మిత్ర శర్మ, కార్తికేయ
‘‘మిత్ర శర్మ ‘బాయ్స్’ మూవీలో హీరోయిన్ గా నటించడంతో పాటు నిర్మిస్తున్నారని విని షాక్ అయ్యాను. ఆమె ఎంతో ధైర్యంగా ప్రొడక్షన్ వైపు అడుగులు వేశారు. ఈ ‘బాయ్స్’ సినిమా శంకర్‌గారి ‘బాయ్స్’ అంత పెద్ద హిట్ అవ్వాలి’’ అని హీరో కార్తికేయ అన్నారు. మిత్ర శర్మ హీరోయిన్ గా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘బాయ్స్’. గీతానంద్ హీరోగా దయానంద్ దర్శకత్వంలో శ్రీ పిక్చర్స్ పతాకంపై రూపొందుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కార్తికేయ విడుదల చేయగా, ‘సుచిర్ ఇండియా’ కిరణ్, ‘కళామందిర్’ కళ్యాణ్‌లు శ్రీ పిక్చర్స్ పోస్టర్స్, లోగోలను రిలీజ్ చేశారు. మిత్ర శర్మ మాట్లాడుతూ– ‘‘2014లో ఇండస్ట్రీకి వచ్చిన నేను చాలా సినిమాల్లో నటించాను. దయానంద్ ఎంతో కాన్ఫిడెంట్‌గా కథ చెప్పిన విధానం నచ్చి తన కోసమే ఈ సినిమా చేస్తున్నాను’’ అన్నారు. ‘‘మిత్ర శర్మగారు నాపై పెట్టుకొన్న నమ్మకాన్ని నిలబెట్టేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు దయానంద్. ఈ చిత్రానికి సహనిర్మాత: పడవల బాలచంద్ర, సంగీతం: స్మరన్, కెమెరా: వెంకట ప్రసాద్.
Comments
Please login to add a commentAdd a comment