
సాక్షి, ఢిల్లీ : తప్పు చేయకుంటే టీడీపీ నేతలు ఎందుకు కోర్టులకు వెళ్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ బ్రహ్మానందరెడ్డి ప్రశ్నించారు. సిబిఐ దర్యాప్తుకు టిడిపి నేతలు ఎందుకు జంకుతున్నారని నిలదీశారు. అమరావతి, అంతర్వేది సహా అన్ని అంశాలపై సిబిఐ దర్యాప్తుకు ప్రభుత్వం రెడీగా ఉందని స్పష్టం చేశారు. ఇక అమరావతి భూ కుంభకోణానికి సంబం ధించి మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ఇద్దరు కుమార్తెలతో పాటు మరికొందరిపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.