావడానికి నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతో ఉంది’’ అన్నారు బ్రహ్మానందరెడ్డి. ‘‘ఒక ఊరిలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశాం’’ అన్నారు అనిల్ పి.జి.రాజ్. -
బ్రేక్ వస్తుందనుకుంటున్నాం
‘‘రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రివెంజ్ స్టోరీ ‘బైలంపుడి’. తమకు జరిగిన అన్యాయాన్ని తెలివిగా ఎలా తిప్పికొట్టారు? అనే కథాంశం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది’’ అని బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఆయన నటించి, నిర్మించిన చిత్రం ‘బైలంపుడి’. హరీశ్ వినయ్, తనిష్క్ రాజన్ హీరోహీరోయిన్లుగా నటించారు. అనిల్ పీజే రాజ్ దర్శకుడు. ఈ చిత్రం ప్రీ–రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 13న జరగనుంది. ఈ సినిమా గురించి బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ – ‘‘యాక్టింగ్ మీద ఆసక్తితో కొన్ని వెబ్‌సిరీస్‌లు, డెమో సినిమాల్లో నటించాను. ఈ సినిమాలో నటించిన యాక్టర్స్ అందరూ కొత్తవారే. అందరం బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాం. త్వరలోనే రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. నెక్ట్స్ మరో సినిమాలో నటిస్తూ, నిర్మిస్తున్నాను’’ అన్నారు. -
బైలంపుడిలో ఏం జరిగింది?
హరీష్ వినయ్, అనుష్క తివారి జంటగా అనిల్ పి.జి.రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బైలంపుడి’. తార క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ పారిశ్రామికవేత్త బ్రహ్మానందరెడ్డి నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. నిర్మాత బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ– ‘‘పారిశ్రామికవేత్తగా ఉన్న నేను సినిమా మీద ఆసక్తితో తొలిసారి ‘బైలంపుడి’ చిత్రాన్ని నిర్మిస్తున్నా. ఒక మంచి సినిమా నిర్మించాలన్న కల ఈ సినిమాతో నెరవేరుతోంది. బైలంపుడి అనే గ్రామంలో పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే రివేంజ్ డ్రామా ఇది. ప్రస్తుతం వైజాగ్ దగ్గర చోడవరంలో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది’’ అన్నారు. అతిథిగా విచ్చేసిన ‘మిస్ ఫేమ్ ఇండియా 2018’ షాలు సోని మాట్లాడుతూ– ‘‘బ్రహ్మానందరెడ్డిగారు ఒక మంచి కాన్సెప్ట్‌తో ఈ సినిమా చేస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా బావుంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు. చిత్ర ప్రమోటర్ శ్రీనివాస్ శరకడం, డైలాగ్ రైటర్ సాయి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్, కెమెరా: అనిల్‌కుమార్ పళ్ల. -
వైఎస్సార్సీపీ నేత కొల్లం కన్నుమూత
రైల్వేకోడూరు అర్బన్: వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు వైఎస్సార్సీపీ సీనియర్ నేత, నియోజకవర్గ ఇన్చార్జి కొల్లం బ్రహ్మానందరెడ్డి అనారోగ్యంతో శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. చెన్నైలో చికిత్స చేయించుకుని ఇటీవలే తిరుపతిలోని ఆయన స్వగృహానికి వచ్చారు. అక్కడే ఆయన తుదిశ్వాస విడిచారు. పుల్లంపేట మండలం మల్లెంవారిపల్లెలో కొల్లం పెంచల్‌రెడ్డి, మంగమ్మకు ప్రథమ సంతానంగా 1954 జులై 1న బ్రహ్మానందరెడ్డి జన్మించారు. ప్రొద్దుటూరుకు చెందిన పల్లెటి జయరామిరెడ్డి కుమార్తె రమాదేవిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతుల ఏకైక కుమార్తె హర్షితరెడ్డికి ఇటీవల వివాహమైంది. బ్రహ్మన్నగా ప్రఖ్యాతి పొందిన బ్రహ్మానందరెడ్డికి ఒక సోదరుడు ఏడుగురు సహోదరిలు ఉన్నారు. వైఎస్సార్ శిష్యుడిగా.. : పుల్లంపేట మండలంలో రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన బ్రహ్మానందరెడ్డి.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి శిష్యుడిగా ఆయనతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు. రైల్వేకోడూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు. వైఎస్సార్ ఉన్నపుడు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని రెండు పర్యాయాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులను రెండుమార్లు గెలిపించారు. ప్రస్తుత ఎమ్మెల్యే కొరముట్లను కాంగ్రెస్ పార్టీలో ఒకమారు, వైఎస్సార్సీపీలో రెండుసార్లు గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు. బ్రహ్మానందరెడ్డి డీసీసీబీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. ప్రస్తుతం రైల్వేకోడూరు నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి పార్టీ కార్యకర్తలకు, బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉంటూ ప్రజల్లో చెరగని ముద్ర వేశారు. వైఎస్ జగన్ సంతాపం కొల్లం బ్రహ్మానందరెడ్డి మృతి పట్ల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. బ్రహ్మానందరెడ్డి పార్టీకి ఎంతో సేవ చేశారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ మంచి నాయకుడిని కోల్పోయిందని చెప్పారు. -
కుల వివక్షను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు
వైఎస్సార్సీపీ నేత బత్తుల బ్రహ్మానందరెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో కుల వివక్షను పెంచి పోషిస్తున్నారని, రాజకీయ స్వార్థం కోసం దళితులపై దౌర్జన్యం, దాడులు చేయిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం దేవరపల్లి గ్రామంలో 75 ఏళ్లుగా దళితులు సాగు చేసుకుంటున్న భూములను నీరు– చెట్టు పేరుతో కొల్లగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే సాంబశివరావు నాయకత్వంలో రెండు నెలల నుంచీ ఎక్కడెక్కడ అవకాశాలుంటే అక్కడ భూములు లాక్కుంటున్నారని, దేవరపల్లిలో చెరువుల వంకతో దళితుల భూముల్లో తవ్వకాలు చేపడుతున్నారని ధ్వజమెత్తారు. దేవరపల్లిలో తక్షణమే చెరువు తవ్వకాన్ని ఆపాలని బత్తుల డిమాండ్ చేశారు. లేదంటే తాము పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
'ఆ విషయం కేబినెట్లో చర్చించడం సిగ్గుచేటు'
ఒంగోలు: చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసిందని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి విమర్శించారు. ప్రతిపక్షనేత జగన్‌పై ఎలా బురద జల్లాలి అనే దానిపై కేబినెట్లో చర్చించడం సిగ్గుచేటు అని ఆయన మండిపడ్డారు. శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడిన బ్రహ్మానందరెడ్డి.. చంద్రబాబు అసెంబ్లీని తన సొంత ఆస్థిగా భావిస్తున్నారని.. బాబు అహంకార ధోరణిపై తిరుగుబాటుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. -
హామీ నిలబెట్టుకోమంటే వేధిస్తారా?
- కాంట్రాక్టు లెక్చరర్లను తొలగించడం తగదు - వారి పోరాటాలకు వైఎస్ జగన్ మద్దతు - వైఎస్సార్సీపీ నేత బ్రహ్మానందరెడ్డి సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వస్తే కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీ కరిస్తామని 2014 ఎన్నికల సమయంలో హామీఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు అందుకు వ్యతిరేకంగా వ్యవహరించడం దారుణమని వైఎస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లా డుతూ చంద్రబాబు వైఖరిని దుయ్య బట్టారు.ఉద్యోగ భద్రత కోసం కాంట్రాక్టు లెక్చరర్లు ఆందోళన చేస్తూ ఉంటే ఏకంగా ఉద్యోగాల నుంచి తీసేస్తామంటూ నోటీసు లివ్వడమే కాక, వారిపై కేసులు పెట్టడం తగ దన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పూర్తిగా తన సంఘీభావాన్ని తెలిపారని ఆయన వెల్లడించారు. రాజమండ్రిలో 2012 ఫిబ్రవరి 4న మహిళా కాంట్రాక్టు లెక్చరర్లు సర్వీసులను క్రమబద్ధీకరించాలని కోరుతూ నిరాహార దీక్షలు చేస్తున్నపుడు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు అక్కడికి వెళ్లి వారికి మద్దతు ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆరోజు బాబు మాట్లాడుతూ కాంట్రాక్టు లెక్చరర్ల డిమాండ్ న్యాయబద్ధ మైనదని చెప్పారని బ్రహ్మానందరెడ్డి నాటి పేపర్ క్లిప్పింగులు చూపారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా స్పష్టంగా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని చెప్పిన బాబు సీఎం అయిన తర్వాత వాటిని మరిచిపోవడం దారుణమన్నారు. ఆ మాటలు మరిచి అదే లెక్చరర్లకు ఎలా నోటీసులు జారీ చేస్తారని ఆయన సీఎంను ప్రశ్నించారు. ఆందోళన చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను తొలగించాలని ప్రిన్సిపాళ్లకు ఆదేశాలివ్వడం దారుణమన్నారు. -
'అవినీతికి పేటెంట్ చంద్రబాబుదే'
-
'చంద్రబాబు తప్పులను వెంకయ్య వెనకేసుకొస్తున్నారు'
-
ఇది కక్ష సాధింపు
కడప అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం తమ కుటుం బంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైఎస్సార్ సీపీ నేత, డీసీసీబీ మాజీ చైర్మన్ కొల్లం బ్రహ్మనందరెడ్డి అన్నారు. అనంతసముద్రం సొసైటీలో పట్టాదారు పాసు పుస్తకాలు లేకుండా రుణాలిచ్చారనే కేసులో కడప వన్‌టౌన్ పోలీసుస్టేషన్ వద్ద సీబీసీఐడి పోలీ సులు ఆయన్ను అరెస్ట్ చేశారు. సుభాషిణి అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేర కు 2014లో ఎస్.ఐ రంగనాయకులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితునిగా ఉన్న ఆయన్ను తిరుపతిలో అదుపులోకి తీసుకున్న సీబీసీఐడీ అదనపు ఎస్పీ శ్రీధర్, సీఐ ఎస్ఎం షరీఫ్ శుక్రవారం కడపకు తీసుకొచ్చి అరెస్ట్ చూపించారు. ఈ సందర్బంగా బ్రహ్మానందరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తమ కుటుంబంపై రాష్ట్ర ప్రభుత్వం పనిగట్టుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. తన సోదరుడు కొల్లం గంగిరెడ్డి రాజంపేట పరిధిలో ఉన్నంతకాలం ఎలాంటి కేసులు బనాయించ లేదన్నారు. ఆయన విదేశాలకు వెళ్లగానే ఏకంగా 27 కేసులు నమోదు చేయడం అన్యాయమన్నారు. తన బావ, పుల్లంపేట ఎంపీపీ బాబుల్‌రెడ్డిని అరెస్టు చేసి కటకటాలపాలు చేశారన్నారు. ఆయన ఒక కేసులో శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదని జీఓ ఉన్నప్పటికీ అప్పటికప్పుడు ప్రభుత్వం ఇంకో జీఓను పుట్టించి అతన్ని అరెస్టు చేసి ఇబ్బందుల పాలు చేశారన్నారు. అయినప్పటికీ తాము భయపడటం లేదన్నారు. న్యాయస్థానంలో తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నామన్నారు. అనంతరం ఆయన్ను జిల్లా కోర్టులోని ఎక్సైజ్ కోర్టు మెజిస్ట్రేట్ లావణ్య ఎదుట హాజరు పరిచారు. 14 రోజులు రిమాండ్ విధించడంతో కేంద్ర కారాగారానికి తరలించారు. అంతకు ముందు కడప మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్యే ఎస్బీ అంజద్ బాష, కార్పొరేటర్ రామలక్ష్మణ్‌రెడ్డి, పలువురు నేతలు పోలీసుస్టేషన్ వద్దకు వచ్చి బ్రహ్మానందరెడ్డిని పరామర్శించారు.