రుహాణి శర్మ ప్రధాన పాత్రలో హర్‌(HER).. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ | Ruhani Sharma Latest Movie HER First Look Poster Release | Sakshi
Sakshi News home page

Ruhani Sharma: రుహాణి శర్మ ప్రధాన పాత్రలో హర్‌(HER).. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Published Thu, Dec 8 2022 4:48 PM | Last Updated on Thu, Dec 8 2022 4:48 PM

Ruhani Sharma Latest Movie HER First Look Poster Release - Sakshi

చిలసౌ ఫేం రుహాణి శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న లేటెస్ట్‌ మూవీ హర్‌(HER). సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు శ్రీధర్ స్వరగావ్ రచయితగా, దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. డబుల్ అప్ మీడియాస్ సంస్థ ఫస్ట్ ప్రొడక్షన్‌గా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా చిత్రం నుంచి ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. 

ఈ పోస్టర్‌లో లీడ్ రోల్ పోషిస్తున్న రుహాణి శర్మ లుక్‌ను రిలీజ్‌ చేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఈ చిత్రం సాగనుందని ఈ పోస్టర్‌ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ పోస్టర్‌లో రుహాణి శర్మ కంటతడి పెడుతూ కనిపిండం, ఆమె వెనకాల హైవే, సిటీ పరిసరాలు చూస్తుంటే సినిమాలో అంచనాలు పెంచేస్తున్నాయి. ఇక పోస్టర్‌పై HER Chapter 1 అనే టైటిల్ వేయడం చూస్తుంటే ఈ చిత్రానికి సీక్వెల్‌ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలో ఈ సినిమా టీజర్‌ను కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement