ఆరేళ్ల క్రితం ఎన్డీయే నుంచి బాబు బయటకొస్తే ‘నో సీబీఐ’
2018లో సీబీఐకి అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు
జగన్ ప్రభుత్వం వచ్చాక సీబీఐని రాష్ట్రంలోకి అనుమతిస్తూ ఉత్తర్వులు
ఎన్డీయేలో చేరడంతో తాజాగా అవే ఉత్తర్వులను మరో ఏడాది కొనసాగిస్తూ నిర్ణయం
ఇప్పుడది బాబు ఘనతేనంటూ ఎల్లో మీడియాలో గొప్పలు
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు మరో యూ టర్న్ తీసుకున్నారు. ఆరేళ్ల క్రితం బీజేపీతో విభేదాల కారణంగా అప్పట్లో ఎన్డీయేతో తెగదెంపులు చేసుకున్న చంద్రబాబు రాష్ట్రంలో సీబీఐకి అనుమతి నిరాకరిస్తూ 2018లో ఉత్తర్వులు జారీ చేశారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వంపై తాను యుద్ధం ప్రకటించానని.. సీబీఐని రాష్ట్రంలోకి రానిచ్చేది లేదంటూ చంద్రబాబు బీరాలు పలికారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చంద్రబాబు చేసిన తప్పును సరిదిద్ది.. సీబీఐని రాష్ట్రంలోకి అనుమతిస్తూ 2019 జూన్ 6న ఉత్తర్వులు జారీ చేసింది.
అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ఉత్తర్వులనే చంద్రబాబు ప్రభుత్వం మరో ఏడాది పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మళ్లీ ఎన్డీయేతో జత కట్టిన చంద్రబాబు సీబీఐ విషయంలో యూటర్న్ తీసుకున్నారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లి‹Ùమెంట్ చట్టం–1946 ప్రకారం సీబీఐకి రాష్ట్రంలో కేసుల విచారణకు అనుమతిస్తూ హోం శాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులపై విచారణ చేపట్టేందుకు అనుమతించింది. కాగా.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై ముందస్తు అనుమతితో విచారణ చేపట్టవచ్చని తెలిపింది. ఈ అనుమతి ఈ ఏడాది జూలై 1 నుంచే అమలులోకి వచ్చినట్టుగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
చంద్రబాబు ఘనతగా ఎల్లో మీడియా డప్పు
సీబీఐని రాష్ట్రంలో నిషేధిస్తూ 2018లో చంద్రబాబు జారీ చేసిన ఉత్తర్వులను తోసిరాజని వైఎస్ జగన్ సర్కారు 2019 జూన్ 6న జారీ చేసిన ఉత్తర్వులనే మరో ఏడాది పాటు కొనసాగిస్తూ ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. అదంతా చంద్రబాబు ఘనతగా తెలుగుదేశం పార్టీ గొప్పలు చెప్పుకుంటోంది. దానినే ఎల్లో మీడియా ప్రచారంలోకి తెచ్చి0ది. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్నే మరో ఏడాదిపాటు కొనసాగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు గొప్పేనంటూ ఎల్లో మీడియా డప్పు కొడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment