
ప్రపంచంలో మొదటి కేంద్ర బ్యాంక్?
బియ్యాన్ని అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం?
– పశ్చిమ బెంగాల్
దేశంలో పంటలకు మద్దతు ధరలను రూపొందించేది? – వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్
స్పెషల్ డ్రాయింగ్ రైట్స్‌ను మంజూరు చేసేది?
– ఐఎంఎఫ్ (M)
భారత్‌లో మొదటి రైలు ప్రయాణం ప్రారంభమైన ప్రాంతం? – ముంబై నుంచి థానే వరకు
ఏ రేటు వద్ద ఎగుమతులకు బదులు దిగుమతులు ప్రత్యామ్నాయమవుతాయో వాటిని ఏమంటారు? – వర్తక నిబంధనలు
అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్)లో అధిక కోటా గల దేశం? – అమెరికా
అభిలషణీయ జనాభా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది? – ఎడ్విన్ కానన్
జనాభా స్థిరీకరణను ఏ సంవత్సరం నాటికి సాధించాలని జనాభా విధానం–2000 లక్ష్యంగా పేర్కొంది? – 2045
భారత్‌లోని నిరుద్యోగాన్ని ఏమని వర్ణించొచ్చు?
– నిర్మాణాత్మక నిరుద్యోగం
కర్జన్ బహుళార్థక సాధక నీటి ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? – గుజరాత్
ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? – జెనీవా
భారతీయ యాజమాన్యంలో 1881లో ఆగ్రాలో స్థాపించిన బ్యాంక్? – ఔ«ద్ కమర్షియల్ బ్యాంక్
ప్రపంచం మొదటి కేంద్ర బ్యాంక్?– రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్
హరిత విప్లవం ఏ రాష్ట్రాల్లో ప్రధానంగా చోటు
చేసుకుంది? – పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్
2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఎంత శాతం కుటుంబాలకు మరుగుదొడ్ల సౌకర్యం ఉంది? – 30.7 శాతం
2011 సెన్సెస్‌కు సంబంధించి సెన్సెస్ కమిషనర్?
సి. చంద్రమౌళి
మానవాభివృద్ధి సూచీని జిల్లాల వారీగా రూపొందించిన మొదటి రాష్ట్రం? – మధ్యప్రదేశ్
బ్రిటిష్ పాలనలో భారత్‌లో జాతీయాదాయ వృద్ధి రేటు? – 1.2 శాతం
2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎంత శాతం కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం ఉంది? – 55.3 శాతం
అల్ప ఉద్యోగిత అంటే?
– తన సామర్థ్యం కంటే తక్కువ
స్థాయి పని చేస్తుండటం
ఖాయిలా పడిన పరిశ్రమల చట్టాన్ని ఏ కమిటీ సూచన మేరకు రూపొందించారు?
– తివారి కమిటీ
పెట్టుబడుల ఉపసంహరణ కమిషన్‌ను ఏర్పాటు చేసిన సంవత్సరం? – 1996 ఆగస్టు
చిన్నతరహా పరిశ్రమలకు సంబంధించి రిజర్వేషన్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని సిఫార్సు చేసిన కమిటీ? – అబిద్ హుస్సేన్
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించిన తేది? – 2005, సెప్టెంబర్ 5
భారత ఆర్థిక రాజ్యాంగంగా పిలిచే పారిశ్రామిక తీర్మానం? – 1956 పారిశ్రామిక తీర్మానం
జిల్లా పారిశ్రామిక కేంద్రాలను ఏ పారిశ్రామిక తీర్మానం ద్వారా ఏర్పాటు చేశారు? – 1977
దేశంలో పరపతిని సృష్టించేవి? – వాణిజ్య బ్యాంకులు
ప్రపంచంలో మొదటగా హరిత విప్లవం ఏ దేశంలో వచ్చింది? – మెక్సికో
ఆక్ట్రాయ్ పన్నును విధించేది? – స్థానిక సంస్థలు
పన్నుల సంస్కరణలపై 2002లో ఏర్పాటైన
టాస్క్‌ఫోర్స్ అధ్యక్షుడు? – విజయ్ కేల్కర్
భూతలింగం కమిటీ దేనికి సంబంధించింది?
– పన్నుల ఎగవేత
జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ను ఎప్పట్నుంచి ప్రారంభించారు? – 2005, ఏప్రిల్ 12
షెడ్యూల్డ్ బ్యాంక్ అంటే? – 1934 ఆర్‌బీఐ చట్టంలోని షెడ్యూల్–2లో నమోదైన బ్యాంకులు
వ్యవసాయ ఆదాయంపై పన్నును సిఫార్సు చేసిన కమిటీ? – కె.ఎన్. రాజ్
ఉఇఈ దేశాల ప్రధాన కేంద్రం? – పారిస్
జీడీపీ, జీఎన్‌పీ భావనలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన ఆర్థిక శాస్త్రవేత్త? – సైమన్ కుజ్‌నిట్స్
గినీ సూచీ ద్వారా దేన్ని అంచనా వేయొచ్చు?
– సాపేక్ష పేదరికం
ప్రభుత్వ వ్యయ సంస్కరణలకు సంబంధించి ఏర్పాటైన కమిటీ? – గీతాకృష్ణన్
భారత్‌లో ఒక రూపాయి.. ప్రామాణిక ద్రవ్యంగా ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? – 1835
భారత్‌లోని నిరుద్యోగ స్వభావం? – దీర్ఘకాలికం
మన దేశంలో పేదరికాన్ని అంచనా వేయడంలో విశేష కృషి చేసినవారు? – దండేకర్, రథ్
దేశంలో సిమెంట్ ఉత్పత్తి మొదటగా ఎక్కడ ప్రారంభమైంది? – మద్రాస్‌తమ్మా కోటిరెడ్డి
ప్రొఫెసర్, ఐబీఎస్, హైదరాబాద్