
'ఆ విషయం కేబినెట్‌లో చర్చించడం సిగ్గుచేటు'
ఒంగోలు: చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసిందని వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి విమర్శించారు. ప్రతిపక్షనేత జగన్‌పై ఎలా బురద జల్లాలి అనే దానిపై కేబినెట్‌లో చర్చించడం సిగ్గుచేటు అని ఆయన మండిపడ్డారు.
శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడిన బ్రహ్మానందరెడ్డి.. చంద్రబాబు అసెంబ్లీని తన సొంత ఆస్థిగా భావిస్తున్నారని.. బాబు అహంకార ధోరణిపై తిరుగుబాటుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.