Sushant Singh Rajput Case: Bombay High Court Suspects Priyanka Singh - Sakshi
Sakshi News home page

ఆమె పాత్రపై అనుమానాలున్నాయని వ్యాఖ్య

Published Mon, Feb 15 2021 4:58 PM | Last Updated on Mon, Feb 15 2021 5:54 PM

Sushant Rajput Sisters Holds say Bombay High Court - Sakshi

ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు విచారణ ఇంకా విచారణ సాగుతోంది. విచారణలో భాగంగా సోమవారం అత‌డి సోద‌రి మీటు సింగ్‌కు బెయిల్‌ లభించింది. అయితే మ‌రో సోద‌రి ప్రియాంక సింగ్‌కు మాత్రం షాక్‌ తగిలింది. ఆమెకు బాంబే హైకోర్టు క్లీట్ చిట్ ఇవ్వ‌లేదు. ఆమె పాత్రపై కొన్ని అనుమానాలు ఉన్నాయని హైకోర్టు అభిప్రాయ పడింది. సుశాంత్ మృతి కేసులో న‌టి రియా చ‌క్ర‌వ‌ర్తి ఓ కేసును దాఖ‌లు చేసిన విషయం తెలిసిందే.

సుశాంత్ ఇద్ద‌రు సోదరిలు మీటు సింగ్‌, ప్రియాంక సింగ్‌పై రియా కేసు నమోదు చేయించింది. ఈ కేసుపై బాంబే హైకోర్టు త‌న తీర్పులో మీటూ సింగ్‌కు ఊర‌ట క‌ల్పిస్తూ ఆదేశాలిచ్చింది. సతీశ్‌ మనేశ్‌ షిండే, ఎంఎస్ కార్నిక్‌తో కూడిన డివిజ‌న్ బెంచ్ ఈ కేసులో విచార‌ణ చేప‌ట్టింది. రియా దాఖ‌లు చేసిన ఫిర్యాదు ఆధారంగా న‌మోదైన ఎఫ్ఐఆర్‌ల‌ను సుశాంత్ సోదరిలు కొట్టివేయాలని కోర్టును కోరారు. సుశాంత్‌ అనుమానాస్ప‌ద మృతి కేసులో సోద‌రి ప్రియాంక సింగ్‌పై కొన్ని ప్రాథ‌మిక  అనుమానాలు ఉన్నాయ‌ని, ఆమెను విచార‌ణ‌కు దూరంగా ఉంచాల్సిన అవ‌స‌రం లేద‌ని కోర్టు త‌న పేర్కొన్న‌ది. దీంతో మీటుకు ఊరట లభించగా ప్రియాంకకు షాక్‌ తగిలింది.

అయితే నటి రియా డాక్ట‌ర్ త‌రుణ్ కుమార్‌పై కూడా కేసు నమోదు చేయించింది. దీనిపై ముంబై పోలీసులు కేసు న‌మోదు చేశారు. రియా చక్రవర్తి సత్యం కోసం కృషి  చేస్తుందని.. ఆమె వేదనంతా అదేనని న్యాయమూర్తి సతీశ్‌ మనేశ్‌ షిండే పేర్కొన్నారు.

హీరోయిన్‌ మెహ్రీన్‌కు కాబోయే భర్త ఎవరో తెలుసా..?

లైవ్‌లో ఏడ్చేసిన హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement