సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను కలుపుతూ కృష్ణానదిపై నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జిని శ్రీశైలం బ్యాక్‌వాటర్‌పై బ్యారేజ్ కమ్ ఐకానిక్ బ్రిడ్జిగా నిర్మించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్సార్‌సీపీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి కోరారు. ఆయన బుధవారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై ప్రసంగించారు.
మూడు స్టేషన్ల ఆధునికీకరణకు డీపీఆర్‌లు
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు రైల్వేస్టేషన్ల ఆధునికీకరణకు వివరాణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లు తయారయ్యాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. టెక్నో–ఎకనామిక్ సాధ్యాసాధ్యాలు అధ్యయనం చేసినట్లు చెప్పారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, బాలశౌరి ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు.
ఆత్రేయపురం పూతరేకులకు జీఐకి విజ్ఞప్తి
ఆత్రేయపురం పూతరేకులకు జీఐ గుర్తింపు ఇవ్వాలని సర్ ఆర్థర్ కాటన్ ఆత్రేయపురం పూతరేకుల తయారీదారుల సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ సహాయమంత్రి సోమ్‌ప్రకాశ్ తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
నాలుగు గతిశక్తి కార్గో టెర్మినళ్ల గుర్తింపు
ఆంధ్రప్రదేశ్‌లో నాలుగుచోట్ల గతిశక్తి కార్గో టెర్మినళ్ల ఏర్పాటును గుర్తించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైల్వేయేతర ఏజెన్సీలు ఈ టెర్మినళ్లను అభివృద్ధి చేస్తున్నందున నిధులు కేటాయించలేదని వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఎన్.రెడ్డెప్ప, పి.వి.మిథున్‌రెడ్డి ప్రశ్నకు సమాధానమిచ్చారు.
1,374 హాల్‌మార్క్ ల్యాబొరేటరీలు
దేశవ్యాప్తంగా 1,374 హాల్‌మార్క్ ల్యాబొరేటరీలు పనిచేస్తున్నాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ సహాయమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి తెలిపారు. వెఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
కృష్ణపట్నం నోడ్‌కు 2,139.15 ఎకరాలు
చెన్నై–బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా కృష్ణపట్నం నోడ్‌కు సంబంధించి స్పెషల్ పర్పస్ వెహికల్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2,139.15 ఎకరాలు బదలాయించిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ సహాయమంత్రి సోమ్‌ప్రకాశ్ తెలిపారు. 12,798 ఎకరాల ప్రాజెక్టుకు సంబంధించి డిటైల్డ్ మాస్టర్ ప్లానింగ్, ప్రిలిమినరీ డిజైన్, ఇంజనీరింగ్ పూర్తయ్యాయని వైఎస్సార్‌సీపీ ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి ప్రశ్నకు జవాబిచ్చారు.
శ్రీశైలం బ్యాక్‌వాటర్‌పై బ్యారేజ్ కమ్ ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలి
Published Thu, Feb 9 2023 5:26 AM | Last Updated on Thu, Feb 9 2023 5:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment