బ్రహ్మానందరెడ్డి
హరీష్ వినయ్, అనుష్క తివారి జంటగా అనిల్ పి.జి.రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బైలంపుడి’. తార క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ పారిశ్రామికవేత్త బ్రహ్మానందరెడ్డి నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. నిర్మాత బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ– ‘‘పారిశ్రామికవేత్తగా ఉన్న నేను సినిమా మీద ఆసక్తితో తొలిసారి ‘బైలంపుడి’ చిత్రాన్ని నిర్మిస్తున్నా. ఒక మంచి సినిమా నిర్మించాలన్న కల ఈ సినిమాతో నెరవేరుతోంది.
బైలంపుడి అనే గ్రామంలో పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే రివేంజ్ డ్రామా ఇది. ప్రస్తుతం వైజాగ్ దగ్గర చోడవరంలో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది’’ అన్నారు. అతిథిగా విచ్చేసిన ‘మిస్ ఫేమ్ ఇండియా 2018’ షాలు సోని మాట్లాడుతూ– ‘‘బ్రహ్మానందరెడ్డిగారు ఒక మంచి కాన్సెప్ట్‌తో ఈ సినిమా చేస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా బావుంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు. చిత్ర ప్రమోటర్ శ్రీనివాస్ శరకడం, డైలాగ్ రైటర్ సాయి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్, కెమెరా: అనిల్‌కుమార్ పళ్ల.
Comments
Please login to add a commentAdd a comment