ఒక జవాన్‌ కథ | Actor Haranath Policherla Captain Rana Prathap First Look Poster release | Sakshi
Sakshi News home page

ఒక జవాన్‌ కథ

Published Sat, Jun 1 2019 3:08 AM | Last Updated on Sat, Jun 1 2019 3:08 AM

Actor Haranath Policherla Captain Rana Prathap First Look Poster release - Sakshi

హరినాథ్‌ పొలిచెర్ల

దర్శక–నిర్మాత హరినాథ్‌ పొలిచెర్ల వెండితెరపై జవానుగా మారారు. ఆయన టైటిల్‌ పాత్రలో నటించి, స్వీయదర్శకత్వం వహించిన చిత్రం ‘కెప్టెన్‌ రాణాప్రతాప్‌’. ‘ఎ జవాన్‌ స్టోరీ’ అనేది ఉపశీర్షిక. మిలటరీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కింది. హరినాథ్‌ ఆర్మీ ఆఫీసర్‌గా నటించారు. మూడు షెడ్యూల్స్‌తో ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. హరినాథ్‌  జవాన్‌ లుక్‌ పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు. వచ్చే నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.  సుమన్, పునీత్‌ ఇస్సార్, షాయాజీ షిండే, అమిత్, జ్యోతిరెడ్డి, నిషి, గిరి తదితరులు నటించిన ఈ సినిమాకు చరణ్‌–షకీల్‌ సంగీతం అందించారు. వంశీ ప్రకాష్‌ ఈ సినిమాకు కెమెరామెన్‌గా వ్యవహరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement