Sajjala Ramakrishna Reddy Comments On CBI About YS Vivekananda Reddy Case - Sakshi
Sakshi News home page

అప్పటికీ సునీతమ్మ ఫోన్‌ చేయలేదు.. ఇప్పుడు బతికున్నోళ్లను బజారుకీడుస్తోంది

Published Wed, Jul 26 2023 4:17 AM | Last Updated on Wed, Jul 26 2023 10:40 AM

Sajjala Ramakrishna Reddy On CBI about YS Vivekananda Reddy Case - Sakshi

సాక్షి, అమరావతి: సీబీఐ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ కూడా చెత్తగా దర్యాప్తు చేస్తుందనేందుకు మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు నిదర్శనంగా నిలుస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ప్రజాక్షేత్రంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కోలేని గుంట నక్కలకు సీబీఐ వేదికగా మారిందని మండిపడ్డారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల సీబీఐ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ మొత్తం కల్పిత కథేనని కొట్టిపారేశారు.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు బాకాలు ఊదే ఎల్లో మీడియాకు నాలుగు రోజులు మసాలా కథనాలు వండివార్చడానికి మాత్రమే సీబీఐ ఛార్జ్‌షీట్‌ ఉపయోగపడుతుంది కానీ ఈ డైలీ సీరియల్‌ న్యాయస్థానాల్లో నిలబడదని తేల్చి చెప్పారు. వైఎస్‌ భారతమ్మ, తాను కలిసి సునీతమ్మ ఇంటికే వెళ్లలేదని సజ్జల స్పష్టం చేశారు. అలాంటప్పుడు ఎంపీ అవినాష్‌రెడ్డిని వెనకేసుకురావాలని సునీతమ్మను తాను ఎలా కోరుతానని ప్రశ్నించారు. సునీతమ్మ పచ్చి అబద్ధాలు చెబుతున్నట్లు స్పష్టమవుతోందన్నారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే..  

ఆ మాత్రం ఇంగితజ్ఞానం లేదా? 
ఎలాంటి ఆధారాలు లేకున్నా కేవలం వ్యక్తుల వాంగ్మూలాలను కల్పిత కథకు అనుకూలంగా మారుస్తూ సీబీఐ ఛార్జ్‌షీట్లు దాఖలు చేస్తోంది. వైఎస్‌ వివేకా హత్య వల్ల నష్టం ఎవరికి? అని ప్రశ్నిస్తే.. వైఎస్సార్‌ సీపీకి, జగన్‌కే అని చిన్న పిల్లాడైనా చెబుతాడు. ఇంకా చెప్పాలంటే నాడు కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డికి నష్టం. రాజకీయంగా ఆత్మహత్య చేసుకోవాలని ఆయన ఎందుకు అనుకుంటారు? ఏ చిన్న దర్యాప్తు సంస్థ అయినా, ప్రైవేట్‌ డిటెక్టివ్‌ సంస్థకైనా ఈమాత్రం ఇంగితం ఉంటుంది. వివేకా హత్య కేసును రెండు సిట్‌లు దర్యాప్తు చేశాయి. అవి సేకరించిన కాల్‌ రికార్డ్స్, డేటాను సీబీఐ ఏం చేసిందో తెలియదు.  
 
వ్యవస్థల్లోకి వైరస్‌లా చంద్రబాబు.. 
అన్ని వ్యవస్థల్లో వైరస్‌లా పాకిన చంద్రబాబు తన అనుచరులతో జాతీయ స్థాయిలో మేనేజ్‌ చేసేలా చక్రం తిప్పుతున్నారు. వివేకా హత్య వల్ల నాడు అధికారంలో ఉన్న చంద్రబాబుకు రెండు లాభాలు. ఒకటి వైఎస్‌ జగన్‌ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం.. రెండోది.. పాదయాత్ర పూర్తిచేసి అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమైన వైఎస్‌ జగన్‌ను తేరుకోనివ్వకుండా చేయడం.   

తెలంగాణ హైకోర్టు ప్రశ్నించడంతో..  
తెలంగాణ హైకోర్టు గత మే 31న మొదటిసారిగా కేసును క్షుణ్ణంగా పరిశీలించి సీబీఐని పలు ప్రశ్నలు అడిగింది. మేం ముందు నుంచీ వ్యక్తం చేస్తున్న సందేహాలే అవి. అవినాష్రెడ్డి జూన్‌ 19న సీబీఐ డైరెక్టర్‌కి లేఖ రాయడంతో సునీతమ్మ స్టేట్‌మెంట్‌ మరొకటి రికార్డు చేశారు. హింసాత్మక సంఘటనలు జరుగుతాయనే లేఖను బయట పెట్టలేదని సునీతమ్మ చెబుతున్నారు. అది అసహజం. సొంత తండ్రి చనిపోయినా లేఖ విషయాన్ని పట్టించుకోలేదంటే ఎలా నమ్మడం?  

పది రోజుల తర్వాత పరామర్శకు వెళ్లా.. 
2019 మార్చి 23వ తేదీన భారతమ్మ వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్లు చేయమన్నారని సునీతమ్మ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. అవినాష్ను సమర్థించాలని నేను కోరినట్లు కథ అల్లారు. ఆ రోజు భారతమ్మ, నేను కలిసి ఆమె ఇంటికి వెళ్లలేదు. వివేకా హత్య జరిగిన తర్వాత పది రోజులకు నా భార్యతో కలసి పరామర్శించడానికి వెళ్లా. బాగా షాక్‌తో ఉంటారనుకున్నాగానీ అంత ఇదిగా అయితే కనిపించలేదు.

షాకింగ్‌ సంఘటన జరిగినప్పుడు మొదట ఇంటికి పెద్దలా ఉన్న వైఎస్‌ జగన్‌కు ఫోన్‌ రావాలి. కానీ సునీతమ్మ వైపు నుంచి ఫోన్‌ రాలేదు. వివేకా వ్యక్తిత్వాన్ని హననం చేసిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఈనాడు ఈరోజు ఆమెకు మిత్రులు, సలహాదారులు, సన్ని­హి­తులు. వివేకాకు మచ్చ రాకూడదని అవినాష్‌ రెడ్డి కుటుంబం మూడేళ్లు మౌనంగా అన్నీ భరించింది. చనిపోయిన వ్యక్తి గౌరవాన్ని కాపాడాలని మేం తపన పడుతుంటే బతికున్నవారినే సునీతమ్మ బజారుకీడుస్తున్నారు. బతుకులను నాశనం చేసే పరిస్థితికి వచ్చాక మౌనం వీడి నోరు తెరవాల్సి వస్తోంది.  

దస్తగిరిని అప్రూవర్‌గా మార్చి ట్రైనింగ్‌ 
ఆధారాలు, పరిసరాలు, హత్యలో పాల్గొన్న వ్యక్తు లు ఇలా అన్నీ ఒక వైపు చూపిస్తుంటే.. దర్యాప్తు మరోవైపు సాగుతోంది. ఎప్పుడైతే సునీతమ్మ ఆలోచన విధానం మారిందో అప్పుడే కేసును బలవంతంగా తిప్పడం మొదలుపెట్టారు. చంద్రబాబుకు లాభం చేకూరేలా మార్చారు. వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో సిద్ధహస్తులు కాబట్టి సీబీఐ చేతికి వ చ్చాక వారికి తగ్గట్లుగానే అన్నీ జరుగుతూ వచ్చా యి. అవినాష్ వైపు వేలు చూపించేందుకు దస్తగిరిని అప్రూవర్‌గా మార్చి ట్రైనింగ్‌ కూడా ఇచ్చారు.    

వివేకా కోసం అవినాష్‌ ధర్నా 
నిజానికి నాడు వివేకాకు ఎమ్మెల్సీ టికెట్‌ ఇవ్వాలని జగన్‌కు ప్రతిపాదన చేసింది అవినాõÙ. ఒక ఎంపీటీసీని టీడీపీ నేతలు ఎత్తుకెళితే వివేకా కోసం అవినాష్‌రెడ్డి స్వయంగా ధర్నాకు కూర్చున్నాడు. 2011లో పార్టీ పెట్టినప్పటి నుంచీ పులివెందుల విషయంలో తన ప్రతినిధిగా అవినాష్ను జగన్‌ ఎంపిక చేసుకున్నారు. వైఎస్సార్‌కు వివేకా ఎలాగో ఇప్పుడు జగన్‌కు కూడా అవినాష్‌ అలానే.   

గుంట నక్కలకు వేదిక.. 
వివేకాను వారే హత్య చేశారనేందుకు పది పన్నెండు కారణాలున్నాయి. ఆస్తి, కుటుంబ పరువు విషయాలే ప్రధానంగా హత్యలకు దారి తీస్తాయి. వివేకా చెక్‌ పవర్‌ను రద్దు చేయడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వివేకా రెండో భార్య షమీమ్‌ స్టేట్‌మెంట్లో అన్నీ ఉన్నాయి. వివేకా బావమరిది శివప్రకాశ్‌రెడ్డి బెదిరించాడని, మనుషులను పంపించాడని ఆమె స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. దీనిపై సీబీఐ ఎందుకు విచారించదు? అన్ని శక్తులు ఉడిగిపోయిన గుంటనక్కలన్నీ ఒకచోట చేరి సీఎం వైఎస్‌ జగన్‌ను రాజకీయంగా దెబ్బతీసేందుకు సీబీఐని వేదికగా చేసుకుంటున్నాయి.

పది బండలు వేస్తే ఒకటన్నా నమ్మకపోతారా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కోర్టు ఒకసారి మొట్టికాయలు వేసింది. న్యాయమూర్తి అమ్ముడుపోయాడంటూ ఆంధ్రజ్యోతి డిబేట్‌లో నేరుగా బురద చల్లే  దుస్సాహసానికి ఒడిగట్టింది. జర్నలిజం పేరుతో బెదిరింపులకు పాల్పడు తూ ఉగ్రవాదుల కంటే దారుణంగా వ్యవహరిస్తున్నా రు. చంద్రబాబు, ఎల్లో మీడియా కరివేపాకులా సునీతమ్మను వాడుకుంటున్నారు. ఎన్నికలు ముగి యగానే ఆమెను అనాథలా పక్కన పెట్టడం ఖాయం.

ప్రత్యర్థుల క్యాంపులో సునీతమ్మ..
కారణాలు ఏమిటో తెలియదుగానీ వివేకా కుమార్తె సునీతమ్మ ఆ తర్వాత వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఆమె పూర్తిగా ప్రత్యర్థుల క్యాంపులోకి వెళ్లినట్లు అనిపించింది. కథ మలుపు తిరగాలన్నపుడల్లా వారికి అనుగుణంగా ఆరేడు సార్లు సునీతమ్మ స్టేట్‌మెంట్లు తీసుకున్నారు. వారికి కావాల్సిన స్టేట్‌మెంట్లు తీసుకుంటూ ఇన్వెస్టిగేషన్‌ రివీల్డ్‌ అంటున్నారు.

సునీల్‌ యాదవ్‌ అనే నిందితుడు బెయిల్‌కి దరఖాస్తు చేసినప్పుడు గూగుల్‌ టేకవుట్‌ను తెరపైకి తెచ్చి అవినాష్రెడ్డి తండ్రిని లోపల పెట్టేశారు. గూగుల్‌ టేకవుట్‌ ఈ కేసులో నిలబడదని తెలియగానే యూనివర్సల్‌ టైమ్‌ కో–ఆర్డినేటర్‌ ప్రకారం మన సమయానికి 5.30 గంటలు కలపాలన్నారు. ఆ లెక్కన వారు చెప్పిన టైం మరుసటి రోజు 8 గంటలు కావడంతో దాన్ని పక్కన పెట్టేశారు. అది నిలబడదని వారికీ అర్ధమైంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement