సాక్షి, నెల్లూరు జిల్లా: కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో తనకు క్లీన్‌చిట్ రావడంపై మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పందించారు. చంద్రబాబుకు ఆయన సవాల్ విసిరారు. నాపై వచ్చిన ఆరోపణలకు సీబీఐ విచారణ కోరా.. చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలకు విచారణకు సిద్ధమా?. చంద్రబాబుకు దమ్ముంటే సీబీఐ విచారణ కోరగలరా?. బాబు అవీనీతి పరుడు కాకుంటే సీబీఐ విచారణ కోరాలి’’ అంటూ కాకాణి డిమాండ్ చేశారు.
‘‘చంద్రబాబు ప్రజాధనాన్ని లూటీ చేశారు. నాపై ఆరోపణలు చేసిన వారికి సీబీఐ ఛార్జ్‌షీట్ చెంపపెట్టు. విచారణకు నేను సిద్ధమని ఆనాడే కోర్టులో చెప్పా. నాపై టీడీపీ దుష్ప్రచారం చేసింది. మొదటి నుంచి విచారణ పారదర్శకంగా జరిగింది. సీబీఐ విచారణలో కూడా నా పాత్ర లేదని తేలింది’’ అని మంత్రి కాకాణి పేర్కొన్నారు.
కాగా, నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఫైళ్ల మిస్సింగ్ కేసులో కాకాణి పాత్ర లేదంటూ ఛార్జ్ షీట్‌లో సీబీఐ స్పష్టం చేసింది. మంత్రి కాకాణికి నేరం జరిగిన విధానం పట్ల అవగాహన లేదని చార్జ్‌షీట్‌లో సీబీఐ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment