SLBC meeting
-
ఎస్‌హెచ్‌జీలకు రూ.లక్ష కోట్ల రుణాలు
సాక్షి, హైదరాబాద్: ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాలకు (ఎస్‌హెచ్‌జీలు) రూ.లక్ష కోట్లు వడ్డీ లేని రుణాల రూపంలో ఇస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గ్రామీణ ప్రాంతాలను వేగంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధి కలుగుతుందని, వారికి విరివిగా రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని బ్యాంకర్లను కోరారు. రైతు రుణమాఫీ కింద బ్యాంకులకు ప్రభుత్వం రూ.18 వేల కోట్లు జమ చేస్తే, బ్యాంకులు ఇచ్చిన కొత్త రుణాలు రూ.7,500 కోట్లు మాత్రమేనంటూ అసహనం వ్యక్తం చేశారు. రుణాల మంజూరుకు బ్యాంకర్లు మానవీయ కోణంలో చొరవ చూపాలని కోరారు. మంగళవారం ప్రజాభవన్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్రానికి వెన్నెముకగా వ్యవసాయ రంగంరూ.2 లక్షల రుణమాఫీ ద్వారా రైతులను రుణ విముక్తులను చేస్తున్నామని భట్టి చెప్పారు. ఇది వ్యవసాయ అనుబంధ రంగాలను బలోపేతం చేస్తుందని అన్నారు. వ్యవసాయ రంగాన్ని రాష్ట్రానికి వెన్నెముకగా భావిస్తున్నామని తెలిపారు. రుణమాఫీ, రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం అందజేస్తున్నామని, భారీ మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి నిధులు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయంతో పాటు పారిశ్రామిక రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్య అంశంగా పరిగణిస్తోందని చెప్పారు.ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు అమెరికా, కొరియా దేశాల్లో పర్యటించి రూ.36 వేల కోట్ల విలువైన ఎంవోయూలు కుదుర్చుకున్నారని తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ప్రాధాన్యతా రంగాల అడ్వాన్సుల విషయంలో వివిధ విభాగాల్లో బ్యాంకులు సానుకూల పనితీరును కనబరచడం హర్షణీయమన్నారు.రూ.2,005 కోట్లు పెరిగిన డిపాజిట్లుఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.2,005 కోట్ల మేరకు డిపాజిట్లు పెరిగాయని ఎస్ఎల్బీసీ కన్వీనర్, ఎస్బీఐ జనరల్ మేనేజర్ ప్రకాశ్ చంద్రబరార్ తెలిపారు. ఖరీఫ్‌లో ఇప్పటివరకు రూ.17,383 కోట్ల పంట రుణాలు మంజూరు చేశామన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.23,848 కోట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. రూ.220.49 కోట్ల మేర విద్యారుణాలు ఇచ్చినట్లు, ఎంఎస్ఎంఈలకు రూ.57.079 కోట్లు మంజూరు చేశామని వివరించారు. ప్రాధాన్యతా సెక్టార్లకు మొత్తం రూ.1,00,731 కోట్ల రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ కమల్‌ప్రసాద్ పట్నాయక్, నాబార్డు సీజీఎం సుశీలా చింతల తదితరులు పాల్గొన్నారు.సంపూర్ణ రుణమాఫీకి బ్యాంకర్లు సహకరించాలి: తుమ్మలకేవలం అంకెలు చదువుకునేందుకు మూడు నెలలకో సారి మీటింగ్‌లు పెట్టడం, బ్యాంకర్ల సదస్సు నిర్వహించడంలో అర్థం లేదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. కష్టకాలంలో కూడా ఇప్పటికే ప్రభుత్వం రూ.18 వేల కోట్లు రుణమాఫీ కింద విడుదల చేసిందని చెప్పారు. రుణ ఖాతాల్లో తప్పులు సరిది ద్దేటట్లు బ్రాంచ్ మేనేజర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వా లని కోరారు. బాధ్యతాయుతంగా వ్యవహరించి రుణ మాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తి చేయడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
సీఎం క్యాంప్ ఆఫీస్ లో SLBC మీటింగ్
-
రైతులకు మరిన్ని రుణాలందించాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో బ్యాంకులు అందిస్తున్న సహకారం అభినందనీయమని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కొనియాడారు. రైతులకు పంట రుణాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కౌలు రైతులకు మరిన్ని రుణాలు అందించాలని బ్యాంకర్లను కోరారు. సచివాలయంలో మంగళవారం రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) 220వ సమావేశం మంత్రి బుగ్గన అధ్యక్షతన జరిగింది. ఇందులో ప్రధానంగా 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక రుణ ప్రణాళిక అమలులో బ్యాంకులు సాధించిన ప్రగతి, సూచికలవారీ సాధించిన లక్ష్యాలు తదితర అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో బ్యాంకింగ్ రంగం కీలకపాత్ర పోషిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని గుర్తు చేశారు. సూక్ష, చిన్నతరహా, మధ్యతరహా రంగాలు (ఎంఎస్ఎంఈ)పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో ఆ రంగంలో కూడా బ్యాంకులు సహకరించాలని కోరారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ముందుకు రావాలన్నారు. అలాగే టిడ్కో గృహాలు, ఇతర గృహనిర్మాణ పథకాల లబ్ధిదారులకు బ్యాంకులు సకాలంలో రుణాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. స్వయం సహాయక సంఘాలకు రుణాల మంజూరులో పూర్తి తోడ్పాటు అందించాలని బ్యాంకర్లను కోరారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ నవనీత్ కుమార్ జూన్ 30 వరకు బ్యాంకులు సాధించిన ప్రగతిని వివరించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్, కంట్రీ హెడ్ ఫర్ అగ్రికల్చర్ శ్రీనివాసరావు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్.రావత్, ఎస్ఎల్బీసీ కన్వీనర్, ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఇన్చార్జి అనిల్ మిశ్రా, నాబార్డు జీఎం ఎన్ఎస్ మూర్తి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, వివిధ బ్యాంకులు, శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘పేదల ఇంటికి’ మరింత సాయం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు సాయం అందిస్తోంది. ఈ పథకం కింద 30 లక్షలకు పైగా ఇళ్లు లేని పేదలకు పక్కా ఇళ్లను ప్రభుత్వం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పేదలకు ఇళ్ల స్థలాలను ఉచితంగా పంపిణీ చేయడమే కాకుండా, ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. ఇసుక ఉచితంగా ఇస్తోంది. సబ్సిడీపై ఐరన్, సిమెంట్ ఇతర నిర్మాణ సామగ్రి ప్రభుత్వమే సమకూరుస్తోంది. మరో అడుగు ముందుకు వేసి ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు పావలా వడ్డీకే రూ.35 వేలు చొప్పున బ్యాంక్ రుణాలను అందిస్తోంది. తొలి దశలో 15.60 లక్షల ఇళ్లను రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్మిస్తోంది. వీటి నిర్మాణం చురుగ్గా సాగుతుంది. ఇళ్లు నిర్మించుకుంటున్న 4,38,868 మంది లబ్ధిదారులకు ఇప్పటివరకు రూ.1,548.24 కోట్లు బ్యాంకుల నుంచి రుణంగా ఇప్పించింది. ఈ రుణాల మంజూరుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. రుణాలు సకాలంలో మంజూరయ్యేలా సమన్వయం కోసం ప్రత్యేకంగా క్షేత్ర స్థాయిలో సిబ్బందికి బాధ్యతలు అప్పగించింది. మరో వైపు గృహ రుణం మంజూరులో కీలకమైన సిబిల్ స్కోర్ అడ్డంకిగా మారిందని ప్రభుత్వం గుర్తించింది. కొద్ది రోజుల క్రితం నిర్వహించిన ఎస్ఎల్బీసీ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం సిబిల్ స్కోరు విషయాన్ని బ్యాంకుల దృష్టికి తీసుకెళ్లింది. సిబిల్ స్కోర్ నుంచి మినహాయించాలని కోరింది. ఈ అంశాన్ని పరిశీలించిన ఎస్ఎల్బీసీ.. ఈ గృహాల లబ్ధిదారులకు సిబిల్ స్కోర్ నుంచి మినహాయింపునిస్తూ ఆదేశాలివ్వడం గమనార్హం. దీంతో ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ లబ్ధిదారులకు సులభంగా పావలా వడ్డీకి రుణాలు లభిస్తున్నాయి. -
కౌలు రైతులకు రుణాలపై మరింత దృష్టి
సాక్షి, అమరావతి: కౌలు రైతులకు రుణాల మంజూరుపై బ్యాంకర్లు మరింత దృష్టి సారించాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కోరారు. శుక్రవారం సచివాలయంలో ఆయన ఆధ్వర్యంలో 218వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. బ్యాంకుల సహకారం ప్రభుత్వానికి బాగా లభిస్తోందని, ఇదే తోడ్పాటును ఇక ముందూ అందించాలని కోరారు. వార్షిక రుణ ప్రణాళికలో బ్యాంకులు ఇప్పటివరకు మంచి ప్రగతిని సాధించాయని అభినందించారు. అలాగే సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగం తమ ప్రభుత్వానికి చాలా ముఖ్యమని.. దీనికి ఇతోధికంగా సహకారం అందించాలని కోరారు. జగనన్న కాలనీలు, వైఎస్సార్ చేయూత పథకాలకు బ్యాంకులు సహాయ సహకారాలు అందించాలన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీలకు ఆర్థిక సాయాన్ని పెంచాలని.. వారికి అందించే పథకాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రైవేటు బ్యాంకులూ భాగస్వాములు కావాలి.. ప్రభుత్వ బ్యాంకులతోపాటు ప్రైవేట్ బ్యాంకులు కూడా పథకాల్లో భాగస్వాములు కావాలని.. తద్వారా రాష్ట్ర ప్రగతికి తోడ్పాటు అందించాలని మంత్రి బుగ్గన సూచించారు. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. ఆర్బీకేల ద్వారా బ్యాంకు రుణం పొందేలా ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకురానుందని తెలిపారు. దీనికి బ్యాంకులు సహకారం అందించాలని కోరారు. సహకార బ్యాంకుల పురోభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. వాటికి కావాల్సిన షేర్ క్యాపిటల్ రూ.270 కోట్లకు కూడా సహకారం అందించామన్నారు. ఎస్ఎల్బీసీ కన్వీనర్ వి.బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ.. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన సాగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పాలన వికేంద్రీకరణకు దోహదం చేస్తుందన్నారు. అంతేకాకుండా రాష్ట్రం మరింత అభివృద్ధి చెందడానికి ఊతం ఇస్తుందని తెలిపారు. ప్రయోగాత్మకంగా 13 ప్రాంతాల్లోని ఆర్బీకేల వద్ద ఏటీఎంలను ఏర్పాటు చేసేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు చేపట్టిందన్నారు. ఇవి రైతులు గ్రామాల్లో బ్యాంకు సేవలు పొందడానికి దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఆర్థిక శాఖ ప్రత్యేక సీఎస్ ఎస్ఎస్ రావత్, ఆర్బీఐ జీఎం యశోద బాయి, నాబార్డు జీఎం రమేష్ బాబు, ఇతర బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
సహకార రంగం పునర్వ్యవస్థీకరణ
సాక్షి, అమరావతి: ఎన్నికల హామీ మేరకు సహకార రంగాన్ని అవినీతికి తావులేకుండా పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. కొత్తగా తెచ్చిన హెచ్ఆర్ పాలసీకి అనుగుణంగా ఐదేళ్లు పూర్తయిన ప్రతి ఒక్కరినీ త్వరలో బదిలీ చేయనున్నట్లు తెలిపారు. క్యాడర్ వారీగా ఉద్యోగుల జీతభత్యాలను సరిచేస్తున్నట్లు వివరించారు. మండలానికో సహకార బ్యాంక్ ఏర్పాటు చేసి రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా ఆర్బీకేల స్థాయిలో ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలను వికేంద్రీకరిస్తున్నట్లు తెలిపారు. రికార్డుల ట్యాంపరింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు పీఏసీఎస్ స్థాయిలో కంప్యూటరైజేషన్ చేస్తున్నట్లు చెప్పారు. విజయవాడలోని ఓ çహోటల్లో బుధవారం డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ల పునశ్చరణ సదస్సుకు కన్నబాబు హాజరై మాట్లాడారు. గత పాలకులు సహకార చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకొని పీఏసీఎస్‌లు, సహకార బ్యాంకులను జేబు సంస్థలుగా మార్చుకొని అడ్డగోలుగా దోచుకు తిన్నారని చెప్పారు. నకిలీ డాక్యుమెంట్లతో కాజేసిందంతా కక్కిస్తామని, ఎవరినీ వదలబోమని స్పష్టం చేశారు. హోదా రాజకీయ పదవి కాదు బ్యాంకులకు నష్టం చేకూర్చేవారిని ఉపేక్షించొద్దని ఇటీవల ఎస్ఎల్బీసీ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ స్పష్టమైన ఆదేశాలిచ్చారని మంత్రి కన్నబాబు గుర్తు చేశారు. కొత్తగా నియమితులైన చైర్మన్లు తమ హోదాను రాజకీయ పదవిగా భావించవద్దని సూచించారు. ఆడిటింగ్ వ్యవస్థను పటిష్టం చేసి అక్రమాలు వెలుగు చూసిన బ్యాంకుల పరిధిలో ఆడిటర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. పీఏసీఎస్, డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని వెల్లడించారు. ఈసారి పాలక మండళ్లల్లో సహకార రంగ నిపుణులను డైరెక్టర్లుగా నియమించేలా చట్టంలో మార్పులు తీసుకొస్తున్నామని చెప్పారు. డీసీసీబీ–డీసీఎంఎస్‌ల అభివృద్ధికి రోడ్ మ్యాప్ డీసీసీబీలు, డీసీఎంఎస్‌లపై ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఆధారంగా ప్రక్షాళనకు రోడ్‌మ్యాప్ రూపొందిస్తామని మంత్రి కన్నబాబు తెలిపారు. నాడు–నేడు పథకం కింద వీటి అభివృద్ధికి కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. వాణిజ్య బ్యాంకులకు ధీటుగా పంట రుణాలివ్వాలని సూచించారు. సదస్సులో ఆప్కాబ్ చైర్మన్ మల్లెల ఝాన్సీరాణి, మార్క్‌ఫెడ్ చైర్మన్ నాగిరెడ్డి, మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ మధుసూదన్‌రెడ్డి, ఆర్సీఎస్ కమిషనర్ అహ్మద్‌బాబు, మార్కెటింగ్ శాఖ కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న, ఆప్కాబ్ ఎండీ శ్రీనాథ్‌రెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తదితరులు పాల్గొన్నారు. -
48 గంటల్లోనే రుణాలు
సాక్షి, అమరావతి: డాక్యుమెంట్లన్నీ సక్రమంగా ఉంటే ఏ రుణమైన 48 గంటల్లోనే ఇస్తామని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) కన్వీనర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని యూబీఐ బ్రాంచ్ మేనేజర్లతో విజయవాడలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని యూబీఐ వివిధ రకాల రుణ సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చిందని చెప్పారు. గృహ, వాహన, విద్యా, వ్యక్తిగత, తనఖాపై రుణాలను అందిస్తున్నామని చెప్పారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు ఎంఎస్ఎంఈ రుణాలు అందిస్తామన్నారు. బ్యాంక్ రీజినల్ మేనేజర్ వేగే రమేష్, డిప్యూటీ జోనల్ హెడ్ శ్రీనివాసులురెడ్డి, డిప్యూటీ రీజనల్ హెడ్ సుందర్, ఏజీఎం సుబ్రహ్మణ్యం, లోన్ పాయింట్ హెడ్ జేఎస్ఆర్ మూర్తి పాల్గొన్నారు. -
సాగుకు రూ.లక్షన్నర కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్లు సమకూర్చేందుకు కొత్తగా నిర్మిస్తున్న 17 వేలకుపైగా కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు బ్యాంకులు సహకారం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. విద్య, వైద్య–ఆరోగ్య రంగంలో నాడు–నేడు ద్వారా మౌలిక సదుపాయాల కల్పన, గ్రామాల్లో వ్యవసాయ అనుబంధ రంగాల్లో మౌలిక వసతులు, మహిళా సాధికారత కోసం చేపట్టిన వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాలకు బ్యాంకులు సహాయ సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. కౌలు రైతులకు ఇతోధికంగా రుణాల మంజూరుపై దృష్టి సారించాలని బ్యాంకర్లకు సూచించారు. రుణాల పంపిణీ లక్ష్యాల కన్నా అధికంగా చేపట్టినా అగ్రి ఇన్ఫ్రా, వ్యవసాయ అనుబంధ రంగాలు, గృహాలు, విద్య అంశాల్లో రుణాల మంజూరు పెరగాల్సి ఉందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సోమవారం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ 215వ సమావేశం జరిగింది. 2021 – 22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.2,83,380 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఇందులో వ్యవసాయ రంగానికి రూ.1,48,500 కోట్ల మేర రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ధారించారు. వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, పరిశ్రమలశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవెన్, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్.రావత్, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, ఆర్ధిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, వ్యవసాయశాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్, సెర్ప్ సీఈవో రాజాబాబు, రాష్ట్ర ఎస్ఎల్బీసీ కన్వీనర్ వి.బ్రహ్మానందరెడ్డి, నాబార్డు సీజీఎం సుధీర్‌కుమార్ జన్నావర్‌తో పాటు వివిధ బ్యాంకులకు చెందిన ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్బీఐ జీఎం యశోదాబాయి హాజరయ్యారు. ఎస్ఎల్బీసీ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ.. వృద్ధిలో బ్యాంకుల పాత్ర మరువలేనిది కోవిడ్‌తో ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అనూహ్య పరిస్థితులు తలెత్తాయి, వైరస్ ఉధృతిని అడ్డుకునేందుకు కర్ఫ్యూ లాంటి నియంత్రణలు అమలు చేస్తున్నాం. కర్ఫ్యూ పొడిగించడం వల్ల ఆర్ధికంగానూ పెనుభారం పడింది. అయినప్పటికీ రుణాల పంపిణీలో నిర్దేశించుకున్న లక్ష్యాల కన్నా అధికంగానే చేపట్టాం. ప్రాధాన్యత రంగాల్లో 105 శాతం, వ్యవసాయ రంగంలో 114.16 శాతం లక్ష్యాలను చేరుకున్నాం. ఈ వృద్ధిని సాధించడంలో బ్యాంకుల పాత్ర మరువలేనిది. కానీ కొన్ని అంశాల్లో బ్యాంకుల సమర్థత పెరగాల్సి ఉంది. అగ్రి ఇన్ఫ్రా, వ్యవసాయ అనుబంధ రంగాలు, గృహాలు, విద్య అంశాల్లో పెరగాల్సి ఉంది. స్కూళ్లు, ఆస్పత్రుల అభివృద్ధి.. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులలో నాడు – నేడు కింద పెద్ద ఎత్తున అభివృద్ధి పనులను చేపట్టాం. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాం. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియంతోపాటు సీబీఎస్ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నాం. ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లు సమాజానికి భారం కాదు. ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలు తిరిగి వస్తున్నారు. పాఠశాలల్లో ఇది ఉద్యమంలా సాగుతోంది. తొలిదశలో 15,650 స్కూళ్లను నాడు – నేడు కింద అభివృద్ధి చేశాం. ఇప్పుడు రెండో దశ కింద పనులు చేపట్టి సుమారు 16 వేల స్కూళ్లను బాగు చేస్తున్నాం. స్కూళ్లలో మౌలిక సదుపాయలను గణనీయంగా మెరుగుపర్చుతున్నాం. మనకు మహా నగరాలు లేకపోవడంతో.. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి టైర్ – 1 నగరాలు మన రాష్ట్రంలో లేవు. అత్యుత్తమ వైద్యం కోసం ఆ నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి. అందుకనే మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు గ్రామ స్ధాయిలో విలేజ్ క్లినిక్స్ నుంచి పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు మొదలుకుని టీచింగ్ ఆస్పత్రుల వరకూ అభివృద్ధి పనులు చేపట్టాం. 16 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక టీచింగ్ ఆస్పత్రి ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టాం. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, నిపుణులైన వైద్యుల సేవలను పార్లమెంటు నియోజకవర్గ స్ధాయిలో ప్రజలకు అందుబాటులో తెస్తున్నాం. వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు అన్నదాతలకు సొంత ఊరిలోనే విత్తనాల నుంచి విక్రయాల దాకా అన్ని సేవలను అందించేందుకు గ్రామ స్ధాయిలో రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చాం. దాదాపు 10 వేలకు పైగా ఆర్బీకేలను ఏర్పాటు చేశాం. ప్రతి రెండు వేల జనాభాకు ఒక ఆర్బీకేను పెట్టాం. నాణ్యమైన, ధృవీకరించిన విత్తనాల దగ్గరనుంచి, పండించిన పంటను అమ్మేంత వరకూ రైతుకు చేదోడు వాదోడుగా ఆర్బీకేలు నిలుస్తాయి. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నాం. ఆర్బీకేల ద్వారా గ్రామ స్ధాయిలో అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మెరుగుపర్చేందుకు గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీలు సహా అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాం. పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. మహిళా సాధికారితలో మూడు పథకాలు.. మహిళా సాధికారితకు పెద్దపీట వేస్తూ అనేక చర్యలు తీసుకున్నాం. వరుసగా నాలుగు సంవత్సరాల పాటు చేయూత, ఆసరా పధకాల ద్వారా అదుకుంటున్నాం. లబ్ధిదారులైన మహిళలకు స్థిరంగా నాలుగేళ్లపాటు చేతిలో డబ్బులు పెడుతున్నాం. మహిళలు వారి పిల్లలను తమతో పాటు పనికి తీసుకెళ్లకుండా స్కూళ్లకు పంపించేలా స్ఫూర్తి నింపేందుకు తొలిసారిగా అమ్మ ఒడి కింద ఏటా డబ్బులు కూడా ఇస్తున్నాం. ఈ మూడు పథకాలు మహిళా సాధికారితలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. 17 వేలకు పైగా కొత్త కాలనీల నిర్మాణం.. కొత్తగా 17 వేల గ్రీన్‌ఫీల్డ్ కాలనీలను నిర్మిస్తున్నాం. తద్వారా 28.30 లక్షల ఇళ్లను పేదల కోసం నిర్మించబోతున్నాం. సోషల్ ఆడిట్ నిర్వహించి ,గ్రామ సచివాలయాల ద్వారా పారదర్శక పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేశాం. ఈ ఏడాది 15.60 లక్షలకుపైగా ఇళ్లను ఈ 17 వేల కాలనీల్లో తొలివిడతలో నిర్మిస్తున్నాం. వచ్చే ఏడాది మరో 12.08 ఇళ్లను నిర్మించబోతున్నాం. కాలనీల్లో మౌలిక సదుపాయాలు ఈ కాలనీలు మురికివాడలుగా మారకూడదు. అందుకనే పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, ఇతర సోషల్ ఇన్ఫ్రాను కూడా కల్పిస్తున్నాం. రానున్న మూడేళ్లలో దీనికోసం దాదాపుగా రూ.34 వేల కోట్లు ఖర్చు చేస్తాం. ఈ అంశాల్లో బ్యాంకుల సహకారం కావాలి. 28.30 లక్షల ఇళ్ల నిర్మాణం ద్వారా ఈ 17 వేల కాలనీలను అన్ని వసతులతో సుందరంగా తీర్చిదిద్దుతాం. రీ స్టార్ట్, నవోదయం.. ఎంఎస్ఎంఈల కోసం రీ స్టార్ట్, నవోదయం కార్యక్రమాలను తెచ్చి రుణాల పునర్ వ్యవస్థీకరణ కార్యక్రమం చేపట్టాం. కోవిడ్ సమయంలో వాటికి చేయూతనిచ్చి నడిపించాల్సిన అవసరం ఉంది. కౌలు రైతులకు రుణసాయం కౌలు రైతులకు రుణాల సదుపాయంపై కూడా దృష్టిపెట్టాలని బ్యాంకులను కోరుతున్నా. వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. గ్రామాల స్థాయిలో ఆర్బీకేలున్నాయి. ఇ– క్రాపింగ్ కూడా గ్రామ సచివాలయాల స్థాయిలోనే చేస్తున్నాం. ప్రతి కార్యక్రమం పారదర్శకంగా చేస్తున్నాం. వీటిని దృష్టిలో ఉంచుకుని కౌలు రైతులకు రుణాలపై బ్యాంకులు మరింత దృష్టి సారించాలని కోరుతున్నా. అడ్డంకులు ఎదురైనా సంక్షేమం ఆగలేదు.. – ముఖ్యమంత్రి జగన్ దార్శనిక పాలనతో టాప్ 5 రాష్ట్రాల్లో ఏపీ – రాష్ట్రంలో లక్షలాదిగా పేదల ఇళ్ల నిర్మాణాలు.. కౌలు రైతులను ఆదుకుందాం – ఎస్ఎల్బీసీ చైర్మన్, యూనియన్ బ్యాంకు ఎండీ, సీఈవో రాజ్‌కిరణ్ రాయ్ కోవిడ్ విపత్తు సమయంలో ప్రజలకు చేయూతనిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు చర్యలు తీసుకున్నారని ఎస్ఎల్బీసీ చైర్మన్, యూనియన్ బ్యాంకు ఎండీ, సీఈవో రాజ్‌కిరణ్ రాయ్ పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశానికి ఆయన వర్చువల్ విధానంలో హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి దార్శనిక పాలనతో సుస్థిర ఆర్థికాభివృద్ధి లక్ష్యాలపై 2020 సంవత్సరానికిగాను నీతి ఆయోగ్ విడుదల చేసిన ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ 5 రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచిందని ప్రశంసించారు. దీనికి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. కోవిడ్‌తో పలు అడ్డంకులు ఎదురైనా ప్రజలను ఆదుకునే సంక్షేమ పథకాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం పక్కకు వెళ్లకపోవడం గుర్తించదగ్గ అంశమన్నారు. పేదల కోసం జగనన్న కాలనీల పేరుతో ఆంధప్రదేశ్ ప్రభుత్వం లక్షలాది ఇళ్లను నిర్మిస్తోందని, ఇది బ్యాంకులకు మంచి అవకాశమని పేర్కొన్నారు. కౌలు రైతులను ఆదుకోవడంపై బ్యాంకులు దృష్టి సారించాలన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో సేవలను అందించడంపై బ్యాంకుల బ్రాంచీలు దృష్టి పెట్టాలన్నారు. ఆత్మనిర్భర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలను ప్రకటించిందని, ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టి లక్ష్యాలను అందుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. వ్యాక్సినేషన్లో బ్యాంకు సిబ్బందికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. లక్ష్యాన్ని మించి రుణాలు – 2020–21లో ప్రాథమిక రంగం లక్ష్యం రూ.1,87,550 కోట్లు కాగా 105.3 శాతం లక్ష్య సాధన. రూ.1,96,982 కోట్ల మేర రుణ వితరణ. – వ్యవసాయరంగంలో 114.16 శాతం లక్ష్య సాధన. రూ.1,28,660 కోట్ల లక్ష్యానికి గానూ రూ.1,46,879 కోట్లు రుణాల మంజూరు. – ఎంఎస్ఎంఈ రంగానికి రూ.39,600 కోట్లకుగానూ రూ.40,312 కోట్ల మేర రుణాలు. అనుకున్న లక్ష్యాన్ని దాటి 101.8 శాతం మంజూరు. – నాన్ ప్రయార్టీ రంగం కింద రూ.64.050 కోట్లకుగానూ రూ.90,652 కోట్ల మేర మంజూరుతో 141.53 శాతం రుణాలు. 2021 – 22 వార్షిక రుణ ప్రణాళిక ఇలా – 2021 – 22 రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళిక మొత్తం రూ.2,83,380 కోట్లు – వ్యవసాయ రంగ రుణాల లక్ష్యం రూ.1,48,500 కోట్లు (54 శాతం) – మొత్తంగా ప్రాథమిక రంగానికి రూ.2,13,560 కోట్ల రుణాలు లక్ష్యం (వార్షిక రుణ ప్రణాళికలో ఇది 75.36 శాతం) బ్యాంకులపై ఒత్తిడి తగ్గింది – ఇప్పుడు బ్రాంచ్‌ల వద్ద ధర్నాలు లేవు: బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బ్యాంకింగ్ రంగానికి మంచి వాతావరణం సృష్టించారని ఎస్ఎల్బీసీ కన్వీనర్ బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. రైతు భరోసాతోపాటు సకాలంలో బీమా పరిహారం రైతులకు అందుతోందన్నారు. చేయూత, ఆసరాతోపాటు పలు పథకాలు లబ్ధిదారులకు చేరుతుండటంతో బ్యాంకర్లపై ఒత్తిడి తగ్గిందన్నారు. రెండు మూడేళ్ల క్రితం పలు బ్రాంచ్‌ల వద్ద ధర్నాలు జరిగేవని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి జగన్ దూరదృష్టితో అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. గర్భిణిల నుంచి అంతిమ దశ వరకు ఈ కోవలో ఉన్నాయని చెప్పారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, ఇళ్లపై ముఖ్యమంత్రి తీసుకున్న శ్రద్ధ ప్రశంసనీయమని, ఇవన్నీ బ్యాంకింగ్ రంగానికి విలువ జోడిస్తున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి కాంక్షిస్తున్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రణాళిక త్వరలోనే సాకారమవుతుందన్నారు. -
రైతుల ఆదాయం రెట్టింపు చేయాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రైతులకు 99 శాతం పంటరుణాలు ఇచ్చారని, వారి ఆదాయం రెట్టింపుపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం 213వ ఎస్ఎల్బీసీ సమావేశం నిర్వహించారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, గౌతమ్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ విపత్తులు వచ్చినప్పుడు రైతులను ఆదుకోవాలన్నారు. పెట్టుబడి వ్యయం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, రైతు భరోసా ద్వారా రూ.13,500 చెల్లిస్తున్నామని సీఎం పేర్కొన్నారు(చదవండి:అక్క చెల్లెమ్మలు బాగుంటేనే రాష్ట్రం బాగు) ‘‘వడ్డీలేని రుణాల కింద గతంలో ఉన్న బకాయిలను చెల్లించాం. పంటల బీమా రూపంలో రైతులపై భారం లేకుండా చేశాం. రైతులు కట్టాల్సిన ప్రీమియంను మేమే కడుతున్నాం. 10,641 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. విత్తనం నుంచి పంట అమ్మేవరకూ ఆర్బీకేలు రైతులకు అండగా ఉంటాయి. కౌలు రైతులకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావాలి. ప్రస్తుతం ఇస్తున్న రుణాలు ఆశాజనకంగా లేవు. జగనన్న తోడు కింద చిరువ్యాపారులకు రూ.10వేలు వడ్డీలేని రుణాలిస్తున్నామని’’ సీఎం తెలిపారు(చదవండి:‘భూ’ చరిత్రలో సువర్ణాధ్యాయం) సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ‘‘అసంఘటిత రంగంకూడా ఆర్థిక వ్యవస్థకు దోహదం చేస్తోంది. ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక వడ్డీలకు రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గుర్తించిన ఈ చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డు కూడా ఇస్తున్నాం. వారు ఏపని చేస్తున్నారో కూడా గుర్తిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వీరు చెల్లించాల్సిన వడ్డీలు చెల్లిస్తుంది. వడ్డీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఉంటుంది. చిరు వ్యాపారుల జీవితాలను మార్చడానికి బ్యాంకర్లు ముందడుగు వేయాలి. ఆసరా, చేయూతల ద్వారా మహిళల స్వయం సాధికారితకు అడుగులు వేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల జీవితాలను మార్చేలా కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న మహిళలు కుటుంబంలో అత్యంత ప్రభావంతమైన మహిళలు, లబ్ధిదారైన మహిళకు నాలుగేళ్లపాటు నాలుగు దఫాల్లో రూ.75 వేలు అందుతాయి. ప్రతి ఏటా రూ.18750లు అందుతాయి. ఇప్పటికే ఒక ఏడాది ఇచ్చాం, తర్వాత మూడు సంవత్సరాలు కూడా ఇస్తాం. ఈ డబ్బు గ్యారెంటీగా ప్రభుత్వం ఇచ్చే సొమ్ముగా బ్యాంకర్లు పరిగణలోకి తీసుకోవాలి. ఈ డబ్బు వారి జీవితాలను మార్చేందుకు ఉపయోగపడాలి. దీని కోసం అమూల్, అలానా, ఐటీసీ, ప్రాక్టర్ అండ్ గాంబల్, హెయూఎల్, రియలన్స్ లాంటి ప్రఖ్యాత సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం. మహిళలకు నష్టం రాకుండా, వారి కాళ్లమీద వారు నిలబడేలా కార్యక్రమాలు రూపొందించాం. వారు ఎంపిక చేసుకున్న వ్యాపారాలకు బ్యాంకర్లు ముందుకు రావాలి. ఈ ప్రాజెక్టుకు బ్యాంకర్లు ముందుకు రావాలి, గట్టిగా మద్దతు పలకాలి. సమిష్టి కృషితో ముందుకు సాగాలి. చేయూత, ఆసరా మహిళలకు అండగా నిలబడ్డానికి గ్రామ, వార్డు స్థాయిల్లో కమిటీలను కూడా ఏర్పాటు చేశాం. ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పంపిణీకి షెడ్యూల్ ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటికే పంపిణీ ప్రారంభమైంది. ఆ షెడ్యూల్ ప్రకారం మహిళలకు సహాయం అదించేలా బ్యాంకర్లు కార్యాచరణ చేసుకోవాలి. ప్రభుత్వాధికారులు కూడా షెడ్యూల్ ప్రకారం పంపిణీ జరిగేలా బ్యాంకర్లతో అనుసంధానం చేసుకోవాలి. స్వయం సహాయక సంఘాలు 2020–21 ఏడాదికి తమ ఖాతాల్లో రూ.7500 కోట్లు జమచేశాయి. కాని బ్యాంకులు ఇస్తున్న వడ్డీ కేవలం రూ.3 శాతం. కాని అదే బ్యాంకులు సుమారు 11 శాతం, 13 శాతం వడ్డీలు వసూలు చేస్తున్నాయి. సకాలానికి కట్టే రుణాలపై ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తున్న విషయాన్ని బ్యాంకులు పరిగణలోకి తీసుకోవాలి. మహిళలను మరింత చైతన్య పరిచేలా బ్యాంకులు ముందుకు వెళ్లాలని బ్యాంకర్లను కోరుతున్నా. ఇక కుటుంబంలో ఒక మహిళ తన కాళ్లమీద తాను నిలబడిగలిగితే.. ఆ కుటుంబం వృద్ధిలోకి వస్తున్నట్టే.. ఎంఎస్ఎంఈలకు అండగా నిలబడాలి. వారికి తోడ్పాటునందించాలి, అప్పుడే ఆర్థిక వ్యవస్థకూడా బాగుంటుంది. ప్రతి ఎంఎస్ఎంఈలో కనీసం 10 మంది జీవనోపాధి పొందుతున్నారు. వారికి సహాయం అందించడంలో, రుణాలు రీస్ట్రక్చర్లో సహాయం చేయాలి. లక్ష్యాలను చేరుకోవాలి. 2014 నుంచి పరిశ్రమలకు రాయితీల బకాయిలను సుమారు రూ.1100 కోట్లు చెల్లించాం. అలాంటే ఫిక్స్ కరెంటు ఛార్జీల విషయంలో కూడా ఆదుకున్నాం. బ్యాంకులనుంచి కూడా వారికి పూర్తి సహాయ సహకారాలు అందించాలి టిడ్కో ఇళ్లను వీలైనంత త్వరగా ప్రభుత్వం పూర్తిచేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 2.69 లక్షల యూనిట్లను 2021 డిసెంబర్, 2022 డిసెంబర్‌లోనూ విడతలుగా పూర్తిచేస్తుంది. దీనికి బ్యాంకర్లు తమ వంతు సహకారం అందించాలని’’ సీఎం జగన్ పేర్కొన్నారు. -
అన్ని పథకాలకు అండగా నిలుస్తాం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అన్ని పథకాలకు పూర్తి అండగా నిలుస్తామని, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి రుణాలు అందించడంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చూపబోమని బ్యాంక్ అధికారులు వెల్లడించారు. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన 212వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ విజ్ఞఫ్తికి బ్యాంకర్లు సానుకూలంగా స్పందించారు. బ్యాంకులు ముందుంటాయి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. దేశంలోనే తొలిసారిగా చిరు వ్యాపారులు, హస్తకళల కళాకారులకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ దిశగా సహాయం చేయడానికి బ్యాంకులు కూడా ముందుకు వస్తాయి. – జి.రాజ్‌కిరణ్‌రాయ్, ఎస్ఎల్బీసీ అధ్యక్షుడు వైఎస్సార్ జిల్లాలో నూరు శాతం డిజిటలైజేషన్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలకు పూర్తి అండగా నిలుస్తాము. వైఎస్సార్ కడప జిల్లాలో నూటికి నూరు శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. లక్ష్యానికి అనుగుణంగా దాన్ని పూర్తి చేస్తాం. – వి.బ్రహ్మానందరెడ్డి, ఎస్ఎల్బీసీ కన్వీనర్ కోవిడ్ సంక్షోభంలోనూ పథకాలు కోవిడ్ సంక్షోభంలో కూడా సీఎం ఏ ఒక్క పథకాన్ని నిర్లక్ష్యం చేయలేదు. ఆర్బీకేల వద్ద బ్యాంక్ సేవలు కూడా అందాలి. అదే విధంగా కౌలు రైతుల సమస్యలు కూడా బ్యాంకులు పట్టించుకోవాలి. – కె.కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి ఎంఎస్ఎంఈలను ఆదుకున్నాం కోవిడ్ సంక్షోభంలోనూ ఎంఎస్ఎంఈలకు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రోత్సాహకాలను సీఎం విడుదల చేశారు. ఆ నిధుల వల్ల ఎంఎస్ఎంఈ రంగం నిలదొక్కుకోగలిగింది. – మేకపాటి గౌతమ్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి బ్యాంకుల భాగస్వామ్యం వల్లే సఫలీకృతం బ్యాంకుల భాగస్వామ్యం వల్లే అన్ని పథకాలు సఫలీకృతం అవుతున్నాయి. బ్యాంకులు అన్ని విధాలుగా సహకరిస్తున్నాయి. కోవిడ్ సమస్య ఉన్నప్పటికీ ఆరోగ్య, విద్యా రంగాలలో ఎక్కడా వెనుకబాటు లేదు. అన్ని పథకాలు అమలు చేస్తున్నాం. పంటల ఈ–క్రాపింగ్ కూడా జరుగుతోంది. స్కిల్డ్ మ్యాన్ పవర్ లోటు లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. – నీలం సాహ్ని, సీఎస్ -
ఆగస్టులో చేయూత.. సెప్టెంబర్‌లో ఆసరా
పాడి పరిశ్రమాభివృద్ధికి అమూల్‌తో ఒప్పందం చేసుకున్నాం. రానున్న రోజుల్లో మరిన్ని ప్రఖ్యాత కంపెనీలతో ఒప్పందాలు చేసుకోబోతున్నాం. ఈ కంపెనీలు, బ్యాంకుల సహాయంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను మార్చడానికి ప్రయత్నిస్తున్నాం. – సీఎం జగన్ సాక్షి, అమరావతి: ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాలను ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న అర్హత కలిగిన మహిళలకు వైఎస్సార్ చేయూత ద్వారా ఏటా రూ.18,750 చొప్పున నాలుగు సంవత్సరాలు అందిస్తామని తెలిపారు. వైఎస్సార్ ఆసరాతో 90 లక్షలకుపైగా ఉన్న డ్వాక్రా మహిళలకు అండగా నిలుస్తామని చెప్పారు. బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో తన అధ్యక్షతన జరిగిన 211వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం ► క్లిష్ట పరిస్థితుల్లో బ్యాంకర్లు ఏపీకి సహకరిస్తున్నారు. సున్నా వడ్డీ పంట రుణాలకు సంబంధించి రైతుల ఖాతాల వివరాలను పంపాలని కోరుతున్నాను. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను చెల్లించాం. ఈ ఏడాదికి సంబంధించినవి కూడా (2019–20) రైతులకు చెల్లిస్తాం. ► ప్రభుత్వం ఒక పథకం ప్రారంభించింది అంటే.. దాని మీద విశ్వాసం, నమ్మకం కలగాలి. దీన్ని అమలు చేయకుంటే ప్రజలు బాగా ఇబ్బంది పడతారు. మేం చెప్పిన దానికి కట్టుబడి ఉన్నాం. చెప్పిన ప్రకారం అన్నీ నెరవేరుస్తున్నాం. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మహిళల సాధికారిత దిశగా రెండు పథకాలను ప్రారంభిస్తున్నాం. ► 25 లక్షల మహిళలకు వైఎస్సార్ చేయూత అందిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో 45 నుంచి 60 ఏళ్ల మధ్య అర్హత ఉన్న మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్ల పాటు రూ.75 వేలు సాయం అందిస్తాం. ఈ సహాయం ద్వారా వారి జీవితాల్లో మార్పులు తీసుకువచ్చే దిశగా చర్యలు చేపడుతున్నాం. మహిళలకు ఆదాయం తెచ్చే కార్యక్రమాలు చేపట్టాలి ► సెప్టెంబర్‌లో స్వయం సహాయక సంఘాలకు రూ.6,700 కోట్లకు పైగా ఇవ్వబోతున్నాం. మొత్తమ్మీద ఏటా రూ.11 వేల కోట్ల చొప్పన, నాలుగేళ్ల పాటు ఈ రెండు పథకాలకు రూ.44 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ► 90 లక్షల మందికిపైగా స్వయం సహాయక సంఘాల మహిళలకు వైఎస్సార్ ఆసరా ద్వారా, 25 లక్షల మంది మహిళలకు వైఎస్సార్ చేయూత కింద.. మొత్తంగా కోటి మందికి పైగా సహాయం లభిస్తుంది. ► అమూల్ తరహాలో మరిన్ని ఒప్పందాలు చేసుకుంటాం. ఈ కంపెనీలు, బ్యాంకర్లు ఒక తాటిమీదకు వచ్చి, ఈ మహిళలకు ఆదాయాలను తెచ్చే కార్యక్రమాలను చేపట్టాలి. గ్రామాల్లో మెరుగైన ఆర్థిక వ్యవస్థలను తీసుకురావడానికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయి. ► కోవిడ్ నివారణా చర్యలను పగడ్బందీగా చేస్తున్నాం. రోజుకు 50 వేలకు పైగా పరీక్షలు చేస్తున్నాం. దేశంలోనే ఇది అత్యధికం. ప్రతి మిలియన్‌కు 32 వేల మందికిపైగా పరీక్షలు చేస్తున్నాం. క్లస్టర్ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టి 90 శాతానికి పైగా పరీక్షలు చేస్తున్నాం. ► ఈ సమావేశంలో ఎస్ఎల్బీసీ కన్వీనర్, బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫీల్డ్ జనరల్ మేనేజర్ వి.బ్రహ్మానందరెడ్డి, నాబార్డ్ సీజీఎం సుధీర్‌కుమార్, సీఎస్ నీలం సాహ్ని, పలు శాఖల ఉన్నతాధికారులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దినేశ్‌కుమార్ గార్డ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ప్రజారోగ్యానికి ప్రాధాన్యం రైతులు, మహిళలు, ప్రజారోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుంది. అన్ని వర్గాల వారికి ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నాం. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు బ్యాంకర్లు పూర్తి సహాయ, సహకారాలు అందించాలి. – డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ నగదు కోసం బ్యాంకుకు రానక్కర్లేదు ► నగదు కోసం ప్రజలు బ్యాంకులకు రావాల్సిన అవసరం లేదు. అన్ని ఏటీఎం కేంద్రాల్లో అవసరాల మేరకు నగదును ఉంచుతున్నాం. దీని వల్ల భౌతిక దూరం పాటించడానికి వీలుంటుంది. ప్రజలు తప్పనిసరి అయితేనే బ్యాంకులకు రావాలి. వైఎస్సార్ కడప జిల్లాలో పూర్తి స్థాయి డిజిటలైజేషన్‌ను స్వయంగా పర్యవేక్షిస్తున్నాం. ► వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుబ్రతో దాస్, ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల కోసం ఏటా దాదాపు రూ.11 వేల కోట్లు ఖర్చు చేస్తాం. ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయం మహిళా సాధికారితలో మైలు రాయి కావాలి. మహిళల జీవితాలను మార్చడానికి ఈ సహాయం ఉపయోగపడాలి. దీని కోసం బ్యాంకర్లు ముందుకు రావాలి. -
‘సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవాలి’
సాక్షి, అమరావతి : నగదు బదిలీ రూపంలో ప్రభుత్వ పథకాలను అట్టడుగు వర్గాల వారికి చేరవేయడానికి ఉద్దేశించిన అన్ ఇంకబర్డ్ ఖాతాలు అందించడంలో బ్యాంకులు చక్కటి సహకారాన్ని అందించాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా వివిధ పథకాల కింద నగదును బదిలీ చేయగలిగామని అన్నారు. మంగళవారం సచివాలయంలో 209వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘రైతులకు, ఆటోలు, ట్యాక్సీలు నడుపుకుంటున్నవారికి, మత్స్యకారులకు, చేనేతలకు, అగ్రిగోల్డ్ బాధితులకు, లా నేస్తం కింద దాదాపు రూ.15వేల కోట్లకుపైనే నగదును బదిలీ ద్వారా ఇచ్చాం. పిల్లలను బడికిపంపేలా తల్లులను ప్రోత్సహించడానికి అమ్మ ఒడి కింద ఈ నెలలో సుమారుగా రూ. 6500 కోట్లు ఇవ్వబోతున్నాం. ఆర్థిక మందగమనం ఉన్నప్పుడు, దాని ప్రభావం సమాజంలోని అట్టడుగు వర్గాలపైనే ఉంటుంది. ఈ పథకాల ద్వారా అట్టడుగున ఉన్న వర్గాల వారికి ఆక్సిజన్ అందించగలిగాం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో 60శాతం వ్యవసాయ రంగమే, 62 శాతం మంది ప్రజలు ఈరంగంపైనే ఆధారపడుతున్నారు. వారిని ఆదుకోకపోతే ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుందని అనుకోలేం. ప్రభుత్వం, బ్యాంకులు ఒకేతాటిపైకి వస్తే మరిన్ని కార్యక్రమాలు చేయగలం. ఈ ఏడాది మంచి వర్షాలు పడ్డాయి. అలాగే రైతు భరోసాతో రైతులను ఆదుకున్నాం. వ్యవసాయ రంగం బాగుండడం ద్వారా ఆర్థిక వ్యవస్థ ముందడుగు వేస్తుందని ఆశిస్తున్నాం. కౌలు రైతుల చట్టం పూర్తి పారదర్శకంగా ఉంది.. కౌలు రైతుల విషయంలో లక్ష్యాలకు అనుగుణంగా రుణాలు ఇవ్వడంలేదని ఎస్ఎల్బీసీ లెక్కలు చెప్తున్నాయి. అందుకే కౌలు రైతులకోసం ఒక చట్టాన్ని తీసుకు వచ్చాం. కౌలు రైతుల చట్టం పూర్తి పారదర్శకంగా ఉంది. రైతుల హక్కులను పరిరక్షిస్తూనే.. 11 నెలలకు సాగు ఒప్పందం ఈ చట్టం ద్వారా వీలు కల్పిస్తోంది. రైతుల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదు. ప్రతి 2వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయం ఉంది, 10 నుంచి 12 మంది ఉద్యోగులు వారికి అందుబాటులో ఉన్నారు, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉన్నారు. ప్రతి పథకాన్ని పారదర్శక విధానంలో వివక్షకు, అవినీతికి తావులేకుండా అందిస్తున్నాం. గ్రామ సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్కూడా ఉన్నారు. వీరిని సమర్థవంతంగా వాడుకోవాలి. కౌలు రైతు చట్టం వల్ల మరింత మంచి జరుగుతుంది. ఈ చట్టాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి. కౌలు రైతులకు మంచి జరిగేలా బ్యాంకర్లు మరింత ముందడుగు వేయాలి. వారిలో చైతన్యం, అవగాహన కలిగించేలా వ్యవసాయశాఖ కార్యక్రమాలు చేపట్టాలి. గ్రామ సచివాలయం పక్కనే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఏప్రిల్‌నాటికి దాదాపు 11వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. శిక్షణ కేంద్రంలా, రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అదించేలా ఈ రైతు భరోసా కేంద్రాలు వ్యవహరిస్తాయి. వీటికి ప్రభుత్వం గ్యారెంటీ కూడా ఇస్తుంది. సాగులో ఉత్తమ యాజమాన్య పద్ధతులపై రైతు భరోసా కేంద్రాల్లో శిక్షణ ఇస్తాం. అలాగే రైతుల ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలుగా కూడా భవిష్యత్తులో ఇవి పనిచేస్తాయి. రైతులను ఆదుకునేందుకు ధరల స్థిరీకరణ నిధినికూడా పెట్టాం. రైతు భరోసా కేంద్రాలను ఇంటర్నెట్ సౌకర్యంతో అనుసంధానిస్తాం. దీనివల్ల డిజిటలైజేషన్ పెరుగుతుంది. బ్యాంకర్లు, ప్రభుత్వం కలిసి కౌలు రైతులకు మరింత ఎక్కువగా రుణాలు అందించేలా ముందడుగు వేయాల్సి ఉంది. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవాలి.. వైఎస్సార్ నవోదయం కింద కూడా ఖాతాల పునర్ వ్యవస్థీకరణపై కూడా దృష్టిపెట్టాలి. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకోవాలి. ఏపీ ప్రధాన మంత్రి ముద్ర యోజన వినియోగంలో 12 ర్యాంకులో ఉందని చెప్తున్నారు. ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో వాడుకోవాలి. చిరువ్యాపారులు, తోపుడు బళ్లమీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు చాలామంది ఉన్నారు. వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వడ్డీలేని రుణాలు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. గుర్తింపు కార్డులతో వీరికి రూ.10వేల చొప్పున వడ్డీలేని రుణాలు ఇవ్వాలన్నది ఆలోచన. దీంతో దాదాపు 12 లక్షల మంది లబ్ధిపొందుతారని అంచనా వేస్తున్నాం. ప్రధాన మంత్రి ముద్ర యోజన ఇక్కడ సద్వినియోగం అవుతుందని ఆశిస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచీ దీనిపై దృష్టిపెడతాం. అలాగే స్వయం సహాయక సంఘాల రుణాలపై కూడా దృష్టిపెట్టాలి. వడ్డీలేని రుణాలు మహిళా సంఘాలకు ఇస్తాం. అలాగే రైతులకూ ఇస్తాం. ఈ రెండింటికీ ప్రభుత్వం తప్పకుండా భరోసా ఇస్తుంది. మహిళలు, రైతుల విషయంలో బ్యాంకర్లు మానవతా దృక్పథంతో వారికి రుణాలు ఇవ్వాలని కోరుతున్నాం. స్వయం సహాయక సంఘాల రుణాలపై వివిధ జిల్లాల్లో వేసే వడ్డీల్లో వ్యత్యాసం ఉంది. 6 జిల్లాల్లో 7 శాతం, 7 జిల్లాల్లో 12 శాతం ఉంది. దీన్ని తొలగించేలా కృషిచేయాల్సి ఉంది. సకాలంలో రైతులకు, స్వయం సంఘాలకు రుణాలు ఇవ్వాలని కోరుతున్నాం. వడ్డీ చెల్లింపునకు ప్రభుత్వం బ్యాంకర్లకు భరోసా ఇస్తుంది. గత ప్రభుత్వం వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీకింద పెట్టిన బకాయిలు రూ. 648.62 కోట్లు ఉన్నాయని బ్యాంకర్లు చెప్తున్నారు. కొన్ని ప్రభుత్వాలు హామీలు ఇచ్చి.. విఫలమవుతాయి. ఈ డబ్బు చెల్లించాలని పదేపదే బ్యాంకులు నా దృష్టికి తీసుకు వచ్చాయి. ఈ విషయంలో సానుకూలంగా స్పందిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలను కూడా బ్యాంకర్లు దృష్టిపెట్టాలని కోరుతున్నాం. అనవసర వ్యయాలను తగిస్తున్నాం. ప్రాధాన్యతల ప్రకారం ముందుకు పోతున్నాం. ఈ మధ్యకాలంలో పత్రికల్లో హెడ్డింగులు చూస్తూనే ఉన్నారు. కానీ, మేం తీసుకున్న చర్యలన్నీ సదుద్దేశంతో తీసుకున్నవే. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్నాం. రాష్ట్రం ఆర్థికంగా బలోపేతం కావాల్సి ఉంది. మాకు కొన్ని కలలు, ఆకాంక్షలు ఉన్నాయి.. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం ద్వారా కరవు ప్రాంతాలకు గోదావరి వరదజలాలను తరలించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. సీడబ్ల్యూసీ డేటా ప్రకారం శ్రీశైలం వద్ద కృష్ణాలో వచ్చిన నీళ్లు 47 సంవత్సరాల సగటు 1200 టీఎంసీలు, గత 10 ఏళ్లలో 600 టీఎంసీలకు పడిపోయింది. గత 5 ఏళ్లలో 400 టీఎంసీలకు పడిపోయింది. మరోవైపు గోదావరిలో 3వేల టీఎంసీలు సముద్రంలోకి వెళ్తున్నాయి. గోదావరి మిగులు జలాలను వాడుకోవాల్సి ఉంది. 62శాతం ప్రజలు ఇంకా వ్యవసాయంమీద ఆధారపడి ఉన్నారు. రిజర్వాయర్‌లో నీటిని నిల్వచేసి కరువు ప్రాంతాలకు తరలించాల్సి ఉంది. సంపూర్ణ అక్ష్యరాస్యత దిశగా అడుగులు.. స్కూళ్లు, ప్రభుత్వాసుపత్రులను తిరిగి పునరుద్ధరిస్తున్నాం. నాడు – నేడు కింద కార్యక్రమాలు చేపడుతున్నాం. మొత్తం 45 వేల స్కూళ్లు, జూనియర్‌కాలేజీలు, డిగ్రీ కాలేజీలను బాగుచేస్తున్నాం. దాదాపు రూ12వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. అమ్మ ఒడి అనే గొప్ప కార్యక్రమాన్ని చేపడుతున్నాం. సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగు వేస్తున్నాం. ఇంగ్లిషు మీడియంను ప్రవేశపెడుతున్నాం. మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంచుతున్నాం. వచ్చే 4–5 ఏళ్లలో విద్యాపరంగా మిగిలి రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రం అగ్రస్థానంలో ఉండే విధంగా అడుగులు వేస్తున్నాం. ఉగాది నాటికి 25 లక్షల ఇళ్లపట్టాలు.. ఈ ఉగాది నాటికి సంతృప్తస్థాయిలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ కూడా 25 లక్షల ఇళ్లపట్టాలు ఇస్తున్నాం. ఆతర్వాత ప్రతి ఏటా 6 లక్షల చొప్పున ఇళ్లు కడతాం. ఈకార్యక్రమం పారిశ్రామికంగా చాలా ఉపయోగపడుతుంది. సిమ్మెంటు, ఐరన్ ఉత్పత్తుల కొనుగోళ్లు పెరుగుతాయి. అలాగే వాటర్ గ్రిడ్ ద్వారా రక్షిత తాగునీటిని ప్రతి ఇంటికీ అందించాలని లక్ష్యంగా పెట్టుకుని ఆమేరకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ ప్రజల జీవనప్రమాణాలు పెంచేవి. వీటికి బ్యాంకర్లుగా మీ సహాయం కావాలి’ అని కోరారు. -
డబ్బాంతా రైతులకు నిజంగా ఇస్తున్నారా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో 207వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం (ఎస్ఎల్బీసీ) జరిగింది. ఈ సందర్భంగా 2019-20 రాష్ట్ర రుణ ప్రణాళిక (బ్యాంకింగ్)ను సీఎం ఆవిష్కరించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకొచ్చాక జరిగే తొలి సమావేశం కావడంతో దీనిపై బ్యాంకర్లు, ప్రభుత్వ అధికారులు ప్రత్యేకంగా కసరత్తు చేశారు. వార్షిక రుణ ప్రణాళిక విడుదల సందర్భంగా తమ ప్రభుత్వ ప్రాధాన్యతలపై సీఎం బ్యాంకులకు దిశా నిర్దేశం చేసిశారు. ఎస్ఎస్బీసీ నివేదికలో ఏటేటా వ్యవసాయ రుణాలు, డ్వాక్రారుణాలు ఎందుకు చూపిస్తున్నారని వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ప్రశ్నించారు. దీనికి కారణాలు ఏంటనీ? ఈ డబ్బు అంతా రైతులకు నిజంగా ఇస్తున్నారా? లేదా పాత రుణాలను రీ షెడ్యూల్ చేయడంవల్ల పెరుగుతున్నాయా? అని ఆరా తీశారు. అయితే కొత్త అప్పులు ఇవ్వకుండా పాత అప్పులనే వడ్డీలతో కలిపి చూపడంవల్ల ఈ అంకెలు పెరుగుతున్నాయని బ్యాంకర్లు సీఎం ముందు అంగీకరించారు. దీని వల్ల రైతులు లేదా డ్వాక్రా మహిళలకు సంబంధించిన రుణాలు వారు ఆర్థికంగా బలపడ్డారని కాకుండా మరింత అప్పులుపాలయ్యారని ఈ లెక్కలు చూపిస్తున్నాయని ఈ సమావేశంలో తేలింది. మహిళలను వేధింపులకు గురి చేయొద్దు.. గత ప్రభుత్వం సున్నా వడ్డీకోసం చెల్లించాల్సిన తన వాటాను చెల్లించిందా? అని సీఎం ప్రశ్నించారు. కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో 207వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 2019-20 రాష్ట్ర రుణ ప్రణాళిక (బ్యాంకింగ్)ను సీఎం ఆవిష్కరించారు. అనంతరం అధికారులతో ఆయన ప్రస్తుత పరిస్థితిపై సుధీర్ఘంగా చర్చించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకొచ్చాక జరిగే తొలి సమావేశం కావడంతో దీనిపై బ్యాంకర్లు, ప్రభుత్వ అధికారులు ప్రత్యేకంగా కసరత్తు చేశారు. వార్షిక రుణ ప్రణాళిక విడుదల సందర్భంగా తమ ప్రభుత్వ ప్రాధాన్యతలపై సీఎం బ్యాంకులకు దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రైతులకు సున్నావడ్డీ లభించకపోవడం వల్ల రుణమాఫీ 87,612 కోట్లు చేస్తానని చివరికి రూ.15వేల కోట్లు కూడా చేయకపోవడం వల్ల రైతులు పూర్తిగా అప్పులు పాలైన విషయాన్ని 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో స్వయంగా చూశానని వైఎస్ జగన్ గుర్తుచేశారు. ఏటా రైతులు రూ.87,612 కోట్ల మీద రూ.7–8వేల కోట్ల వడ్డీలు కడితే చంద్రబాబు ప్రభుత్వం ఏటా సగటున రూ.3 వేల కోట్లు కూడా రుణమాఫీకి విడుదల చేయకపోవడం వల్ల రైతాంగం పూర్తిగా దెబ్బతిందన్న విషయాన్ని ప్రస్తావించారు. గత ఐదేళ్లలో నాలుగేళ్లు కరువు ఉందని, ఇటువంటి పరిస్థితుల్లో రైతులు రుణభారంతో దెబ్బతిని ఉన్నారని, ఇప్పుడు బ్యాంకర్లు రైతులను డ్వాక్రా మహిళలను వేధింపులకు గురి చేయొద్దని స్పష్టం చేశారు. ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500 రైతుల్లో మానసిక స్థైర్యాన్ని పెంచకపోతే పరిణామాలు ప్రమాదకరంగా ఉంటాయన్నారు. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికే, రైతులు నిలదొక్కుకునేలా చూసేందుకే నవరత్నాలను అమలు చేయబోతున్నామని సీఎం స్పష్టంచేశారు. ఈ ఆలోచనతోనే మే నెలలో రైతు భరోసా కింద ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500 నేరుగా ఇవ్వబోతున్నామని సీఎం బ్యాంకర్లకు తెలిపారు. రాష్ట్రంలో రైతుల వద్ద సగటున 1.25 ఎకరాలు మాత్రమే భూమి ఉందని, కాబట్టే రైతులందరికీ అయ్యే పెట్టుబడి వ్యయంలో దాదాపుగా 70శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించే ఉద్దేశంతోనే రైతు భరోసాను అమలు చేయబోతున్నామని చెప్పారు. కాబట్టే రైతులకు ఇవ్వబోతున్న ఈ సొమ్మును వారికి ఇంతకుముందు ఉన్న అప్పులకు జయచేసే వీలే ఉండకూడదని ముఖ్మమంత్రి బ్యాంకర్లకు గట్టిగా చెప్పారు. రాష్ట్రంలో అక్షరాస్యత కూడా చాలా తక్కువగా ఉందని, జాతీయస్థాయిలో నిరక్షరాస్యత 26శాతం ఉంటే మన రాష్ట్రంలో 33 శాతం ఉన్నారని, ఈ పరిస్థితులు మార్చి ప్రతి ఇంటా చదువుల దీపాలు వెలిగించేందుకే అమ్మ ఒడిగా కింద పిల్లలను బడికి పంపే తల్లులకు ఏడాదికి రూ.15వేలు ఇస్తున్నామని, అలాగే ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాల పేదరికాన్ని, సామాజిక వెనకబాటును దృష్టిలో ఉంచుకునే వారికి కూడా నేరుగా చేతికి డబ్బు అందించే పథకాలను ప్రవేశపెడుతున్నామని, నవరత్నాల్లోని ఈ పథకాలు అన్నింటి ద్వారా తాము అదించబోయే ప్రతి పైసా వారికే నేరుగా అందించేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, కన్నబాబు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఎస్ఎల్బీసీ అధ్యక్షుడు ఎస్.దాస్ పాల్గొన్నారు -
వ్యవసాయానికి పెద్దపీట
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1.46 లక్షల కోట్లతో రూపొందించిన వార్షిక రుణ ప్రణాళికను రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) గురువారం విడుదల చేసింది. గత ఏడాది వార్షిక రుణ ప్రణాళిక మొత్తంతో పోలిస్తే రుణ వితరణ లక్ష్యంలో 6.95 శాతం వృద్ధి కనిపించింది. ఎస్ఎల్బీసీ అధ్యక్షుడు జె.స్వామినాథన్ అధ్యక్షతన గురువారం హైదరాబాద్‌లో సమావేశమైన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ 2018–19 వార్షిక రుణ ప్రణాళిక తీరుతెన్నులను సమీక్షించడంతో పాటు, 2019–20లో లక్ష్యాల సాధనకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరై ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించడంతో పాటు, లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు సహకరించాల్సిందిగా కోరారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1.46 లక్షల కోట్లతో రూపొందించిన వార్షిక రుణ ప్రణాళికను ఎస్ఎల్బీసీ గురువారం విడుదల చేసింది. 2018–19 వార్షిక రుణ ప్రణాళిక మొత్తం రూ.1.36 లక్షల కోట్లు కాగా, ప్రస్తుతం 6.95 శాతం మేర కేటాయింపులు పెంచారు. రూ.1.01 లక్షల కోట్లతో.. అనగా మొత్తం కేటాయింపుల్లో 69 శాతం ప్రాధాన్యత రంగాలకే కేటాయించారు. ఈ రంగాల్లోనూ వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్ఎల్బీసీ ప్రకటించింది. గత ఏడాది రుణ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి రూ.58.06 వేల కోట్లు కేటాయించగా, ప్రస్తుతం 68.59 వేల కోట్లు వితరణ చేయాలని నిర్ణయించారు. ప్రాధాన్యత రంగం కేటాయింపుల్లో వ్యవసాయానిది 68 శాతం వాటా కాగా, గత ఏడాదితో పోలిస్తే 18.14 శాతం మేర అదనంగా రుణ వితరణ జరగనుంది. వ్యవసాయానికి కేటాయించిన రూ.68 వేల కోట్లలో పెట్టుబడి రుణంగా రూ.19,856 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించారు. గత ఏడాది ఈ మొత్తం రూ.15,569 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. ప్రాధాన్యత రంగం కేటాయింపుల్లో వ్యవసాయం తర్వాత సూక్ష్మ, లఘు పరిశ్రమల రంగాని(ఎంఎస్ఎంఈ)కి ప్రాధాన్యత ఇస్తూ, రూ.21,420 కోట్లు రుణ వితరణ లక్ష్యంగా నిర్దేశించారు. గత ఏడాది ఈ మొత్తం 21,381 కోట్లు కాగా, ప్రస్తుతం రూ.29 కోట్ల మేర పెంచుతూ లక్ష్యం ఖరారు చేశారు. స్వల్పకాలిక రుణాల్లో వెనుకంజ... 2018–19 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకర్లు స్వల్పకాలిక వ్యవసాయ రుణ వితరణ లక్ష్యంలో 79.43 శాతం అనగా రూ.33,752 కోట్లు మాత్రమే రుణ వితరణ చేశారు. అయితే పెట్టుబడి రుణాల విషయంలో మాత్రం రూ.15,568 కోట్ల లక్ష్యానికి మించి రూ.17,600 కోట్లు మంజూరు చేశారు. రూ.534 కోట్లు విద్యకు, రూ.5,849 కోట్లు గృహ రుణాల రూపంలో ఇచ్చారు. సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమల రుణ వితరణలో బ్యాంకర్లు ఏకంగా లక్ష్యానికి మించి రూ. 36,639 కోట్ల మేర అనగా.. 171 శాతం రుణాలిచ్చారు. 1.46 లక్షల మంది మైనారిటీలకు రూ.2,257 కోట్లు, బలహీన వర్గాలకు రూ.15,367 కోట్లు, ఎస్సీ, ఎస్టీలకు రూ.3,930 కోట్లు రుణం ఇచ్చారు. 2018–19లో ప్రధాన మంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) కింద రూ.6,242 కోట్లు లక్ష్యం కాగా, రూ,7,777 కోట్లు రుణ వితరణ జరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్యత రంగంలో రూ.95,736 కోట్ల మేర రుణాలిచ్చి 103.22 శాతం లక్ష్యం సాధించారు. విస్తరిస్తున్న బ్యాంకు సేవలు... బ్యాంకు సేవల విస్తరణలో భాగంగా 5 వేల పైబడిన జనాభా ఉన్న 245 గ్రామాల్లో 2018–19లో బ్యాంకులు కొత్త శాఖలు ఏర్పాటు చేశాయి. ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన కింద 81.76 లక్షల ఖాతాలను ఆధార్‌తో అనుసంధానించారు. వీటిలో 74.99 లక్షల మందికి రూపే కార్డులు మంజూరు చేశారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద 59.46 లక్షల మందికి ప్రయోజనం కలగగా, 20 లక్షల మంది ఖాతాదారులను ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కిందకు తెచ్చారు. ప్రజల్లో బ్యాంకు లావాదేవీలపై అవగాహన కల్పించేందుకు జూన్ 3 నుంచి 7 తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. రుణమాఫీ మార్గదర్శకాలపై కొనసాగుతున్న కసరత్తు సాక్షి, హైదరాబాద్ : వ్యవసాయ సంక్షోభం నుంచి రైతులను గట్టెక్కించేందుకు సాగు రుణాల మంజూరులో బ్యాంకర్లు ఉదారంగా వ్యవహరించాలని రాష్ట్ర ఆర్థిక ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు అన్నారు. రైతు రుణమాఫీలో గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, ప్రస్తుతం స్పష్టమైన మార్గదర్శకాలపై కసరత్తు చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో గురువారం జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సదస్సులో 2019–20 వార్షిక రుణ ప్రణాళిక విడుదల చేశారు. కాళేశ్వరం జలాలతో పెరిగే సాగు విస్తీర్ణానికి అనుగుణంగా మార్కెటింగ్, ఇతర వ్యవసాయ మౌలిక సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వృద్ధిరేటు 15.5 శాతంగా ఉందని, ప్రాధాన్యత రంగంతో పాటు, ఇతర రంగాల్లో రుణ వితరణ లక్ష్యం 40 శాతానికి పైగా ఉండటం శుభసూచకమన్నారు. అనుబంధ రంగాలకు రుణాలు.. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో వ్యవసాయంతో పాటు, దాని అనుబంధ రంగాలకు రుణ వితరణ పెంచాలని వ్యవసాయ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి బ్యాంకర్లను విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఉద్యాన, పట్టు పరిశ్రమలకు ఉజ్వల భవిష్యత్ ఉందని, వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణ వితరణ పెంచడం ద్వారా రుణ వితరణ సులభతరమవుతుందన్నారు. గ్రామీణుల ముంగిటకు బ్యాంకింగ్ సేవలు తీసుకెళ్లాలన్నారు. ప్రాధాన్యత రంగాలకు రుణ మంజూరులో అగ్రస్థానం ఇస్తూనే, ఇతర రంగాల్లో రుణ వితరణ లక్ష్యం చేరుకోవాలని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రీజినల్ డైరెక్టర్ సుభ్రతాదాస్ అన్నారు. ఎస్ఎల్బీసీ రాష్ట్ర అధ్యక్షుడు జె.స్వామినాథన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 2018–19 ఆర్థిక సంవత్సరంలో రుణాల మంజూరు తీరుపై ఎస్ఎల్బీసీ సమీక్షించింది. ధరణి పోర్టల్ అందుబాటులో లేకపోవడంతో పంట రుణాల మంజూరులో ఎదురవుతున్న సమస్యలను బ్యాంకర్లు ప్రస్తావించారు. ఈ సమావేశంలో వ్యవసాయ కమిషనర్ రాహుల్ బొజ్జా, నాబా ర్డు సీజీఎం విజయకుమార్, ఆర్బీఐ జీఎం సుందరం శంకర్, ఎస్ఎల్బీసీ కన్వీనర్ యూ ఎన్ఎన్ మయ్యా పాల్గొన్నారు. ఎస్ఎల్బీసీ అధ్యక్షుడు స్వామినాథన్ పదోన్నతిపై వెళ్తున్న నేపథ్యంలో నూతన చైర్మన్‌గా ఓబుల్‌రెడ్డి నియామకాన్ని సమావేశం ఆమోదించింది. -
ఒకటో తారీఖు అంటేనే భయం వేస్తోంది..
సాక్షి, అమరావతి : ఒకటో తారీఖు వస్తుందంటే భయపడాల్సి వస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గురువారం సీఎం నివాసంలో చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈసందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న నగదు కొరత సమస్యపై ముఖ్యమంత్రి బ్యాంకు అధికారులతో చర్చించారు. ఒకటో తేది వస్తే భయం వేస్తోందని, ఒక్క ఫించన్ల కోసమే రూ.450 కోట్లు కావాలన్నారు. ఎందుకు రాష్ట్రంలో నగదు లభించడం లేదంటూ బ్యాంకు అధికారులను ప్రశ్నించారు. బ్యాంకుల తీరుతో ప్రజల్లో ఇబ్బందికర వాతావరణం సృష్టించారని మండిపడ్డారు. ఏ బ్యాంకు అయినా ఇబ్బందుల్లలో ఉంటే డిపాజిట్లర డబ్బు వాడుకుంటాం అనే సంకేతాలను ప్రజల్లోకి పంపారని, అందువల్లే ఈ సమస్యలు వచ్చాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పీఎన్బీ కుప్పకూలడంతో ప్రతిఒక్కరిలో భయం పట్టుకుందని, అది తొలగించాల్సిన బాధ్యత బ్యాంకులదేనన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అడిగిన పలు ప్రశ్నలుకు బ్యాంకు అధికారులు సమాధానాలు చెప్పే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 85శాతం ఏటీఎంలు పనిచేస్తున్నాయని తెలిపారు. డిపాజిట్లుగా వస్తున్న నగదు నాలుగోవంతుకు పడిపోయిందని వెల్లడించారు. ప్రజలు వినియోగదారులు తీసుకున్న డబ్బులో చాలా వరకు ఖర్చు చేయడంలేదని, అందుచేతనే నగదుకు తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయని బ్యాంకర్లు స్పష్టం చేశారు. మరో రెండు రోజుల్లో ఐదు వందల కోట్లు నేరుగా ప్రింటింగ్ నుంచి రాష్ట్రానికి వస్తున్నాయని బ్యాంకు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. -
కేంద్రం ఏం చేద్దామనుకుంటోంది : యనమల
సాక్షి, అమరావతి : ఆంధధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంక్ అధికారుల సమావేశం జరిగింది. ఇందులో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో పాటు పలు బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యనమల బ్యాంకుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తీవ్ర నగదు కొరత ఏర్పడిందని, ఏటీఎంలు మూతపడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఏటీఎంల్లో నగదు అందుబాటులో ఉండటంలేదని.. కనీసం వెయ్యి రూపాయలు కూడా దొరకడం లేదన్నారు. ఏటీఎంలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా నగదు దొరకని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. నగదు కొరతతో రియల్ఎస్టేట్ రంగం పడిపోయిందని, ఎకనామిక్ యాక్టివిటి జరగడంలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో వృద్ధిరేటు శాతం తగ్గిపోయిందని, భవిష్యత్తులో మనీ సర్క్యూలేషన్ లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందుల వస్తాయని యనమల అన్నారు. రాష్ట్రంలో చాలా వరకు ఏటీఎంలు మూతపడ్డాయని, ప్రజలు బ్యాంకుల చుట్టూ, ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నా నగదు దొరకని పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ఇప్పటికైనా పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందని యనమల అభిప్రాయపడ్డారు. నగదు కొరతపై చంద్రబాబు ఇప్పటికే పలుసార్లు కేంద్రానికి లేఖ రాశారని తెలిపారు. నల్లధనాన్ని అరికడతామని నాడు కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసిందని, కానీ అది పెద్దగా ప్రభావం చూపలేకపోయిందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా నోట్ల రద్దు వల్ల ఇతరత్రా సమస్యలు అనేకం తలెత్తాయిని పేర్కొన్నారు. రాష్ట్రంలో 2వేల నోట్లు కనిపించకుండా పోయాయని, కనీసం వందనోట్లు కూడా ఎక్కడ దొరకడం లేదంటూ యనమల రామకృష్ణుడు ఆందోళన వ్యక్తం చేశారు డబ్బు సర్క్యులేషన్లో ఉంటేనే ఆర్ధిక కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. ఆర్థిక కార్యకలాపాలు స్థంభిస్తే అభివృద్ధి ఎలా సాధ్యం అంటూ ప్రశ్నించారు. నోట్ల రద్దు ప్రభావం ప్రభుత్వాలపై పడుతోందని, బ్యాంకుల్లో నగదు లేమిని నివారించాలని బ్యాంకు అధికారులను కోరారు. ఈ వ్యవహారంపై కేంద్రం ఏం చేద్దామనుకుంటుందో అర్థం కావడంలేదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే మంత్రి యనమల వ్యాఖ్యలతో బ్యాంకు అధికారులు విభేదించారు. ఆర్బీఐ నుంచి వేల కోట్లు విలువ చేసే కొత్త నోట్లు అందించామని తెలియచేశారు. -
ఆ రూ.500 కోట్లూ మాకిచ్చేయండి
ఎస్ఎల్బీసీ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు సూచన సాక్షి, విజయవాడ బ్యూరో: తాను సృజనాత్మకంగా, కొత్తగా పనిచేస్తున్నానని.. బ్యాంకర్లు కూడా అలాగే పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. పాత విధానాలను వదిలిపెట్టి, టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు. విజయవాడలో శుక్రవారం నిర్వహించిన 194వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి(ఎస్ఎల్బీసీ) సమావేశంలో సీఎం మాట్లాడారు. రెండంకెల వృద్ధిరేటు లక్ష్యంగా తాము పని చేస్తున్నామని.. అందుకనుగుణంగా బ్యాంకులు ప్రాధాన్యత రంగాలకు రుణాలివ్వాలని కోరారు. రుణ ప్రణాళికలకు ఆమోదముద్ర వేయించుకోవడం ప్రధానం కాదని.. అమలులో కూడా అదే వేగం, ఉత్సాహాన్ని చూపించాలని అన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ శాఖలకు లక్ష్యాలు నిర్దేశించామని, బ్యాంకర్లు వారిని సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. ఆర్బీఐ కూడా సృజనాత్మకంగా పనిచేయాల్సి ఉందన్నారు. స్మార్ట్ గ్రామాల ప్రాజెక్టు రిపోర్టులకు నాబార్డు రూ.500 కోట్లు ఖర్చు చేస్తోందని, దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదన్నారు. ఈ మొత్తాన్ని నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికే ఇస్తే మిగిలిన పథకాలతో కలిపి వినియోగిస్తామని, తద్వారా మంచి ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు. రాష్ట్ర రుణ ప్రణాళిక విడుదల ప్రతి గ్రామంలో వ్యక్తిగత మౌలిక వసతులు, సామాజిక మౌలిక వసతులను కల్పించేం దుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలే ఇకపై బ్యాంకింగ్ కరస్పాండెంట్లుగా పనిచేస్తారని, ఇందుకు బ్యాంకులు సహకరించాలని కోరారు. జల సంరక్షణ ద్వారా వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చే పద్ధతులను అమలు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రుణ ప్రణాళికను చంద్రబాబు విడుదల చేశారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో పలు రంగాలకు రూ.1,65,538 కోట్ల రుణాలు మంజూరు చేయాలని ఎస్ఎల్బీసీ ప్రతిపాదించింది. ఈ సమావేశంలో బ్యాంకర్ల సమితి కన్వీనర్, ఆంధ్రాబ్యాంకు జీఎం దుర్గాప్రసాద్, ఎస్ఎల్బీసీ చైర్మన్, ఆంధ్రా బ్యాంకు ఎండీ, సీఈఓ సురేష్ ఎన్.పటేల్, నాబార్డు జీఎం చంద్రశేఖర్, ఆర్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎస్.చెల్లపండి, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.