మాచర్ల రూరల్: మితిమీరిన వేగంతో వాహనాన్ని నడిపి ఆటోను ఢీకొని ముగ్గురిని గాయపర్చటమే కాకుండా వారిపై దురుసుగా కులం పేరుతో దౌర్జన్యం చేసిన ఘటనలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి జూలకంటి బ్రహ్మానందరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు శుక్రవారం తెలిపారు. వివరాలలోకి వెళితే గురువారం కంభంపాడు గ్రామ సమీపంలో బ్రహ్మారెడ్డి తన వాహనంలో అనుచరులతో వెళ్తుండగా ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న అంగడి శ్రీనివాసరావు, అంగడి కోటమ్మ, పాల్‌రాజ్‌కు తీవ్రగాయాలయ్యాయి.
ఇదేమని అడిగిన బాధితులపై బ్రహ్మారెడ్డి అనుచరులు తీవ్ర దూషణలతో దాడికి యత్నించారు. దీంతో అక్కడికి చేరుకున్న బంధువులు, బ్రహ్మారెడ్డి ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేశారు. క్షతగాత్రులను మానవతా దృష్టితో వైద్యశాలకు తరలించి వైద్యం అందించాల్సి ఉన్నా బాధితులపై దూషణకు పాల్పడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ సంఘ నాయకులతో కలిసి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జూలకంటి బ్రహ్మారెడ్డితోపాటు మరికొందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ షేక్ షమీముద్దిన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment