cleanchit
-
చంద్రబాబుకు మంత్రి కాకాణి సవాల్
సాక్షి, నెల్లూరు జిల్లా: కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో తనకు క్లీన్చిట్ రావడంపై మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పందించారు. చంద్రబాబుకు ఆయన సవాల్ విసిరారు. నాపై వచ్చిన ఆరోపణలకు సీబీఐ విచారణ కోరా.. చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలకు విచారణకు సిద్ధమా?. చంద్రబాబుకు దమ్ముంటే సీబీఐ విచారణ కోరగలరా?. బాబు అవీనీతి పరుడు కాకుంటే సీబీఐ విచారణ కోరాలి’’ అంటూ కాకాణి డిమాండ్ చేశారు. ‘‘చంద్రబాబు ప్రజాధనాన్ని లూటీ చేశారు. నాపై ఆరోపణలు చేసిన వారికి సీబీఐ ఛార్జ్‌షీట్ చెంపపెట్టు. విచారణకు నేను సిద్ధమని ఆనాడే కోర్టులో చెప్పా. నాపై టీడీపీ దుష్ప్రచారం చేసింది. మొదటి నుంచి విచారణ పారదర్శకంగా జరిగింది. సీబీఐ విచారణలో కూడా నా పాత్ర లేదని తేలింది’’ అని మంత్రి కాకాణి పేర్కొన్నారు. కాగా, నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఫైళ్ల మిస్సింగ్ కేసులో కాకాణి పాత్ర లేదంటూ ఛార్జ్ షీట్లో సీబీఐ స్పష్టం చేసింది. మంత్రి కాకాణికి నేరం జరిగిన విధానం పట్ల అవగాహన లేదని చార్జ్‌షీట్‌లో సీబీఐ పేర్కొంది. -
సమీర్ వాంఖడే కులంపై అనుమానాలు.. క్లీన్చిట్ ఇచ్చిన కాస్ట్ ప్యానెల్
ముంబై: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) మాజీ ముంబై జోనల్ డైరెక్టర్, ఐఆర్ఎస్ అధికారి సమీర్ వాంఖడే జన్మతః ఎస్సీ వర్గానికి చెందిన మహర్ కులస్తుడని మహారాష్ట్ర సామాజిక న్యాయ విభాగం శుక్రవారం స్పష్టం చేసింది. ముస్లిం అయిన సమీర్ వాంఖడే నకిలీ ధ్రువపత్రాలతో ప్రభుత్వ ఉద్యోగం పొందారంటూ వచ్చిన ఆరోపణల్లో నిగ్గు తేల్చేందుకు ఏర్పాటైన కమిటీ ఈ మేరకు క్లీన్చిట్ ఇచ్చింది. సమీర్ వాంఖడే కులంపై మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ తదితరులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు అందిన ఫిర్యాదులపై ముంబై జిల్లా కుల ధ్రువీకరణ పరిశీలన కమిటీ విచారణ జరిపింది. సమీర్, ఆయన తండ్రి ధ్యాన్‌దేవ్ వాంఖడేలు హిందూ మతం వీడి ఇస్లాం స్వీకరించినట్లు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని పేర్కొంది. 2021 అక్టోబర్‌లో ముంబై క్రూయిజ్ షిప్‌పై వాంఖడే నేతృత్వంలోని ఎన్సీబీ బృందం సోదాలు జరపడం, డ్రగ్స్ కలిగి ఉన్నారనే ఆరోపణలపై బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ సహా పలువురిని అదుపులోకి తీసుకోవడం తెలిసిన విషయమే. -
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్‌కు క్లీన్చిట్
జాతి వివక్ష ఆరోపణల నుంచి దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్‌కు విముక్తి లభించింది. అతనితో పాటు ప్రస్తుత కోచ్, మాజీ వికెట్ కీపర్ మార్క్ బౌచర్, ఏబీ డివిలియర్స్‌లకు కూడా క్లీన్చిట్ ఇచ్చారు. స్మిత్ తదితరులు జట్టులోని నల్లజాతి క్రికెటర్లపై వివక్షకు పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలు లభించలేదని... ఎన్సెబెజా నేతృత్వంలోని సోషల్ జస్టిస్ అండ్ నేషన్ బిల్డింగ్ కమిటీ తమ నివేదికలో పేర్కొంది. -
సుశాంత్ కేసు: ఓ సోదరికి బెయిల్.. మరొకరికి షాక్
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు విచారణ ఇంకా విచారణ సాగుతోంది. విచారణలో భాగంగా సోమవారం అతడి సోదరి మీటు సింగ్‌కు బెయిల్ లభించింది. అయితే మరో సోదరి ప్రియాంక సింగ్‌కు మాత్రం షాక్ తగిలింది. ఆమెకు బాంబే హైకోర్టు క్లీట్ చిట్ ఇవ్వలేదు. ఆమె పాత్రపై కొన్ని అనుమానాలు ఉన్నాయని హైకోర్టు అభిప్రాయ పడింది. సుశాంత్ మృతి కేసులో నటి రియా చక్రవర్తి ఓ కేసును దాఖలు చేసిన విషయం తెలిసిందే. సుశాంత్ ఇద్దరు సోదరిలు మీటు సింగ్, ప్రియాంక సింగ్‌పై రియా కేసు నమోదు చేయించింది. ఈ కేసుపై బాంబే హైకోర్టు తన తీర్పులో మీటూ సింగ్‌కు ఊరట కల్పిస్తూ ఆదేశాలిచ్చింది. సతీశ్ మనేశ్ షిండే, ఎంఎస్ కార్నిక్‌తో కూడిన డివిజన్ బెంచ్ ఈ కేసులో విచారణ చేపట్టింది. రియా దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన ఎఫ్ఐఆర్లను సుశాంత్ సోదరిలు కొట్టివేయాలని కోర్టును కోరారు. సుశాంత్ అనుమానాస్పద మృతి కేసులో సోదరి ప్రియాంక సింగ్‌పై కొన్ని ప్రాథమిక అనుమానాలు ఉన్నాయని, ఆమెను విచారణకు దూరంగా ఉంచాల్సిన అవసరం లేదని కోర్టు తన పేర్కొన్నది. దీంతో మీటుకు ఊరట లభించగా ప్రియాంకకు షాక్ తగిలింది. అయితే నటి రియా డాక్టర్ తరుణ్ కుమార్‌పై కూడా కేసు నమోదు చేయించింది. దీనిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. రియా చక్రవర్తి సత్యం కోసం కృషి చేస్తుందని.. ఆమె వేదనంతా అదేనని న్యాయమూర్తి సతీశ్ మనేశ్ షిండే పేర్కొన్నారు. హీరోయిన్ మెహ్రీన్‌కు కాబోయే భర్త ఎవరో తెలుసా..? లైవ్‌లో ఏడ్చేసిన హీరోయిన్ -
మీ టూ : నానా పటేకర్‌కు క్లీన్ చిట్
ముంబై : లైంగిక వేధింపుల ఆరోపణలపై అలోక్ నాధ్, వికాస్ బల్లు క్లీన్ చిట్ అందుకున్న క్రమంలో తాజాగా మీటూ ఆరోపణలపై బాలీవుడ్ నటుడు నానా పటేకర్కూ క్లీన్ చిట్ లభించింది. నానా పటేకర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ప్రాథమిక ఆధారాలూ లభించనందున కేసును మూసివేసినట్టు సమాచారం. కాగా నానా పటేకర్‌కు క్లీన్ చిట్ లభించిందని గతంలోనూ వార్తలు వెలువడగా ఆయనపై ఆరోపణలు గుప్పించిన తనుశ్రీ దత్తా వాటిని వదంతులుగా తోసిపుచ్చారు. నానా పటేకర్ పీఆర్ బృందం ఈ వదంతులను వ్యాపింపచేస్తున్నారని తనుశ్రీ ప్రతినిధి, అడ్వకేట్ నితిన్ సత్పుటే ఆరోపించారు. కాగా నానా పటేకర్, కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య, నిర్మాత సమి సిద్ధిఖీ, దర్శకుడు రాకేష్ సావంత్‌లు తనపై, తనతో పాటు కారులో ఉన్న కుటుంబ సభ్యులపై దాడిచేశారని తాము ఫిర్యాదు చేయగా పోలీసులు నానా పటేకర్‌కు ఎలా క్లీన్ చిట్ ఇస్తారని ఇటీవల తనుశ్రీ ప్రశ్నించారు. కాగా, 2008లో హార్న్ ఓకే ప్లీస్ సెట్లో నటుడు నానా పటేకర్ తనతో ఇంటిమేట్ సీన్లో నటించాలని కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యతో కలిసి ఒత్తిడి చేశారని, అందుకు నిరాకరించడంతో తనతో పాటు తన కారులో ఉన్న కుటుంబ సభ్యులపై వారు దాడికి తెగబడ్డారని తనుశ్రీ దత్తా ఆరోపించారు. -
సీజేఐ గొగోయ్‌కు క్లీన్చిట్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల్లో ఆయన క్లీన్చిట్ పొందారు. ఆయనపై వచ్చిన ఆరోపణలను రుజువు చేసే ఆధారాలు లేవని సుప్రీంకోర్టు అంతర్గత విచారణ కమిటీ స్పష్టం చేసింది. సీజేఐ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సుప్రీంకోర్టు మాజీ మహిళా ఉద్యోగి ఆరోపించడం తెల్సిందే. దీంతో జస్టిస్ బాబ్డే నేతృత్వంలో ముగ్గురు సభ్యుల అంతర్గత విచారణ కమిటీ ఏర్పాటైంది. కమిటీలో ప్రస్తుతం జడ్జీలు జస్టిస్ ఇందూ మల్హోత్రా, ఇందిరా బెనర్జీలు సభ్యులుగా ఉన్నారు. 14 రోజుల పాటు విచారణ జరిపిన ఈ కమిటీ నివేదికను సమర్పించింది. అయితే ఆ నివేదికను బహిర్గతం చేయలేమని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ సోమవారం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ‘సీజేఐపై మాజీ ఉద్యోగిని చేసిన ఆరోపణల విషయంలో ఆధారాలు లేవని కమిటీ గుర్తించింది’ అని తెలిపారు. కమిటీ నివేదికను ఆదివారమే సమర్పించింది. కోర్టులో సీజేఐ తర్వాత సీనియర్ జడ్జి అయిన జస్టిస్ బాబ్డేకు నివేదికను అందజేసింది. ఈ కమిటీని ఏర్పాటు చేసినప్పుడు జస్టిస్ ఎన్వీ రమణ సభ్యుడిగా ఉన్నారు. అయితే ఆయన సభ్యుడిగా ఉండటంపై మహిళా ఉద్యోగి అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో కమిటీ నుంచి ఆయన తప్పుకున్నారు. తీవ్ర అన్యాయం జరిగింది.. సీజేఐకు క్లీన్చిట్ ఇవ్వడంపై ఆయనపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ నివేదిక తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని పేర్కొన్నారు. తాను భయపడుతున్నట్లే జరిగిందని, ఓ భారతీయ మహిళగా తనకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన న్యాయవాదితో చర్చించి తదుపరి కార్యాచరణను వెల్లడిస్తానని చెప్పారు. ఈ ఆరోపణల వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, దానిపై విచారణ జరపాలని దాఖలైన పిటిషన్‌పై త్వరలోనే విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు పేర్కొంది. సీజేఐకు క్లీన్చిట్ ఇవ్వడాన్ని ప్రముఖ న్యాయకోవిదుడు సోలి సొరబ్జీ స్వాగతించారు. కమిటీ నిష్పక్షపాతంగా, స్వతంత్రంగానే విచారణ జరిపిందని పేర్కొన్నారు. సీజేఐ గొగోయ్‌కు క్లీన్చిట్ ఇవ్వడానికి కమిటీ చాలా తొందరపడిందని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సోమవారం ట్వీట్ చేశారు. సీజేఐపై కేసులో పూర్వాపరాలు ► ఏప్రిల్ 19: సీజేఐ వేధించారంటూ 22 మంది సుప్రీం జడ్జీలకు లేఖలు పంపిన మాజీ ఉద్యోగిని. ► ఏప్రిల్ 22: లైంగిక వేధింపుల బూటకపు కేసులో సీజేఐని ఇరికించేందుకు కుట్ర జరుగుతోందని న్యాయవాది ఉత్సవ్ సింగ్ బెయిన్స్ ఆరోపణ. ► ఏప్రిల్ 23: మాజీ ఉద్యోగిని ఆరోపణలపై విచారణ జరిపేందుకు జస్టిస్ బాబ్డే, జస్టిస్ రమణ, జస్టిస్ ఇందిరా బెనర్జీల అంతర్గత త్రిసభ్య విచారణ కమిటీ ఏర్పాటు. జస్టిస్ రమణ ఆ కమిటీలో ఉండటం, ఒక్కరే మహిళా జడ్జి ఉండటంపై మాజీ ఉద్యోగిని అభ్యంతరం. ఏప్రిల్ 25న విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ రమణ. దీంతో కమిటీలోకి మరో మహిళా జడ్జి జస్టిస్ ఇందూ ► ఏప్రిల్25: సీజేఐని ఇరికించేందుకు కుట్ర జరుగుతోం దన్న ఆరోపణలపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఏకే పట్నాయక్ సభ్యుడిగా ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు. లైంగిక వేధింపులపై విచారణ కాకుండా, కుట్ర కోణంపై జస్టిస్ పట్నాయక్ విచారణ జరుపుతారని వెల్లడి. ► ఏప్రిల్ 26: త్రిసభ్య కమిటీ ఎదుట రహస్య విచారణకు తొలిసారి హాజరైన మాజీ ఉద్యోగిని. మొత్తంగా మూడుసార్లు విచారణకు హాజరు. అనంతరం ఈ కమిటీతో న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదంటూ విచారణ నుంచి నిష్క్రమణ. n మే 6: సీజేఐపై ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పిన అంతర్గత త్రిసభ్య కమిటీ. -
‘అగస్టా’ కేసులో ఫిన్మెకానికా చీఫ్‌కు క్లీన్చిట్
మిలన్: అగస్టావెస్ట్‌లాండ్ కుంభకోణం కేసులో హెలికాప్టర్ తయారీ సంస్థ ఫిన్మెకానికా సంస్థ మాజీ సీఈఓను ఇటలీ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. భారత ప్రభుత్వంతో కుదిరిన రూ.3,600 కోట్ల విలువైన వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణంతో ఫిన్మెకానికా మాజీ సీఈవో గుసెప్పె ఒర్సికి సంబంధం లేదని ఇటలీ అప్పీల్ కోర్టు సోమవారం తేల్చింది. ఫిన్మెకానికా సోదర సంస్థ అయిన అగస్టావెస్ట్‌లాండ్ సీఈఓ బ్రూనో స్పాగ్నోలినీని నిర్దోషిగా పేర్కొంది. 12 వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలుకు భారత రక్షణ శాఖ, అగస్టా కంపెనీకి మధ్య ఒప్పందం కుదిరిన సమయంలో (2010 ఫిబ్రవరిలో) ఒర్సి సంస్థలో కీలక బాధ్యతల్లో ఉన్నారు. తప్పుడు లెక్కలు చూపడంతోపాటు అవినీతికి పాల్పడ్డారనే కారణంతో 2014లో ఆయన్ను అరెస్టు చేశారు. -
నెస్లే సంస్థకు ఊరట..
న్యూఢిల్లీ : ఆహార నాణ్యత ప్రమాణాలు పాటించలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న నెస్లే సంస్థకు కొంత ఊరట లభించింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ సంస్థ మాగీ న్యూడుల్స్ సురక్షితమేనని క్లీన్ చిట్ ఇచ్చింది. కేంద్ర ఆహార పరిశోధన సంస్థ శాంపిల్ టెస్టులో ప్రమాణాలు పాటించినట్లు గుర్తించింది. గోవా ఎఫ్‌డీఏ పంపించిన ఐదు శాంపిల్స్‌ను పరీక్షించి గత జూన్ లో మ్యాగీ న్యూడుల్స్పై నిషేధం విదించిన విషయం విదితమే. ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాలు 2011 పాటించిన నేపథ్యంలో తాజాగా మైసూర్ ల్యాబోరేటరీలో జరిపిన టెస్టుల ద్వారా వీటికి క్లీన్ చిట్ ఇచ్చినట్లు గోవా ఎఫ్‌డీఏ డైరక్టర్ సలీం ఏ వెల్జీ తెలిపారు.