srisailam backwaters
-
విజయవాడ నుంచి శ్రీశైలానికి గంటన్నరలో వెళ్లిపోవచ్చు!
ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం కలగలసి వెలసిన మహా పుణ్యక్షేత్రం.. ఇల కైలాసం శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి అనేకమంది భక్తులు వస్తుంటారు. ఇప్పటి వరకు అటవీ ప్రాంతంలో ఘాట్ రోడ్డు మీద ప్రయాణం ప్రతి ఒక్కరికీ గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. ఇక నుంచి భక్తులకు సరికొత్త మధురానుభూతిని కలిగించేందుకు ‘సీ ప్లేన్’ను పర్యాటక శాఖ అందుబాటులోకి తీసుకురానుంది. నీటిలో విమానం ఎక్కి.. నీటిలోనే దిగడం ఈ సీ ప్లేన్ ప్రత్యేక. అయితే, అవసరమైనప్పుడు నేలపై కూడా సీ ప్లేన్ ల్యాండ్ అవుతుంది. విజయవాడ–శ్రీశైలం మధ్య సీ ప్లేన్ నడిపేందుకు ఈ నెల 9వ తేదీన ట్రయల్ రన్ నిర్వహించనుంది.తగ్గనున్న ప్రయాణ సమయంవిజయవాడ–శ్రీశైలం మధ్య రోడ్డు మార్గంలో సుమారు 270 కిలో మీటర్లు దూరం ఉంటుందని, సీ ప్లేన్‌లో సుమారు గంటన్నర సమయంలో చేరుకునే అవకాశం ఉంటుందని పర్యాటక శాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం 14 సీటింగ్, 19 సీటింగ్ కెపాసిటీ కలిగిన రెండు సీప్లేన్లు అందుబాటులో ఉన్నాయని, ట్రయల్ రన్ తర్వాత ఖర్చు, నిర్వహణ, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎప్పటి నుంచి ప్రారంభించాలి, ఎన్ని సర్వీసులు నడపాలి, టికెట్ ఎంత వసూలు చేయాలనేది నిర్ణయిస్తామని అధికారులు తెలిపారు. తొలి దశలో విజయవాడ–శ్రీశైలం సీ ప్లేన్ విజయవంతమైతే హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల నుంచి కూడా నడిపేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.ఇదీ సీ ప్లేన్ ప్రణాళిక...సీప్లేన్ టేకాఫ్, టేకాన్‌కు నీటిలో సుమారు 1.16 కిలో మీటర్ల పొడవు, 120 మీటర్ల వెడల్పు ఉండాలి. పర్యాటకులు సీ ప్లేన్ ఎక్కేందుకు, దిగేందుకు నీటిపై ప్రత్యేక జెట్టీలు అవసరం.శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ వద్ద గల ఎస్ఎల్బీసీ టన్నెల్ సమీపంలో సీ ప్లేన్ ల్యాండ్ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ పున్నమి ఘాట్ నుంచి బయలుదేరి శ్రీశైలం డ్యామ్ వెనుక భాగంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ సమీపంలో సీ ప్లేన్ దిగుతుంది. అక్కడి నుంచి బోటులో ప్రయాణించి పాతాళగంగకు చేరుకుంటారు. పాతాళగంగ వద్ద ప్లాస్టిక్ జెట్టిపై ప్రయాణికులు దిగి రోప్‌వే ద్వారా పైకి వచ్చి శ్రీశైలం ఆలయానికి చేరుకుంటారు.తిరుగు ప్రయాణంలో మళ్లీ సీ ప్లేన్ శ్రీశైలం డ్యామ్ వెనుక భాగంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ సమీపంలో బయలుదేరి విజయవాడ పున్నమి ఘాట్‌కు చేరుతుంది. చదవండి: నా శివయ్యను దర్శనం చేసుకోనివ్వరా.. శ్రీకాళహస్తిలో అఘోరీ ఆత్మహత్యాయత్నం -
శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్‌లో గుర్రపు డెక్క
-
కృష్ణానదిలో పర్యాటకుల 'లాంచీ.. రెడీ'..!
మహబూబ్‌నగర్: ఇటీవల కురిసిన వర్షాలకు కృష్ణానదికి వరదలు రావడంతో శ్రీశైలం ప్రాజెక్టులో బ్యాక్‌వాటర్ క్రమంగా పెరుగుతోంది. దీంతో కృష్ణానది తీర ప్రాంతాలు ఆహ్లాదకరంగా మారాయి. నదీ అందాలతోపాటు ప్రకృతి సోయగాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు విచ్చేస్తున్నారు. సోమశిల సమీపంలోని కృష్ణానదిలో పర్యాటకులు విహరించేందు కోసం పర్యాటక శాఖ లాంచీలు ముస్తాబయ్యాయి. సోమశిల సమీప ప్రాంతాలతోపాటు శ్రీశైలం వరకు నదిలో ప్రయాణాలు సాగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో.. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిలలో పర్యాటక శాఖ రెండు లాంచీలను ఏర్పాటు చేసింది. ఎనిమిదేళ్ల క్రితం సోమేశ్వర అనే పేరుతో మినీ నాన్ ఏసీ లాంచీని ఏర్పాటు చేసి శ్రీశైలం వరకు నదీ ప్రయాణం కల్పించింది. అప్పట్లో లాంచీ ప్రయాణానికి పర్యాటకులు ఉత్సాహం చూపించారు. పర్యాటకుల తాకిడి పెరగడంతో 2019లో స్వదేశి దర్శన్ నిధులు రూ.2.5 కోట్లతో 120 మంది ప్రయాణించేందుకు వీలుగా మరో ఏసీ లాంచీని ఏర్పాటు చేశారు. దీనినే ప్రస్తుతం సోమశిల నుంచి శ్రీశైలం వరకు నదిలో ప్రయాణించేందుకు వినియోగిస్తున్నారు. మినీ నాన్ ఏసీ సోమేశ్వర లాంచీని మాత్రం సోమశిల పరిసర ప్రాంతాల్లోనే తిప్పుతున్నారు. సోమశిల పరిసరాల్లో.. ఈ ఏడాది వర్షాలు సరిగా కురవకపోవడంతో నదిలోకి నీరు చేరడం ఆలస్యమైంది. కొన్ని రోజులుగా శ్రీశైలం ప్రాజెక్టుకు వరద జలాలు చేరుతుండటంతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం సోమశిల సమీపంలో పుష్కర ఘాట్ల వద్దకు నీళ్లు చేరుకున్నాయి. దీంతో మినీ నాన్ఏసీ లాంచీ ప్రయాణాలను పర్యాటక శాఖ అధికారులు ప్రారంభించారు. ఇక శ్రీశైలానికి తిప్పే ఏసీ లాంచీ ప్రయాణాలు ప్రారంభమయ్యేందుకు మాత్రం కొంత సమయం పడుతుందని చెబుతున్నారు. రెండు లాంచీలను శుభ్రం చేసి నది ప్రయాణాలకు సిద్ధంగా ఉంచారు. త్వరలోనే ప్రారంభిస్తాం.. కృష్ణానదిలో పర్యాటకులు విహరించేందుకు లాంచీ ప్రయాణాలు ప్రారంభించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమశిలలోని రెండు లాంచీలను నదీ ప్రయాణాల కోసం అందుబాటులోకి వచ్చాయి. అలాగే శ్రీశైలం టూర్‌కు దాదాపుగా 70 మంది ప్రయాణికులు ఉంటేనే లాంచీ తిప్పుతాం. లేదంటే నిర్వహణ భారం మీదపడుతుంది. మినీ లాంచీ టికెట్ల ధరలో ఇప్పుడు ఎలాంటి మార్పులు లేవు. శ్రీశైలానికి తిప్పే ఏసీ లాంచీ ధరలను ఈనెలాఖరులోగా అధికారులు నిర్ణయిస్తారు. – రాజేష్‌గౌడ్, లాంచీ నిర్వహణ పర్యవేక్షకుడు టూర్‌కు పర్యాటకుల కొరత.. శ్రీశైలం లాంచీని 2019లో ప్రారంభించాక ఇప్పటి వరకు కేవలం 20 సార్లు మాత్రమే సోమశిల– శ్రీశైలం మధ్య తిప్పారు. 2019లో నాలుగు సార్లు, 2020లో 11 సార్లు తిప్పగా.. 2021లో ఒక్కసారి కూడా తిప్పలేదు. 2022లో మాత్రం 5 సార్లు లాంచీ ప్రయాణం సాగింది. శ్రీశైలానికి లాంచీలో ప్రయాణించాలంటే కనీసం 70 మంది ప్రయాణికులు ఉండాలి. లేదా రూ.1.30 లక్షలకు పైగా చార్జీల రూపంలో చెల్లించాలి. అలా అయితేనే లాంచీ ప్రయాణం ప్రారంభిస్తారు. అంతమంది ఒకేసారి రాకపోవడంతో ఆశించిన స్థాయిలో శ్రీశైలం టూర్ ప్రయాణాలు పెద్దగా సాగడం లేదు. పాతాళగంగ వరకు.. సోమశిల నుంచి శ్రీశైలం వరకు పర్యాటకులను తీసుకువెళ్లేందుకు ఏసీ లాంచీ ఏర్పాటు చేశారు. కానీ, ఇప్పుడు అది శ్రీశైలం వరకు కాకుండా ఈగలపెంట వద్దే ఆపుతున్నారు. అక్కడి నుంచి మరో 21 కి.మీ., మేరకు బస్సులో ప్రయాణించి శ్రీశైలం చేరుకోవాల్సి ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న సరిహద్దుల కారణంగా పర్యాటక శాఖ లాంచీ పాతాళగంగ వద్దకు వెళ్లడం లేదు. పర్యాటక శాఖ అధికారులు స్పందించి పాతాళగంగ వద్దకు పర్యాటకులను చేర్చేలా చర్యలు చేపట్టాలి. అలాగే నదీ ప్రయాణంలో ఒకటి లేదా రెండుచోట్ల కొద్దిసేపు పర్యాటకులు విరామం తీసుకునేలా షెల్టర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. – శ్రీనివాసులు, కొల్లాపూర్ మినీ లాంచీకి డిమాండ్.. సోమశిల పరిసరాల్లో మాత్రమే తిప్పే సోమేశ్వర లాంచీ (మినీ నాన్ఏసీ లాంచీ)లో విహరించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. ఈ లాంచీలో 15 నిమిషాలపాటు తిప్పేందుకు ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.50, చిన్నపిల్లలకు రూ.30 చొప్పున వసూలు చేస్తున్నారు. 20 మంది ప్రయాణికులు జమ అయితే ఈ లాంచీని నదిలో తిప్పుతారు. ఒకవేళ ఎవరైనా రూ.4 వేలు చెల్లిస్తే గంటపాటు వారి బృందం మొత్తాన్ని నదిలో తిప్పుతారు. ఈ ధరలు తక్కువగా ఉండడంతో చాలామంది పర్యాటకులు సోమేశ్వర లాంచీలో తిరిగేందుకు ఇష్టపడుతున్నారు. ఈ లాంచీ ద్వారా పర్యాటక శాఖకు ప్రతినెలా రూ.లక్షకుపైగా ఆదాయం లభిస్తోంది. శ్రీశైలం టూర్‌కు తిప్పే ఏసీ లాంచీ ప్రయాణ చార్జీలు అధికంగా ఉండటంతో పర్యాటకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. -
నీటి దోపిడీ కోసమే పాలమూరు–రంగారెడ్డి
సాక్షి, అమరావతి: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో అనుమతి ఇచ్చిన దానికంటే తెలంగాణ సర్కార్ భారీ ఎత్తున పనులు చేసిందని సుప్రీం కోర్టుకు కేంద్ర జల్ శక్తి శాఖ, కృష్ణా బోర్డు నివేదించాయి. తాగునీటి అవసరాల పేరుతో భారీ ఎత్తున సాగునీటి అవసరాలకు నీటిని తరలించేలా తెలంగాణ ప్రభుత్వం పనులు పూర్తి చేసిందని స్పష్టం చేశాయి. 7.15 టీఎంసీలను తాగునీటి అవసరాలకు తరలించేలా పనులు చేపట్టడానికి అనుమతి ఇస్తే.. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 120 టీఎంసీలు తరలించేలా ఎత్తిపోతలు, కాలువల వ్యవస్థ, 65.17 టీఎంసీలను నిల్వ చేసేలా 5 రిజర్వాయర్లను తెలంగాణ పూర్తి చేసిందని తేల్చిచెప్పాయి. ఇప్పటివరకూ పూర్తయిన పనులను పరిశీలిస్తే.. తెలంగాణ సర్కార్ భారీ ఎత్తున కృష్ణా జలాలను తరలించేలా చేపట్టిందని పేర్కొన్నాయి. ఆ ఎత్తిపోతలకు నీటి కేటాయింపులు లేని నేపథ్యంలో దాని డీపీఆర్‌ను మదింపు చేయలేమని తెలంగాణ సర్కార్‌కు తేల్చిచెప్పామని గుర్తు చేశాయి. ఈ మేరకు సుప్రీం కోర్టులో ఈ నెల 2న కేంద్ర జల్ శక్తి శాఖ, కృష్ణా బోర్డు సంయుక్తంగా అఫిడవిట్ దాఖలు చేశాయి. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలపై ఈ నెల 4న జరగాల్సిన విచారణను సుప్రీం కోర్టు అక్టోబర్‌కు వాయిదా వేసింది. అఫిడవిట్లో ఏం చెప్పాయంటే.. కేంద్ర జల్ శక్తి శాఖ, కృష్ణా బోర్డు సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు రెండు టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 120 టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను రూ.55,086.57 కోట్లతో తెలంగాణ సర్కార్ చేపట్టింది. ఇందులో నీటిపారుదల వ్యయం రూ.50,508.88 కోట్లు, తాగునీటి విభాగం వ్యయం రూ.4,577.69 కోట్లు. ఈ ఎత్తిపోతల కింద అంజనగిరి (8.51 టీఎంసీలు), వీరాంజనేయ (6.55 టీఎంసీలు), వెంకటాద్రి (16.74 టీఎంసీలు), కరుమూర్తిరాయ (17.34 టీఎంసీలు), ఉద్దండాపూర్ (16.03 టీఎంసీలు), కేపీ లక్ష్మిదేవిపల్లి (2.80 టీఎంసీల) రిజర్వాయర్లను చేపట్టింది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు.. ఆ జిల్లాల్లో తాగు, పారిశ్రామిక అవసరాలు తీర్చాలన్నది ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ ఎత్తిపోతల కింద తరలించే 120 టీఎంసీల్లో తాగునీటి అవసరాల కోసం కేటాయించింది 7.15 టీఎంసీలు. ఇప్పటికే 65.17 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో అంజనగిరి, వీరాంజనేయ, వెంకటాద్రి, కరుమూర్తిరాయ, ఉద్దండాపూర్ రిజర్వాయర్లను.. 120 టీఎంసీలు తరలించేలా ఎత్తిపోతలు, కాలువల వ్యవస్థను పూర్తి చేసింది. ఆరో రిజర్వాయర్ కేపీ లక్ష్మిదేవిపల్లి వద్ద ఇప్పటిదాకా చేపట్టలేదు. పూర్తయిన 5 రిజర్వాయర్ల కింద తాగునీటి అవసరాల కోసం కేటాయించింది 3.40 టీఎంసీలే. కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో అదనంగా దక్కే 45 టీఎంసీలకు, చిన్న నీటిపారుదల విభాగంలో మిగులుగా ఉన్న 45 టీఎంసీలను జతచేసి.. 90 టీఎంసీలతో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను చేపట్టామని తెలంగాణ సర్కార్ డీపీఆర్‌ను సమర్పించింది. కానీ.. ఈ ప్రాజెక్టుకు బచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేయలేదు. నీటి కేటాయింపులపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ విచారణ చేస్తున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టు డీపీఆర్‌ను మదింపు చేయలేమని తెలంగాణ సర్కార్‌కు వెనక్కి పంపాం. నేపథ్యం ఇదీ.. చంద్రమౌళీశ్వరరెడ్డి అనే రైతు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) పర్యావరణ అనుమతి తీసుకోకుండా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల పనులను నిలిపేయాలని 2021 అక్టోబర్ 29న ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను ఉల్లంఘించి యథేచ్ఛగా పనులు కొనసాగించిన తెలంగాణ సర్కార్‌పై 2022 డిసెంబర్ 22న ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్జీటీ.. ఆ రెండు ఎత్తిపోతల పథకాల వ్యయంపై 1.50 శాతం చొప్పున రూ.620.85 కోట్లను తెలంగాణ సర్కార్‌కు జరిమానా విధించింది. తెలంగాణ ఉద్దేశపుర్వకంగా చట్టాలను ఉల్లంఘిస్తున్నందున రూ.300 కోట్లు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. మొత్తం రూ.920.85 కోట్లు మూడు నెలల్లోగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) వద్ద డిపాజిట్ చేయాలని నిర్దేశించింది. దీనిపై తెలంగాణ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎన్జీటీ ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తూ.. తాగునీటి అవసరాల కోసం 7.15 టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పనులకు అనుమతిస్తూ 2023 ఫిబ్రవరి 17న సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
శ్రీశైలం బ్యాక్‌వాటర్‌పై బ్యారేజ్ కమ్ ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను కలుపుతూ కృష్ణానదిపై నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జిని శ్రీశైలం బ్యాక్‌వాటర్‌పై బ్యారేజ్ కమ్ ఐకానిక్ బ్రిడ్జిగా నిర్మించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి కోరారు. ఆయన బుధవారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై ప్రసంగించారు. మూడు స్టేషన్ల ఆధునికీకరణకు డీపీఆర్‌లు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు రైల్వేస్టేషన్ల ఆధునికీకరణకు వివరాణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లు తయారయ్యాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. టెక్నో–ఎకనామిక్ సాధ్యాసాధ్యాలు అధ్యయనం చేసినట్లు చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, బాలశౌరి ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. ఆత్రేయపురం పూతరేకులకు జీఐకి విజ్ఞప్తి ఆత్రేయపురం పూతరేకులకు జీఐ గుర్తింపు ఇవ్వాలని సర్ ఆర్థర్ కాటన్ ఆత్రేయపురం పూతరేకుల తయారీదారుల సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ సహాయమంత్రి సోమ్‌ప్రకాశ్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ప్రశ్నకు సమాధానమిచ్చారు. నాలుగు గతిశక్తి కార్గో టెర్మినళ్ల గుర్తింపు ఆంధ్రప్రదేశ్‌లో నాలుగుచోట్ల గతిశక్తి కార్గో టెర్మినళ్ల ఏర్పాటును గుర్తించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైల్వేయేతర ఏజెన్సీలు ఈ టెర్మినళ్లను అభివృద్ధి చేస్తున్నందున నిధులు కేటాయించలేదని వైఎస్సార్సీపీ ఎంపీలు ఎన్.రెడ్డెప్ప, పి.వి.మిథున్‌రెడ్డి ప్రశ్నకు సమాధానమిచ్చారు. 1,374 హాల్‌మార్క్ ల్యాబొరేటరీలు దేశవ్యాప్తంగా 1,374 హాల్‌మార్క్ ల్యాబొరేటరీలు పనిచేస్తున్నాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ సహాయమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి తెలిపారు. వెఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ ప్రశ్నకు సమాధానమిచ్చారు. కృష్ణపట్నం నోడ్‌కు 2,139.15 ఎకరాలు చెన్నై–బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా కృష్ణపట్నం నోడ్‌కు సంబంధించి స్పెషల్ పర్పస్ వెహికల్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2,139.15 ఎకరాలు బదలాయించిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ సహాయమంత్రి సోమ్‌ప్రకాశ్ తెలిపారు. 12,798 ఎకరాల ప్రాజెక్టుకు సంబంధించి డిటైల్డ్ మాస్టర్ ప్లానింగ్, ప్రిలిమినరీ డిజైన్, ఇంజనీరింగ్ పూర్తయ్యాయని వైఎస్సార్సీపీ ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి ప్రశ్నకు జవాబిచ్చారు. -
శ్రీశైలం ప్రాజెక్టులోకి పెరిగిన వరద
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం: శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కాస్త పెరిగింది. శనివారం సాయంత్రం 6 గంటలకు 87,852 క్యూసెక్కులు చేరుతోంది. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా 41,358 క్యూసెక్కులను దిగువకు వదులు తున్నారు. శ్రీశైలంలో 879.5 అడుగుల్లో 185.56 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్‌ల నుంచి 29,080 క్యూసెక్కులు, తుంగభద్ర డ్యామ్ నుంచి 31,125 క్యూసెక్కులు దిగువకు వదులుతుండటంతో ఆదివారమూ శ్రీశైలంలోకి వరద ప్రవాహం కొనసాగనుంది. శ్రీశైలం నుంచి విడుదల చేసిన జలాలతో నాగార్జున సాగర్‌లో నీటి నిల్వ 554.9 అడుగుల్లో 220.70 టీఎంసీలకు చేరుకుంది. సాగర్‌కు దిగువన మూసీలో వరద ఉధృతి తగ్గడంతో పులిచింతల్లోకి 7,852 క్యూసెక్కులు వస్తోంది. నీటి నిల్వ 40.63 టీఎంసీలకు చేరింది. ఇక్కడి నుంచి 19,587 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. పులిచింతల నుంచి దిగువకు వదులుతున్న నీటికి పాలేరు, మున్నేరు ప్రవాహం తోడవడంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 27,542 క్యూసెక్కులు చేరుతోంది. ఇక్కడి నుంచి కృష్ణా డెల్టాకు 10,197 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 17,345 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. తగ్గిన గోదావరి వరద గోదావరిలో వరద ప్రవాహం మరింతగా తగ్గింది. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద శనివారం రాత్రి నీటి మట్టం 8.80 అడుగులు ఉంది. బ్యారేజి నుంచి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు 9,800 క్యూసెక్కులు వదిలారు. 5,91,042 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచి పెట్టారు. భద్రాచలం వద్ద నీటి మట్టం శనివారం సాయంత్రం 6 గంటలకు 32.70 అడుగులకు చేరింది. పోలవరంలో 10.78 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 15.02 మీటర్ల నీటి మట్టాలు నమోదయ్యాయి. ఇదీ చూడండి: ఒక్క ఫొటో నా జీవితాన్నే మార్చేసింది -
శ్రీశైలం డ్యాం.. అందాలు చూడటానికి సిద్దమా!
శ్రీశైలం ప్రాజెక్ట్(నంద్యాల జిల్లా): శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంటుండటంతో శనివారం గేట్లు ఎత్తనున్నారు. గురువారం సాయంత్రానికి డ్యాం నీటి మట్టం 880.20 అడుగులకు చేరుకుంది. మరో 4.80 అడుగులు పెరిగితే గరిష్టస్థాయి 885 అడుగులకు చేరుకుంటుంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి 1,65,255 క్యూసెక్కుల వరద ప్రవాహం డ్యాంకు వస్తోంది. జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు సగటున 40 వేల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. శనివారం నాటికి జలాశయ నీటిమట్టం 882 అడుగులకు పైబడి చేరుకోనుంది. దీంతో ఆదే రోజు ఉదయం 11 గంటల సమయంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు శ్రీశైలం ప్రాజెక్ట్ చేరుకుని డ్యాం రేడియల్క్రస్ట్ గేట్లను తెరచి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 10 వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 597 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడిగట్టు కేంద్రంలో తాత్కాలికంగా విద్యుత్ ఉత్పాదనను నిలిపివేయగా, ఎడమగట్టు కేంద్రంలో ఉత్పాదన కొనసాగుతోంది. (క్లిక్: మగదూడ పుడితే రూ.500 వెనక్కి ఇస్తారు!) -
శ్రీశైలంలోకి కొనసాగుతున్న ప్రవాహం.. రెండు రోజుల్లో ఫుల్
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం తగ్గింది. బుధవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 2,32,164 క్యూసెక్కులు చేరుతోంది. నీటి మట్టం 877.6 అడుగులకు చేరింది. నీటి నిల్వ 176.33 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 39 టీఎంసీలు అవసరం. శనివారంనాటికి ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గడంతో కృష్ణా ప్రధాన పాయలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఆల్మట్టి, నారాయణపూర్‌ల నుంచి 78,314 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్ నుంచి 1,26,405 క్యూసెక్కులు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలంలోకి శుక్రవారం కూడా 2 లక్షల క్యూసెక్కులకంటే ఎక్కువగానే ప్రవాహం కొనసాగనుంది. సాగర్‌కు దిగువన పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో పులిచింతల ప్రాజెక్టులోకి 4,588 క్యూసెక్కులు వస్తోంది. పులిచింతలకు దిగువన పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల ప్రకాశం బ్యారేజిలోకి 16,192 క్యూసెక్కులు వస్తోంది. ఇక్కడి నుంచి కృష్ణా డెల్టాకు 8,991 క్యూసెక్కులు, సముద్రంలోకి 7,201 క్యూసెక్కులు వదులుతున్నారు. ఇదీ చదవండి: ధవళేశ్వరం, పోలవరం వద్ద తగ్గిన వరద.. శ్రీశైలం వద్ద ఉధృతి -
జూరాల, శ్రీశైలానికి భారీ ప్రవాహాలు
సాక్షి, హైదరాబాద్: గత నాలుగు రోజులుగా ఎగువ కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ల పరిధిలో కొనసాగుతున్న వర్షాలకు తోడు స్థానిక పరీవాహకంలో కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర ప్రాజెక్టుల్లోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల్లోకి పోటెత్తుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి నుంచి 52 వేల క్యూసెక్కులను దిగువనున్న నారాయణపూర్‌కు విడుదల చేస్తుండగా అక్కడి నుంచి 62 వేల క్యూసెక్కులను నదిలోకి వదిలేస్తున్నారు. దీంతో ఆదివారం సాయంత్రానికి జూరాలకు 79 వేల క్యూసెక్కులు వస్తుండగా లక్ష క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఈ నీరంతా శ్రీశైలానికి వస్తోంది. శ్రీశైలానికి 99 వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు వస్తుండటంతో అక్కడ నీటి నిల్వ 215 టీఎంసీలకుగాను 41.11 టీఎంసీలకు చేరింది. ఇక ఇక్కడి నుంచి 7 వేల క్యూసెక్కులను వదిలేస్తుండటంతో నాగార్జునసాగర్‌లోకి 9 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో అక్కడ పూర్తి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకుగాను ప్రస్తుతం నిల్వ 169.71 టీఎంసీలకు చేరింది. మరోవైపు గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల్లోకి నీటి ప్రవాహాలు తగ్గుముఖం పట్టాయి. -
కృష్ణా బోర్డే సుప్రీం
సాక్షి, అమరావతి: నీటి పంపిణీ వివాదాలకు తెర దించేలా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పరిధిని ఖరారు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. బోర్డు పరిధిపై కృష్ణా బోర్డు పంపిన ముసాయిదాపై కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ ఇప్పటికే ఆమోద ముద్ర వేశారు. అపెక్స్ కౌన్సిల్ చైర్మన్, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఈ ముసాయిదాను ఆమోదించడం ఇక లాంఛనమే. జనవరి మొదటి వారంలో కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. కృష్ణా నదీ జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు విభజన చట్టంలో సెక్షన్ 85(1) ప్రకారం కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటు చేసింది. కానీ.. పరిధిని ఖరారు చేయకపోవడం, వర్కింగ్ మాన్యువల్‌ను నోటిఫై చేయకపోవడం వల్ల బోర్డుకు ఎలాంటి అధికారాలు లేవు. దాంతో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తరచూ ఉత్పన్నమవుతున్నాయి. కృష్ణా బోర్డు ఉత్తర్వులను తుంగలో తొక్కుతూ నాగార్జునసాగర్‌లో నీటి నిల్వలు సరపడా ఉన్నా.. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ యథేచ్ఛగా తెలంగాణ సర్కార్ నీటిని తరలిస్తుండటమే అందుకు నిదర్శనం. ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీశైలంలో నీటి మట్టం తగ్గిపోవడంతో బోర్డు కేటాయింపులు ఉన్నా సరే రాయలసీమ, నెల్లూరు, చెన్నైకి నీటిని సరఫరా చేయలేని దుస్థితి నెలకొంటోంది. అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండో భేటీలో ఇదే అంశాన్ని ఎత్తిచూపిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, తక్షణమే కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కోరారు. ♦ కేడబ్ల్యూడీటీ (కృష్ణా జల వివాదాల పరిష్కార న్యాయస్థానం) –2 తీర్పును నోటిఫై చేసే వరకు బోర్డు పరిధిని ఖరారు చేయకూడదని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వాదనను కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి తోసిపుచ్చారు. అపెక్స్ కౌన్సిల్‌కు ఉన్న విచక్షణాధికారాలతో బోర్డు పరిధిని నోటిఫై చేస్తామని స్పష్టం చేశారు. ♦ కేడబ్ల్యూడీటీ–2 తీర్పు వెలువడే వరకు 2015లో కేంద్రం ఏర్పాటు చేసిన తాత్కాలిక సర్దుబాటు మేరకు ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల చొప్పున నీటి కేటాయింపులు చేస్తామని తేలి్చచెప్పారు. (కేంద్రం కోర్టులోకి ‘నియంత్రణ’) కృష్ణా బోర్డు పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులు తుంగభద్ర నదిపై.. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హెచ్చెల్సీ తుమ్మిళ్ల ఎత్తిపోతల ఎల్లెల్సీ - కేసీ కెనాల్ ఆర్డీఎస్ కృష్ణా నదిపై.. జూరాల ప్రాజెక్టు: తెలంగాణ 1.జూరాల ప్రాజెక్టు, జలవిద్యుత్కేంద్రం 2.జూరాల కుడి కాలువ, ఎడమ కాలువ 3.భీమా ఎత్తిపోతల 4.నెట్టెంపాడు ఎత్తిపోతల 5.కోయిల్‌సాగర్ ఎత్తిపోతల శ్రీశైలం ప్రాజెక్టు: ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 1.పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, (తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి) 1.కల్వకుర్తి ఎత్తిపోతల 2.కుడి విద్యుత్కేంద్రం 2.ఎడమ విద్యుత్కేంద్రం 3.హంద్రీ–నీవా (మల్యాల) 3.పాలమూరు–రంగారెడ్డి, డిండి 4.హంద్రీ–నీవా (ముచ్చుమర్రి) 4.ఎస్సెల్బీసీ 5.వెలిగొండ - నాగార్జునసాగర్: ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 1.సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ 1.సాగర్ ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్ 2.జలవిద్యుత్కేంద్రం 3.ఏఎమ్మార్పీ 4.ఎఫ్ఎఫ్సీ 5.హైదరాబాద్ తాగునీటి పథకం పులిచింతల ప్రాజెక్టు: ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 1.పులిచింతల ప్రాజెక్టు స్పిల్ వే 1.జలవిద్యుత్కేంద్రం ప్రకాశం బ్యారేజీ 1.కృష్ణా డెల్టా కాలువలు చిన్న నీటి వనరుల విభాగం: ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 1.భైరవానితిప్ప ప్రాజెక్టు 1.సీతారామభక్త ఎత్తిపోతల 2.గాజులదిన్నె ప్రాజెక్టు 2.డిండి ప్రాజెక్టు 3.మూసీ ప్రాజెక్టు 4.పాలేరు ప్రాజెక్టు.. తదితర చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు జూరాల నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు.. ► కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి షెకావత్ ఆదేశాల మేరకు ఇరు రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అక్టోబర్ 23న బోర్డు పరిధిపై ముసాయిదాను కృష్ణా బోర్డు చైర్మన్ పరమేశం కేంద్రానికి పంపారు. దిగువ కృష్ణా బేసిన్‌లోని ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌తోపాటు జూరాల, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలను బోర్డు పరిధిలోకి తేవాలని ప్రతిపాదించారు. ► ఈ ప్రాజెక్టుల స్పిల్ వే లతోపాటు జల విద్యుదుత్పత్తి కేంద్రాలు, నీటిని విడుదల చేసే రెగ్యులేటర్లు బోర్డు పరిధిలోకి తేవాలని చెప్పారు. ఇరు రాష్ట్రాల్లో చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులైన భైరవానితిప్ప, గాజులదిన్నె, డిండి, మూసీ, పాలేరు ప్రాజెక్టులు, సీతారామభక్త ఎత్తిపోతల పథకాన్ని బోర్డు పరిధిలోకి తేవాలని ప్రతిపాదించారు. ఈ ముసాయిదాపై ఇప్పటికే కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ ఆమోద ముద్ర వేశారు. ఇక ఆ శాఖ మంత్రి ఆమోద ముద్ర వేయగానే బోర్డు పరిధిని కేంద్రం నోటిఫై చేయనుంది. ► ఈ ప్రాజెక్టుల వద్ద పనిచేసే ఇరు రాష్ట్రాల అధికారులు బోర్డు పరిధిలోనే విధులు నిర్వహించాల్సి ఉంటుంది. నీటి లభ్యతను బట్టి.. కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశమై వివాదాలకు తావు లేకుండా ఇరు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేస్తుంది. () -
ఏపీతో ఎంతైనా కొట్లాడుతా
-
ఏపీతో ఎంతైనా కొట్లాడుతా
భగీరథయత్నం చేసి నీళ్లుతెస్తా పాలమూరు పర్యటనలో కేసీఆర్ ఎత్తిపోతలకు రెండు మూడు వారాల్లో శంకుస్థాపన.. త్వరలోనే నెట్టెంపాడు, కల్వకుర్తి పథకాలు పూర్తి చేస్తాం శ్రీశైలం బ్యాక్‌వాటర్స్ నుంచి మహబూబ్‌నగర్ జిల్లాకు తాగునీరు అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్, ఆహార భద్రతా కార్డులిస్తామని వెల్లడి మురికివాడల్లో విస్తృతంగా తిరిగి పరిశీలించిన ముఖ్యమంత్రి.. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తూ పర్యటన పలుచోట్ల చొరవగా ఇళ్లలోకి వెళ్లిన సీఎం చంద్రశేఖర్‌రావు ‘‘కేసీఆర్ మాట ఇవ్వడు. ఇస్తే చేసి తీరుతడని మీకు తెలుసు. మహబూబ్‌నగర్ ఎంపీగా ఉంటూనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించా. వెనుకబడిన పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు తగినంత బడ్జెట్ విడుదల చేశాం. త్వరలో పనులు పూర్తవుతాయి. అందరం కలలుకంటున్న పాలమూరు ఎత్తిపోతల పథకాలకు రెండు మూడు వారాల్లో శంకుస్థాపన చేస్తా..’’ - కేసీఆర్ సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లాతో పాటు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు భగీరథ ప్రయత్నం చేసైనా నీళ్లు తెస్తానని.. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంత పోరాటమైనా చేస్తానని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాలకు రెండు మూడు వారాల్లో శంకుస్థాపన చేస్తానని ఆయన చెప్పారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛను, ఆహార భద్రతా కార్డులు అందేలా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ పర్యటించారు. పట్టణం పరిధిలోని పలు మురికివాడల్లో తిరిగి పరిశీలించారు. అనంతరం ఇక్కడి జిల్లా పరిషత్ ప్రాంగణంలో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘కేసీఆర్ మాట ఇవ్వడు. ఇస్తే చేసి తీరుతడని మీకు తెలుసు. మహబూబ్‌నగర్ ఎంపీగా ఉంటూనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించా. వెనుకబడిన పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు తగినంత బడ్జెట్ విడుదల చేశాం. త్వరలో పనులు పూర్తవుతాయి. అందరం కలలు కంటున్న పాలమూరు ఎత్తిపోతల పథకాలకు రెండు మూడు వారాల్లో శంకుస్థాపన చేస్తా..’’ అని సీఎం ప్రకటించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు శ్రీశైలం బ్యాక్‌వాటర్స్ నుంచి వాటర్ గ్రిడ్ ద్వారా తాగునీరు అందిస్తామని చెప్పారు. మురికివాడల్లో పర్యటన.. మధ్యాహ్నం 12.30కు మహబూబ్‌నగర్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్... పట్టణంలోని పలు మురికి వాడలను సందర్శించారు. పాత పాలమూరు హరిజన్ బస్తీ, పాతతోట, రైతు బజారు, ఎర్రమన్నుగుట్ట, మాంసం మార్కెట్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తూ... పలు చోట్ల కొందరి ఇళ్లలోకి వెళ్లి వారి జీవన స్థితిగతులపై ఆరా తీశారు. హరిజన్ బస్తీ, పాతతోట, వీరన్నపేటలో స్థానికులను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. వారంతా సమావేశమై మౌలిక సౌకర్యాలతో కూడిన ఇళ్ల నిర్మాణంపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా సూచించారు. అధికారులు వారం రోజుల్లో ఆయా వాడల్లో సర్వే నిర్వహించి వన్ ప్లస్ వన్ విధానంలో కాకుండా వ్యక్తిగత ఇళ్ల నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తారని సీఎం హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి పింఛను, ఆహార భద్రతా కార్డులు అందేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. సాయంత్రం జిల్లా పరిషత్‌కు చేరుకుని పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. సమావేశం మధ్యలో.. ‘మిషన్ కాకతీయ’ అంచనాలు రూపొందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అధికారులతో సీఎం సమీక్ష ఆలస్యం కావడంతో ‘ప్రజలతో ముఖాముఖి’ కార్యక్రమ వేదిక వద్ద ప్రజలు సీఎం రావాలంటూ నినాదాలు చేశారు. దీంతో సమీక్షా సమావేశం నుంచి సీఎం మధ్యలోనే వచ్చి ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడారు. జిల్లా అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించి... తిరిగి అధికారులతో సమీక్ష సమావేశానికి వెళ్లారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి వి.శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ నిరంజన్‌రెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గువ్వల బాలరాజు, అంజయ్య యాదవ్, మర్రి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ భాస్కర్, టీఆర్ఎస్ నేతలు భేటీలో పాల్గొన్నారు.